Tuesday, August 5, 2008

రెండవ అధ్యాయం - శుక్రవారం పారాయణ

ఓం శ్రీ సాయిరాం

శ్రీ సాయినాధ చరితామృతం

రెండవ అధ్యాయం - శుక్రవారం పారాయణ


శ్రీ సాయినాధ స్వామి పాదారవిందాలకు ప్రణామాలు!
మా తండ్రీ సాయీ!

నిను కళ్ళారా చూచి, నీతో పాటు తిరిగి, నీతో కలిసి బ్రతికిన షిరిడీ ప్రజలెంత అదృష్టవంతులో! భాగ్యం మాకెలాగూ లేదు. నిన్ను మనసులో నిలుపుకొని, అన్ని వేళల నీ శక్తిని అర్ధం చేసుకో గలిగేలాగా మమ్మల్ని దీవించు. దానం, భార్య పిల్లలూ, ఇల్లు వాకిలి - మూడింటి మధ్యనీ మా బ్రతుకులు తేల్లవారి పోతున్నాయి. నీ అద్భుతమైన శక్తిని మాకు చూపించు స్వామీ! లోకపు బంధాలన్నిటి కన్నా గొప్పదైన నీ ప్రేమను మాకు అందించు. మాకు సరైన దారి చూపించు. నీవు చోపించిన మార్గంలో మేము కూడా పదిమన్దికీ పనికి వచ్చేలాగా బ్రతికేటట్లు దీవించు తండ్రీ.

*****************************

బిక్షాటనం

శ్రీ సాయి జీవన విధానం చాలా ప్రత్యేకంగా వుండేది. ఆయనకు దేని మీదా ఆశా, కోరికా వుండేవి కావు. భిక్శాటనతో జీవించేవారు. భారతీయ ధర్మం తెలిసిన వారెవరికైనా భిక్ష ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. కీర్తి, సంసారం ఇలాంటి వాటి పట్ల కోరిక విడిచి పెట్టి సన్యాసం తీసుకున్న వారు, ఇట్లు వాకిలి, తల్లిదండ్రులను విడిచి దూరదేశాలలొ విధ్య నేర్చుకుంటున్న బ్రహ్మచారులూ భిక్షాటనంతో బ్రతకవచ్చని మన శాస్త్రాలు చెప్తున్నాయి. బ్రహ్మచారులనూ, సన్యాసులనూ పోషించే భాద్యత గ్రుహస్త్ధులదే. పైగా వారికి భిక్ష పెట్టడం వలన గృహస్థుల - అంటే సంసారుల పాపలు కూడా కొంతవరకు పోతాయి. సంసారంలో వున్నారు ప్రతిరోజూ యిళ్లు ఊదవటం, అంట్లు తోమటం, పొయ్యి విలిగించటం, పిండి రుబ్బటం, దంచటం, విసరటం, వంటి పనులు చేయక తప్పదు. అలా చేస్తున్నపుడు మనకు తెలియకుండానే కొన్ని లక్షల చిన్న చిన్న జీవులను (పురుగుల వంటి వాటిని) చంపుతూ వుంటాం. పాపం పోగుట్టుకోవటానికి శాస్త్రాలు ఆరు రకాలైన ఉపాయాలు చూపించాయి. వాటిన్ని యజ్ఞాలంటారు.

అవి - బ్రహ్మయజ్ఞం (యజ్ఞాలూ, హోమాలు చెయ్యటం), వేదాధ్యయనం (వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదవటం), పితృ యజ్ఞం (పితృదేవతల తృప్తి కోసం చేసే కర్మకాండ), దేవ యజ్ఞం (దేవతల తృప్తి కోసం చేసే పూజలు, కొలువులు మొదలగు), భూతయజ్ఞం (నోరు లేని జీవులకు ఆహారం పెట్టడం మొదలగు), అతిధి యజ్ఞం (ఇంటికి వచ్చిన వారిని దైవంతో సమానంగా భావించి, ఆదరించి; ప్రేమతో, శ్రద్ధతో వారికి భోజనం, విశ్రాంతి తీసుకొనే ఏర్పాట్లు చెయ్యటం).

