Tuesday, August 5, 2008

మూడవ అధ్యాయం - శనివారం పారాయణ

ఓం శ్రీ సాయిరాం

శ్రీ సాయినాధ చరితామృతం

మూడవ అధ్యాయం - శనివారం పారాయణ

ప్రార్ధన

సమర్ధ సద్గురు శ్రీ సాయినాధుల పాదపద్మాలకు ప్రణామాలు
స్వామి! సాయినాధా!


గత రెండు రోజులుగా నీ కధలు చదువుతున్నాం - వింటున్నాం. మా చిన్న బుద్ధులకు తెలిసినట్లుగా అర్ధం చేసుకుంటున్నాం. నీ కధలలో వుండే గొప్పతనం పూర్తిగా మాకు తెలియాలంటే ఎంతో పాండిత్యం, శక్తి తెలివి కావలి.
అవేవి లేనివాళ్ళం సాయీ! అంచేత నీ చరిత్రను సరిగా పూర్తిగా అర్ధం చేసుకొనీ శక్తీ నీవీ మాకు ప్రసాదించు స్వామి! వింటున్నంత సేపు మాకు ఇతర విషయాలీవి గుర్తు రాకుండా చెయ్యి. మా చెవులు నీ కదా మీద, మా కనులు నీ రూపం మీద, మా మనసు నీ మీదే నిలబడి వుందీలాగా ఆశీర్వదించు సాయీ!

అధ్యాయంలో శ్రీ సాయిబాబా దగ్గర ఉండి వారిని సేవించుకున్న కొందరు మహాభక్తుల గురుంచి విందాం. మహనీయులను, యోగులను చూడాలనుకున్న, పున్యక్షేత్రాల్లకు వెళ్ళాలనుకున్న - మనంతట మనం వేల్లలీము. అందుకు భగవంతుడి కరుణా (దయ) కావాలి. అదెలా కలుగు తుందో చూద్దాం.

మనం ప్రతీ రోజు రకరకాల కర్మలు (పనులు) చేస్తుంటాం. వాటిలో మన్చివీ వుంటాయి, చెడ్డవి వుంటాయి. మనం చేసీ కర్మల ఫలితాలు కూడా పనులను బట్టే మంచి ఫలితాలూ, చెడ్డ ఫలితాలూ వస్తాయి. వీటినీ మనం పాపపున్యాలంటాం. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తప్పాడు. పోర్వ జన్మలో మనం చేసిన కర్మల ఫలితం యీ జన్మలో అనుభవిస్తాం. దాన్నే 'ప్రారబ్ధం' అంటారు. యెంత గొప్పవాడికైనా యీ ప్రారబ్ధం అనుభవింపక తీరదు. అయితే
సాయి బాబా ఎలా సాయం చేస్తారో చూద్దాం.

మనం నిత్యం సాయి నామం పలుకుతూ వుంటే, ఆయన మీదే మనసు పెట్టి ప్రార్ధిస్తూ వుంటే ఆయనకు దయ కలుగుతుంది. అప్పుడు ఏదో రకంగా మను ఆయన దగ్గరకు లాక్కుంటారు. ఇక తల్లి ఒడిలోకి చేరినాక చంతేముంది?
మన కష్టాలలో కొన్నిటిని ఆయనీ తీరుస్తారు. మరి కొన్నిటిని భరించగల శక్తిని మనకిస్తారు. శ్రీ సాయి భొదలు వింటాం తెలుసుకుంటాం గనుక యీ జన్మలో తప్పుడు పనులు చెయ్యం; అబద్ధలడం; ఎవరిని ద్వెషించం, పగబట్టం. అంటే అన్ని మంచి పనులే చేస్తాం. కాబట్టి పై జన్మ మంచి జన్మ వస్తుంది. అప్పుడు మనకు కష్టాలు, కన్నీళ్ళు వుండవు. మెల్ల మెల్లగా భావనతునికి దగ్గరవుతూ వుంటాం. అంటే ఒక్కసారి సాయి బాబా పాదాలు పడితే ఆయన నామం పలికితే, ఆయన చెప్పినట్లు నడిస్తే - యీ జన్మకే గాదు, పై జన్మకు కూడా మేలు కలుగుతుందన్న మాట. అలా మేలు పొందిన వాళ్లు కొందరి సంగతి చూద్దాం.