వితిలు అతిధి యజ్ఞం అన్నది చాల మేలైనది. ఎవరైనా మన యింటికి బిక్షకు వస్తే మనం విసుగుతో గానీ, "మేం పెడుతున్నాం" అన్నా గర్వంతో గానీ పెట్టుకూడదు. పైగా వచ్చినవాళ్ళు మనకు మేలు చేస్తున్నారు. మన పాపంలో కొంతైనా పోగొట్టుకొనే అవకాశం మనకిస్తున్నారు - అనే గురవ భావంతో భిక్ష పెట్టాలి. ఇప్పటికీ ఒక్క అతిధైనా లేనిదే భోజనం చేయామని నియమం పెట్టుకుని పాటించే కుటుంబాలు కొన్ని ఉన్నాయి మనదేశంలో. "అభ్యాగతః స్వయం విష్ణుః" అన్నారు పెద్దలు. భిఖాతనం చేస్తూ శ్రీ సాయి బాబా షిరిడీ ప్రజల చేత ప్రతిరోజు యిలా అతిధి యజ్ఞం చేయిఇంచే వారన్నమాట.

ఆయన ప్రతి రోజు మద్యాహ్నం పన్నెండు గంటలు వేళ భిక్షకు వెళ్ళేవారు. తెచ్చిన భిక్షాన్నమంతా ఒక మట్టి పాత్ర లో పెట్టేవారు. ఎవరికి కావాలంటే వారే అందులోనుంచి ఆహారం విసుకునేవాళ్ళు. బాబా దగ్గరికి భక్తులు ఎక్కువగా రావటం ఆరంభమయ్యాక ఎందరెందరో, ఆయనకు రకరకాల పిండివంటలు, భోజనం, పళ్ళు మొదలైనవి తెచ్చి సమర్పించు కొనేవారు. ఆయినా బాబా తమ భిక్షాటనం మాత్రం మానలేదు. ఆయనకు శరిరారోగ్యం బాగుండనప్పుడు ఒక్కక్కసారి తనకు బదులు మరెవరినైనా భిక్ష భావించేవారు భక్తులు. విదేశాలు తిరిగి వచ్చిన కాకాశాహేబ్ దీక్షిత్ వంటి గొప్ప వకీలు గూడా కొన్ని నెలలు షిరిడీ విధులలో బాబాకు బదులు భిక్షాటనం చేశారని చరిత్ర చెప్తున్నది.

బాబాకు పూర్వం వచ్చిన దత్తవతారాలలో ముఖ్యమైన శ్రీపాద శ్రీ వల్లభాస్వామి, నృసింహ సరస్వతి స్వామి కూడా నిత్యం
భిక్షాటనం చేసేవారు. ఇప్పటికీ గానుగాపురంలో మధ్యాహ్నవేళ స్వామి ఏదో ఒక రూపంల్లో భిక్షకు వస్తారని ప్రతీతి. సాయి బాబా ప్రతి జివిలోను తామే ఉన్నానని చెప్పారు కూడా. అందుచేత మన గడపలోకి నెవరినైనా సరే స్వయంగా బాబాయ్ వచ్చినట్లుగా భావించి ఆడరించాలన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. అలా వారిని సేవిస్తే - సేవ బాబాకు ఆనందం కలిగిస్తుంది. మనకూ మేలు చేస్తుంది.

వస్త్రధారణ

శ్రీ సాయి షిరిడీకి వచ్చిన తొలి రోజుల్లో జుట్టు పొడవుగా పెంచి పహిల్వానుల మాదిరిగా దుస్తులు ధరించేవారు. తరువాత తరువాత పొడవైన కఫనీని తొడిగి తలకొక తుమాలను చుట్టి ఎడమవైపున ముడివేసి విపు మీదకు జారవిదిచేవారు. కఫనీని, తలగుడ్డను వారాల తరబడి మార్చేవారు కారు. దుస్తుల పట్ల గానీ, శరీరం పట్ల గానీ వారికి ఏమాత్రం వ్యామోహం ఉండేది కాదు. ఒక్కొక్కసారి తాత్యా మొండిపట్టు పట్టి పోట్లాడి కొత్త కఫనీ తోడిగిస్తుండేవాడు. సాయి చేతిలో ఎప్పుడూ ఒక బలమైన చిన్న పొట్టి కఱ్ఱా ఉండేది దీన్నే మరాఠీ లో సటకా అంటారు.

భిక్షకు వెళ్ళేటప్పుడు భుజానికి జోలె, చేతిలో ఒక తగరపు డబ్బా వంటి పాత్ర ఉండేది. చావడి ఊరేగింపు వంటి సమయాల్లో భక్తులు ఆయన ఒంటి మీద జరీ శాలువాలు కప్పుతుండేవారు. భక్తులు ఎక్కువగా రావడం మొదలయ్యాక వారు పూజ సమయంలో సాయి తల మీద కిరీటం కూడా పెట్టసాగారు. గుర్రాలు, పల్లకీలు వచ్చాయి. ఇవన్ని కేవల భక్తులు తమ ఆనందం కోసం సమకూర్చినవే కానీ - సాయికి అవేవీ పట్టేవి కావు. ఎవరెంత వేడుకున్నా
ఆయన ఎన్నడూ గుర్రాలు, పల్లకీలు ఎక్కనేలేదు. అంత నిరాడంబరంగా జీవించేవారు.