మొదటి అధ్యాయంలో అలాటి అదృష్టవంతులిద్దరు - మహాల్సాపతి, శ్యామలను గూర్చి చెప్పుకున్నాం. మహాల్సాపతి, సాయి షిరిడీ నేలపై అడుగు పెట్టగానే ఆయనకు దగ్గరవడై పోయాడు. బాబా సమాధి చెందేవరకు అరవై ఏళ్ళ పాటు ఆయనతోనే జీవించాడు. బాబా సమాధి మందిరంలో పూజారిగా వుండి తానూ మననించెంత వరకు సాయి సేవలోనే వుండిపోయాడు. ( మహాల్సాపతి మనుమలు నేటికి షిరిడీలో వున్నారు). తానూ మరణించే రోజు ఉదయమే "నేను ఈవేళ స్వర్గానికి వెడతాను" అని చెప్పాడు. దవనామం పలుకిటు ప్రాణం విడిచాడు.

శ్యామ: శ్యామ సాయి బాబాను 'దేవా' అని పిలిస్తుండేవాడు. స్వయంగా బాబా ఒకసారి 'శ్యామ! 72 జన్మల బంధం మనది. ఇంతకాలంగా నేను నీతోనే ఉన్నాను' అని చెప్పారు. అందుకే అంత దగ్గరయ్యడతడు బాబాకు. బాబా సమాధి చెందినా తరువాత కొంతకాలానికి ఓకే సంఘటన జరిగింది. కాకా సాహెబ్ దీక్షిత్ అనే మరో భక్తుడు, శ్యామా కలిసి నవ నాదులను గూర్చి చదువుతున్నారు. వారు చెప్పిన భక్తి మార్గం చాలా బాగుంది. సంపూర్ణ భక్తి ఎలా అలవడుతుంది? అలాటి పాదిత్యం, జ్ఞానం మనకు లేవు గదా! మనం మోక్షం ఎలా పొందుతాం!" అంటూ బాధ పడ్డాడు. అప్పుడుశ్యామ వెంటనే "అలా ఎందుకనుకోవాలి ఆ శాస్త్రాలూ అవీ చదవక పోతేనేం! మనం సాయి బాబా పాదాలు పట్టుకున్నాం గదా! ఇక మనకు లోతేముంది? మనను సాయి బాబాయ్ ఒడ్డుకు చేరుస్తారు. మోక్షాన్ని ప్రసాదిస్తారు" అన్నాడు. శ్యామాకు తనపైన ఉన్నా నమ్మకాన్ని చూస్తూ బాబా ఊరుకుంటారా మరి! వెంటనే శ్యామా మాటలు నిజమేనని ఋజువు చేసారు.

మరునాడు ఆనందరావు అనే భక్తుదోకకు అక్కడికి వచ్చాడు. "రాత్రి నాకొక కల వచ్చింది, కలలో సముద్రంలో బాబా బాబాను చూచాను. అక్కడ శ్యామా కూడా ఉన్నాడు. శ్యామా బాబ్కు నమస్కరించమని నాతో చెప్పాడు. బాబా పెద్ద సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. వారి పాదాలు సముద్రపు నీటిలో ఉన్నాయి. ఎలా నమస్కరించగానలు?" అని నేనంటే శ్యామా "బాబా! పాదాలు కాస్త యివతల పెట్టండి" అని కోరాడు. అప్పుడు పాదాలు యివతలికి తీయగానే నేను నమస్కారం చీసాను. అపుడు బాబా శ్యామా కోక పట్టు దోవతుల జట యిమ్మని చెప్పారు" అని ఆనందరావు చెప్పాడు.

అది విని శ్యామా పరమానందంతో "చూచావా కాకా! బాబా తానూ మన వెంటనే ఉన్నానని చెప్పడానికే యి కల రావటం" అన్నాడు. అలా తానూ సమాధి చెందినా తరువాత కూడా బాబా శ్యామా నమ్మకాన్ని బాల పరిచారు. ఆ శ్యామా కుమారుడు ఉద్ధవేష్ దేశ పాండే యింకా సజీవంగానే శిర్దిలో ఉన్నారు (1999 నాటికి).