విభూతి, దక్షిణ

శ్రీ సాయి తమ యోగశక్తి తో ద్వారకామాయి మసీదులో ఓకే హోమ గుండాన్ని వెలిగించారు. దానిని ధుని అంటారు. బాబా ధునిలో కాల్చింది కేవలం కట్టెలను మాత్రమే కాదు తన భక్తుల కష్టాలను కూడా అలాగే కాల్చి బూడిద చెయ్యగలడా తండ్రి.

ధునిలో నుంచి వచ్చే విభూతినే "ఊదీ" అంటారు. బాబా ఊదీ తోవే ఎందరికో వ్యాధులు నయం చేసారు. కష్టాన్నైనా యిదే పోగోత్తగలదు. తన దగ్గరకు వచ్చే వారదరికీ ఊదీనే ప్రసాదంగా ఇచ్చేవారు బాబా.

మనం శరీరం ఉన్నన్నినాళ్ళు నా ఇల్లు, నా వాకిలి, నా వాళ్లు - అని ఆరాట పడతాం. కానీ, గుక్కెడు ప్రాణము పోతే మిగిలేదేమిటి? బూడిదే గదా! సాయి తన భక్తులకు క్షణక్షణం సంగతి గుర్తు చేయటానికే యీ ఊదీ యిచ్చేవారేమో!

ఆనాడు సాయి వెలిగించిన ధుని నేటివరకు అలా వెలుగుతూనే వుంది. ప్రతి రోజు స్నానం చేయగానే ఊదీ రవంత నోట్లో వేసుకుని, బొట్టు పెట్టు కుంటే చాలు - ఇక సాయి రక్షా మనతో ఉన్నట్లే.

బాబా తమ వద్దకు వచ్చే భక్తులను దక్షిణ అడుగుతుందే వారు. పెద్దల దగ్గరకు, దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వేల్లగూడదని మన పెద్దలు చెప్తారు. ఏదైనా పూజ చేస్తే తప్పకుండా దక్షిణ పెట్టాలని శాస్త్రాలు చెప్తాయి. డబ్బు పట్ల మనుష్యులందరికి వ్యామోహం ఉంటుంది. ఏదైనా వదులు కుంటారు గానీ డబ్బును వదలుకోలేరు చాలా మంది. అలా కాకుండా, ధన వ్యామోహం కూడా వదులుకుంటేనే గానీ దైవ సాక్షాత్కారం కలగదు. డబ్బు - భగవంతుడు రెంటిలో నిత్యమైనది (నాశనము లేనిది) భగవంతుడే గదా! అనిత్యమైన (నశించిపోయేది) డబ్బును వదులుకుని నిత్యమైన భగవంతుని కరుణా పొందాలి మనం. విషయాన్ని తెలియ జెప్పడానికే సాయి - వచ్చిన వారిని దక్షిణ అడిగేవారు. కొంతమంది దగ్గర అయిదారు సార్లు అడిగాదిగి మరీ తీసుకునేవారు. మరీ కొంతమంది యిస్తామన్నా తీసుకొనేవారు కారు.

ఒకసారి యిద్దరు స్నేహితులు బాబాని చూడటానికి వచ్చారు. బాబా అందులో ఒకరిని "నాకు పదిహేను రూపాయలియ్యాలి నువ్వు ఇవ్వు" అని అడిగి తీసుకున్నారు. రెండవ వారు 35/- రూపాయలు యివ్వభోతే తీసుకోలేదు. ప్రక్కనే ఉన్నా శ్యామా "అలా ఎందుకు చేసారు బాబా! ఇది పక్షపాతం గాదా!" అని అడిగాడు. అందుకు బాబా చిరునవ్వుతో "శ్యామా! నాది కానీ డబ్బు నాకెందుకూ? నేనెవరి దగ్గరయినా ఒక్క రూపాయి దిసుకుంటే తిరిగి పది రూపయలివ్వవలసి వస్తుంది. అన్దుకనీ నాకు రావలసినదే నేను తీసుకుంటాను" అన్నారు. తరువాత భక్తుడు మిగిలిన భక్తులతో యిలా చెప్పాడు.


"చాలా ఏళ్ళ క్రితం మాట. నాకు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం దత్తాత్రేయ స్వామి కి యిస్తానని మొక్కుకున్నాను. ఉంద్యోగం వచ్చింది. నా మొదటి జీతం 15/- రూపాయలు. క్రమంగా అది పెరిగి పెరిగి యిప్పుడు 700/- రూపాయలు అయ్యింది. నేను మాత్రం నా మూక్కును మరచిపోయాను. ఇప్పుడు సాయి దాన్ని గుర్తు చేసి తీసుకున్నారు. దిన్ని బట్టి బాబాయ్ దత్తాత్రేయుడని, ఏదో విధంగా మన మొక్కు తిర్చుకునేదాకా వదలరనీ స్పష్టం అవ్తున్నది". సాయి బాబాకు ఎవరైనా డబ్బు గానీ, ధాన్యం గానీ, వస్తువులు గానీ దక్షిణ గా యిస్తే యిచ్చిన వారికి అంతకు పది రెట్లు లాభం రావటం అన్నది భక్తులందరికి అనుభవమే.


ఒక్కొక్కసారి బాబా డబ్బు కాకుండా వేరే దక్షిణలు కోర్రేవారు. ఒక భక్తురాలిని ఆమెకున్న ఆరు చెడ్డ గుణాలు (కామం, క్రోధం, లోభం, మొహం, మదం, మాత్సర్యం) తమకు దక్షిణగా యిచ్చి వెయ్యమని కోరారు. మరొక భక్తుడు చదువుతున్న గ్రంధం జ్ఞానేశ్వరి నుంచి తొమ్మిది మంచి విషయాలు నేర్చుకొని ఆచరించమనీ, అదే తమకు దక్షిణ అని చెప్పారు.

జ్ఞాన వనం

ద్వారకామాయికి దగ్గరలోనే శ్రీ సాయి బాబా వచ్చి కుండలతో నీళ్ళు మోసి ఒక చక్కని పోలతోతను పెంచారు. అందులో రకరకాల పూల మొక్కలుండేవి. షిరిడీలోని వామన తాత్యా అనే అతడు రోజు రెండు కుండలిచ్చేవాడు. మొక్కలకు నీళ్ళు పోయటం పూర్తికాగానే వాటినొక చెట్టు మొదట బోర్లించేవారు బాబా. పచ్చివి కావటం వల్ల అవి కాస్తా రెండు చెక్కలుగా విదిపోయేవి. అలా బాబా పెంచిన పూలతోట ఉండే చోటనే యిప్పుడు బాబా సమాధి మందిరం ఉంది. ఆనాడు వారు పెంచిన పూల మొక్కలు తరువాతి కాలం లో జ్ఞాన పుష్పాలు పూస్తాయనటానికి సూచన కాబొలూ.

మనిషిని మట్టి కుండలతో పోలుస్తారు పెద్దలు. జ్ఞానం అనే నిప్పులో బాగా కాలిన కుండలు కొందరు మనుష్యులు. వాళ్ళు పరిస్థితుల నెదుర్కొని, చెడ్డ మార్గాలు పట్టకుండా, గట్టిగా నిలబడి పరమాత్మను చేరే మార్గంలో నడవగలరు. మిగిలిన వాళ్లు పచ్చి కుండల లాగా యీ సంసారపు బరువు మొయ్యతంతోనే పగిలిపోతారు. కుమ్మరి దగ్గర కొన్ని పచ్చి కుండలు, కొన్ని కాలిన కుండలు ఉన్నాయనుకుందాం. ఓకే దున్న వచ్చి వాటన్నిటినీ తొక్కి పగుల కొట్టేసింది. అప్పుడు కుమ్మరి కాలిన కుండల పెన్కులన్నింటిని తొక్కి పగుల కొట్టేసింది. అప్పుడు కుమ్మరి కాలిన కుండల పెంకులంన్నింటినీ అవతల పరవేస్తాడు. అవి మళ్లీ కుండలు చెయ్యటానికి పనికి రావు కదా!

పచ్చి కుండల ముక్కల్ని మాత్రం మళ్లీ త్రొక్కి కుండలు చేస్తాడు. అలాగే జ్ఞానం సంపాదించుకొని ఏది మంచో, ఏది చెడో తెలుసుకొని, ఏపని చేస్తున్న దైవ నామమే తలుస్తూ, పవిత్రంగా బ్రతికేవాళ్లు చచ్చిపోతే - వల్లకిక జన్మే లేదు. దేవుని దగ్గరకు చేరి పోవటమే. అవేవి లేకుండా కేవలం తినటం, త్రాగటం, సంసారం లాగటం - యివే పనులుగా బ్రతికే మనుష్యులు మళ్లీ మళ్లీ పుడుతూ, చస్తూ ఉండవలసిందే - మళ్లీ మళ్లీ యీ బురదలో, కంపులో పడుతూ లేస్తూ ఉండవలసిందే.

శ్రీ సాయి బాబా దగ్గరకు ఒక భక్త్దొక సారి కొన్ని మొక్కలు తెచ్చాడు. వాటిని తోటలో నాటడానికి అనుమతి కోరాడు. బాబా ఏమి మాట్లాడలేదు. భక్తుడు నిరాశపడి ఊరుకున్నాడు. మొక్కలు ఎండి పోయాయి. మూడు రోజులు గడిచి పోయాక బాబా " మొక్కలిలా తీసుకురా నాటుదాం" అన్నారు. అతడు 'అవి ఎండి పోయాయి బాబా, ఇంక బ్రతకవు' అన్నాడు. అయినా బాబా వినిపించుకోకుండా "నివు తిసుకురావయ్య" అం తెప్పించి లెండితోటలొ నాటారు. చిత్రంగా అవి బ్రతకతెమే కాదు, కొద్ది సంవత్సరాలలోనే మహా వృక్షాలుగా పెరిగి యిప్పటికీ ఉన్నాయి. అలాటి 'సంజీవని' (చచ్చిన వారిని బ్రతికిన్చగల మూలిక బాబా చెయ్యి.)


సాయి బాబా ప్రతి రోజూ యీ లెండి తోటలో పచార్లు చేస్తుండేవారు. అందులోనే ఆయనొక అఖండదీపం వెలిగించి పెట్టారు. దాన్ని 'నంద దీపం' అంటారు. అది ఆనాటి నుండి యినాటి వరకూ అలా వేలుగుతూనే ఉంది.

బాబా యోగ సాధనలు చేస్తుండేవారు. మామూలుగా యోగులు చేసే విధంగా కాక చిత్ర విచిత్రమైన యోగాలెన్నో సాయి చేస్తుండేవారు. తమ ఉపిరి తిత్తులను బయటకు తీసి ఉతికి ఆరవేసి, ఆరిన తరువాత మళ్ళీ మింగేవారు సాయి బాబా. అలాగే ఆయన శరిరవయవాలన్నిటినీ - అంటే కాళ్ళు, చేతులు, తల - ఇలా భాగానికా భాగాన్ని విడదీసి మళ్ళీ అతికించు కొనే ఖండయోగాన్ని కూడా చేసేవారని భక్తులు చెప్పారు.


అన్నదానం

సాయి బాబా వారికి అన్నాదానం అంటే చాలా యిష్టం. చాలా కాలం పాటు ఆయన తమ దగ్గరకు వచ్చే భక్తులకు, ఉఉరిలో పేద సాదలకు కూడా వంటచేసి భోజనాలు పెడుతున్దేవారు. ఒక్కోసారి నూరు, నూటయాభై మందికి కూడా ఆయనొక్కరే వండి పెట్టేవారు. ఆయన దగ్గర రెండు పెద్ద పాత్రలున్దేవి. ( పాత్రల్ని ఆయన పొయ్యి పెట్టి వంట చేసిన చోటుని ఈనాటికి మనం షిరిడీ లో చూడగలం). వంటకు కావలసిన పదార్ధాలన్నీ వారే కొని తెచ్చుకోనేవారు. మసాలాల వంటివన్నీ తామే నూరేవారు.

ఏవో గొప్ప గొప్ప పనులు సాధించటానికి పుడతారు మహనీయులు. వారికి తిండి, బట్ట, నిద్ర - ఇలాంటివాతిమిడ శ్రద్ధ ఉండదు. తామూ బ్రతకటానికి యెంత అవసరమో అంట మాత్రమె తింటారు వారు. పైగా దాని రుచిని మాత్రమూ పట్టించుకోరు. సాయి బాబా యోగులకే ఆదర్శమూర్తి. అందు చేత ఆయనకు రుచి అంటే ఏమిటో తెలిసీది కాదు. తమకు భక్తులు తెచ్చి యిచ్చే మిఠాయి, రొట్టెలు, అన్నం కూరలు, పచ్చళ్ళు, అన్ని మొత్తం కలిపి పిసికి తినేవారాయన. అలాటి వారికి రుచి మిద పట్టిమ్పెముంటుంది?

కానీ యితరులకు పెట్టేందుకు మాత్రం సాయి బాబా ఎంతో శ్రద్ధగా కమ్మగా వాడేవారు. ఆయన బిరియానీ చేసినా, అంబలి కాచి మజ్జిగలో కలిపినా, గోధుమపిండి బిళ్ళలు వేసి పులుసు కాచినా - వంట చేసినా ఎంతో అద్భుతంగా ఉండేది. పొయ్యి మీది పదార్ధం కలియ బెట్టాలన్నా, ఉదికిందీ లేనీదీ చూడాలన్న సాయి బాబా గరిటె ఉపయోగించే వారు కారు. భగభగ మండుతున్న పొయ్యి మిద మరుగుతున్న పులుసులోనైనా సరే, ఉడుకుతున్న అన్నం లోనైనా సరే ఆయన తన చెయ్యి పెట్టి తిప్పేవారు. ఆయన చెయ్యి ఏమాత్రం కాలేది కాదు . సాధారణంగా మన అందరం ఎంతో శుభ్రంగా, రుచిగా వండి భగవంతుడికి నైవేద్యం పెట్టాలని ప్రయత్నిస్తాం, పెడుతుంటాం. కానీ షిరిడీ ప్రజలు, ఆనాటి బాబా భక్తులు యెంత అదృష్ట వంతులో - స్వయమ్గా భగవంతుడే కమ్మగా వండి వడ్డించారు గదా! నాటికీ తమ పేరిట అన్నదానాలు జరిగే చోటికి బాబా ఏదో ఒక రూపంలో వచ్చి తిన్తారన్నది నిజం.


ద్వారకామాయి చిన్న పడు బడ్డ మసీదు. దానికి దిగువన ఖాళీ స్థలం ఉండేది. మసీదులో ఒకవైపు నింబారు అనే పేరు గల ఒక గూడు, మరో వైపు సాయి వెలిగించిన ధుని, దునికి ఎదురుగా కూర్చునేవారు సాయి. చిన్న చెక్క కట్టడం ఉంది అక్కడ (ఇప్పటికీ). దాని మీద చ్య్యి ఆనించుకొని కూర్చోనేవారు. తమ దగ్గరకు వచ్చే భక్తుల క్షేమ సమాచారాలు, కష్ట సుఖాలు తెలుసుకున్తుండేవారు. వారేడైనా తప్పు చేసి తమ దగ్గరకు వస్తుంటే గట్టిగా మందలించేవారు. కొందరికి ఎంతో ఓర్పుగా నచ్చజేప్పేవారు. చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ వరకు స్త్రీ పురుష భేదం లేకుండా ఎందరో వారి దర్శనానికి వచ్చేవారు. సాధారణంగా తమ దర్శనానికి వచ్చేవారిని సాయి తిరస్కరించీ వారు కారు. కానీ ఒక్కొక్కసారి మాత్రం చాటున ఆయనను నిందించి, ఎదుటికి వినయమ్గా వచ్చే వాళ్ళకు మాత్రం బాగా చివాట్లు పడేవి.

ఒక సారి నలుగురు వ్యక్తులు కలిసి వచ్చారు. అందులో యిద్దరు తండ్రి కొడుకులు. యిద్దరూ నిజంగా దర్శనానికి వచ్చారు. మిగిలిన యిద్దరూ "మేము గొప్ప జాతి బ్రాహ్మణులం తురకవాడిని దర్శించేదేమిటి? అన్నా అహంకారంతో "ఏదో చూద్దాం" అని వచ్చారు. బాబ్ వెంటనే తండ్రి కొడుకుల వైపు చూచి, "మీరిద్దరూ రండి, వారిద్దరూ గొప్ప జాతి బ్రాహ్మణులు. వారెందుకు?" అన్నారు. తామూ నిత్యమూ కూర్చ్ని ధ్యానము చేసిన వేప చెట్టు ఆకులు కొన్ని తెప్పించి నలుగురికీ ఇచ్చి, "ఎలా ఉన్నాయో చెప్పా" మన్నారు. తండ్రీ కొడుకుల కేమో అవి తియ్యగా ఉన్నాయి. మిగిలిన యిద్దరికీ కటిక చేదుగా అన్పించాయి. బాబా చిరునవ్వుతో తమ వైపు చూడగానే బ్రహ్మణులిద్దరూ తలలు వంచుకున్నారు.

విధంగా తమ దగ్గరికి వచ్చే వారిలో ఎవరు శ్రద్ధతో, నిజంగా దర్శించాలన్న తపనతో వస్తున్నారో; ఎవరు కేవలం కాలక్షేపానికి సరదాకి లేదా వెక్కిరించతానికి వస్తున్నారో బాబా తానూ తెలిసికోవడమే కాదు, వాళ్లకూడా ఋజువు చేసేవారు.

శ్రీ సాయికి అహంకారం, గర్వం, తమ గొప్ప దనాన్ని ప్రదర్శించాలనే కోరికా ఉండేవి కావు. తమనదరూ గౌరవించాలనీ సేవించాలనీ వారు కోరుకునే వారు కారు. భక్తులు తమ తమ ఇష్టాలను ఆచారాలను బట్టి ఆయనకు పూజలు చేసేవారు. కొందరు చందనం పూసేవారు; కొందరు విభూతి పూసేవారు, కొందరు నమస్కరించేవారు; కొందరు కీర్తనలు పాడి భజన చేసేవారు. కొందరు ఆయన ముందు నాట్యం చేసేవారు; ఎవరే రకంగా పూజించినా సాయి కాదనే వారు కాదు.

సాయికి పేదలు, ధనవంతులు అందరూ సమానమే. వచ్చిన వారి భక్తిని బట్టి కొందరిని కాస్త ఎక్కువగా దగ్గరకు చేర్చుకునేవారు తప్ప, ధనానికి ఆయనెప్పుడూ విలువ నివ్వలేదు. ఒకసారి ఒక మహారాణి పంపిన సంపదను కూడా ఆయన తిప్పి పంపివేశారు. ప్రతిరోజూ తమకు దక్షినల ద్వారా వచ్చే వేలాది రూపాయలు తిరిగి అందరికీ దానాలు చేసేసి సాయంత్రానికి ఖాళీ చేతులతో మిగిలేవారు. మహనీయుని చుట్టూ కాకా సాహెబ్ దీక్షిత్, బాపూ సాహెబ్ బుట్టి మొదలైన ధనవంతులేందరో ఉండేవారు. తామూ కావాలనుకుంటే లక్షల రూపాయలుండేవి వారి దగ్గర. కానీ చివరి రోజు సాయి కఫనీ జేబులో ఉన్నది ఏడు రూపాయలు మాత్రమే. ధనాన్ని సాయి మాత్రం లెక్క చేసేవారు కాదు.

సాయి బాబా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు. అందరితో కబుర్లు చెబుతూ ఉండేవారు. య్వ్వరి మీదా ఆయనకు ద్వేషం పగ ఉండేవి కావు. ఒక్కొక్కసారి కోపం వచ్చేది, కానీ అది తమ భక్తుల మేలు కోసం మాత్రమేనని సాయి దగ్గర ఉండే వారందరికీ అనుభావమయింది.

సాయి బాబా ఎప్పుడు "అల్లా మాలిక్" అనేవారు. అంటే అన్నిటికి భగవంతుడే యజమాని అని అర్ధం. ప్రతిక్షణం మన జీవితాలను నడిపేవాడు భగవనుదేననై ఆయన గుర్తు చేస్తుండే వారన్న మాట. అలా కాకపొతే "నేను, నాది" అన్నా భావం పెరిగి పోతుంటుంది. మాయలో పది కొట్టుకుంటూ ఉంటాం. పైకి అందరితో మాట్లాడుతూ, నవ్వుతూ మామూలుగా కన్పిస్తుండేవారు కానీ ఆయన లోపల ఆగకుండా పరమాత్ముని స్ఫురణ నడుస్తూనే ఉండేది. బాబా కు వివాదాలు - అంటే ఒక విషయం మిద అనేకులు వాదిన్చ్కోవటం, నచ్చేది కాదు. అలాంటి పెచిలకు మూలం ఏమిటి? ఎవరికి వారికి "నేను చెప్పిందే రైటు" - అన్నా అహంకారం ఉండటం. అహంకారం చెడ్డ గునాలన్నితిలోకి చెడ్డది. నీ అహంకారం తీసి నా పాదాల దగ్గర పెద్ది వేయి. నిన్ను నేనే అవతలి ఒడ్డుకు చేరుస్తాను". - అనే వారు సాయి.


శ్రీ సాయి ఎప్పుడూ ఏదో ఆనందంతో ఉన్నట్లు కన్పించేవారు. అసలు మన దుఃఖాలన్నిటికి మూల కారణం కోరిక. ఇది కావలి అని కూరుకుంటాం. అది దొరుకుతుంది. అంతలోనే మరొక దాని మీద కోరిక కలుగుతుంది. అదీ సంపాయించుకున్నాం. ఇక అంతటితో కోరికలు ఆగిపోతాయా? అబ్బే! ఒకదాని తరువాత మరొకటి, దాని తరువాత యికొకటి పైన మరో క్రొత్తది. ఇలా తోదేకొద్దీ బావిలోని నీళ్ళు ఊరినట్లుగా మన మనస్సుల్లో కోరిక ఊరుతూనే ఉంటాయి. కోరికలు తీరకపోతే దుఃఖం కలుగుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్నా ప్రపంచం చూడండి.


ప్రతి వాడికి ఏదో ఒక దుఃఖం తప్పటం లేదు. కొందరికి తిండి దొరక్క బాధ; కొందరికి తిన్నది అరగదని బాధ; పిల్లల్ని పోషించలేని బాధ; కొందరికి పిల్లలు లేని బాధ - అసలీ బాధలన్ని ఎందుకు కలుగుతున్నట్లు? అటువంటి వాణ్ణి కావాలనే కోరికలుండటం చేత. అవి తిరనప్పుడల్లా దుఖమే వస్తుంది. అసలు కోరికలే లేకుండా పొతే? ఇక దుఃఖం ఉండదు గదా! శ్రీ సాయి బాబా కోరికలు జయించి ఎలా జీవించవచ్చో చూపించారు. రుచిని వదిలేయటం ఎలాగో నేర్పారు. ఏది దొరికితే అదీ తినటం, ఎక్కడ సదరం దొరికితే అక్కడ పాడుకోవడం. అలా కోరికా లేకుండా బ్రతికీ సన్యాసికి దుఃఖం ఎందుకుంటుంది? అలా ఆనందమయంగా బ్రతకటం ఎలాగో సాయి చూపించారు.


సాయి బాబా ఎవరైనా సంమానించినా (గౌరవించినా) అవమానించినా - రెండింటినీ సమానంగా తీసుకునేవారు. తమను పొగడి నపుడు పొంగ పోయేవారు కారు. దేన్ని కూడా "ఇది నాది" అనుకునేవారు కారు. భక్తులాయనకు ఎన్నెన్నో కానుకల ఇచ్చేవారు. వారు వాటిపైన ఎటువంటి ఆశా చూపేవారు కారు. పల్లకీలు, గుఱ్ఱాలు, బోలెడన్ని వస్తువులతో మసీదు నిందిపోయినా - ఆయన అవేవి తమవి కావనేవారు. ఒక సారి ఆయన ఒక భక్తుదోకరితో అన్నారు - "నేను ఫకిరును. నా ఆస్తి అంతా యిదిగో కఫనీ, తలగుడ్డ, సటకా, భిక్ష పాత్ర మాత్రమే".

మనలో ప్రతి వాళ్ళకి ఎంతో కొంత సోమ్ముంటుంది. దాన్ని చూచి సంతోషిస్తుంటాం. ఇంకా సంపాదించాలని ప్రయత్నిస్తుంటాం. లేని దానికి విచారిస్తుంటాం. కానీ, మోక్షం కోరే వాళ్ళెలా ఉండాలో బాబా నిరూపించారు. డబ్బు, ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, వస్తువులు - ఇవన్ని శాశ్వతంగా ఉండేవి కావు. ఎప్పుడో ఒకప్పుడు నాశనమై పోయేవే. మనం పుట్టినప్పుడు ఏమి వెంట తెచ్చుకోలేదు. యెంత ప్రయాసపడి సంపాదించినా పోయేటప్పుడు ఏమి వెంట తిసుకుపోలేము - ఎలా వచ్చామో అలా ఖాళీ చేతులతో పోవలసిందే. ఎప్పడికి నాశనం కాకుండా ఉండేది ఒక ప్రరమాత్మ మాత్రమే. అందుచేతనే బాబా తామూ రోజు వాడుకోవటానికి కావలసిన ఒకటి రెండు వస్తువులతో తృప్తి పడేవారు. దేవుని పేరు మాత్రం మరచి పోకూడదని మనకు నెర్పుతూ 'అల్లా మాలిక్' అనేవారు. ఇలా శ్రీ సాయి బాబా తమ చుట్టూ ఉన్నవారికి ఎలా బ్రతికితే తొందరగా దేవుని చేరగాలమో చూపిస్తూ ఉండేవారు.


"ఓం శ్రీ సాయినాధం నమామ్యహమ్"

శాంతి శ్శాంతి శ్శాంతిః


(శుక్రవారం, పారాయణ పూర్తి కాగానే పులిహోర నైవేద్యం పెట్టి, కొబ్బరి కాయ కొట్టి హారతివ్వాలి. ప్రసాదం పది మందికీ పంచాలి. కుక్క, పిల్లి, ఆవు లాంటి జంతువులకు కూడా కొంత పెట్టాలి. తాత్రికి మన విన్న సాయి కధలోని ప్రాతాలు, పూలతోట, నందదీపం, గురుస్థానం, వేప చెట్టు, ద్వారకామాయి అవన్నీ ఊహించుకుంటూ నిద్ర పోవాలి.)



****************************************************








1 comment:

New Beginning said...

Thank you very much for posting these