హేమాడ్ పంత్: అన్నా సాహెబ్ ధబోల్కర్ అనే ఒక పెద్ద మనిషి బాబా కీర్తి గురించి విని ఆయన దర్శనం కోసం షిరిడీ రావాలనుకున్నాడు. అతడు వచ్చిన రోజు ప్రొద్దున సాయి బాబా మసీదులో ఒక తిరగలి ముందర కూర్చుని గోధుమలు విసురుతున్నారు. బాబాకు ఇల్లు సంసారం లేవు. వారు భిక్షాటనంతో జీవిస్తారు గదా! మరి యి గోధుమ పిండి ఎందుకు? అని అతడు వచ్చి ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. అంతలో నలుగురు ఆడవాళ్ళు బాబాను తిరగలి ముందు నుంచి లేపి, పాటలు పాడుతూ పిండి విసిరారు. తరువాత దాన్ని నాలుగు భాగాలుగా చేసి తీసుకు పోభోయారు. అపుడు బాబా వాళ్ళను కోప్పడి "ఈ పిండి మీకు కాదు. దిన్ని తీసుకువెళ్ళి ఊరి సరిహద్దులలో చల్లండి" అం ఆజ్ఞాపించారు. ఇదంతా చూస్తున్న అన్నా సాహెబ్ ఈ ఊరు వాళ్ళను అడిగాడు - అలా పిండి ఊరు చుట్టూ చల్లటం దేనికి? అని.

వాళ్లు "షిరిడీ గ్రామంలో కలరా వ్యాధి ఉంది. దాన్ని పోగొట్టడానికి బాబా యిలా చేసారు. ఆయన విసిరింది గోధుమలు కావు, వ్యాధినే" అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే మరునాటికి కలరా వ్యాధి తగ్గు ముఖం పట్టింది. అన్నా సాహెబ్ బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. ఇక ఆయన దగ్గరే ఉంది పోయాడు. బాబా కూడా అతన్నేంతో ప్రేమగా చోచేవారు. అతని "హేమాడ్పంత్" అని పిలిచేవారు. అతని మనసులో ఏ సందేహం (అనుమానం) వచ్చినా ఏదో ఓకే విధంగా అతనికి సమాధానం దొరికేలా చేసేవారు.

ఒకసారి బాబా తనేల్లప్పుడు హేమాడ్పంత్ దగ్గరే ఉన్నానని చెప్పదలుచు కున్నారు. మధ్యాహ్నం వేళ హేమాడ్పంతు బాబా కాళ్ళు నొక్కుతున్నాడు. అప్పుడు హఠాత్తుగా అతని కోటు చేతి మడత లోంచి సెనగ గింజలు దొరల సాగాయి. అది చూచి అందరూ నవ్వారు. బాబా "హేమడ్పంత్ చూడండి, సెనగలు కొనుక్కుని ఒక్కడే తిన్నాడు. ప్రక్క వారికేవారికి పెట్టక పోవటం అన్నది చెడ్డ గుణం గదా!" అన్నారు. దానికి హేమాడ్పంతు కొంచెం చిన్నబుచ్చు కున్నాడు. "బాబా! నేనివ్వాల సెనగలు తిననేలేదు, పైగా ప్రక్కనున్న వారికీ పెట్టకుండా నేనెప్పుడు ఏమి తినను" అన్నాడు.

బాబా నవ్వి "మరి నీ ప్రక్కనేవరూ లేకపోతేనో" అన్నారు. హేమాడ్పంతు "ఎవరూ లేకపోతె నేనేం చెయ్యను, ఎవరికి పెట్టాను!" అన్నాడు. బాబా నవ్వుతూ అతని కళ్ళలోకి చూస్తూ, "నేనెపుడూ నీ దగ్గర లేనా? నివు తినేవు నాకు పెట్టి తింటున్నావా?" అన్నారు. హేమాడ్పంతుకు బాబా ఎందుకిలా సెనగలు తన చొక్కా చెతిలొన్నున్చీ వచ్చేట్లు చేసారో అప్పుడర్ధమైంది. అటు పైన తానేమి తిన్నా, త్రాగినా, ఏమి అనుభవించినా బాబాకు అర్పించి తీరాలని తెలుసుకున్నాడు. మనం కూడా భోజనం చేసినా, ఏం తిన్నా త్రాగినా - ఒక్క క్షణం కళ్లు మూసుకొని సాయి బాబాను మనసారా తలుచుకొని "రా తండ్రీ! సాయియీ! దిన్ని నివు ముందు తీసుకో" అని ప్రార్ధించాలి. అప్పుడు తప్పక సాయి దాన్ని స్వీకరిష్టాడు. అప్పుడా భోజనం ఉట్టి భోజనం కాదు. దేవునికి పెట్టాం గనుక ప్రసాదం అవుతుంది. ప్రసాదానికి బలం, పవిత్రత ఎక్కువ గదా! అందుకని మనందరం కూడా యిప్పతినున్చీ యీ విషయం మరచి పోకుండా ఆచరణలో పెడదాం.

ఈ హేమాడ్పంతు రచించిన "శ్రీ సాయి సచ్చరిత్ర" గొప్ప గ్రంధం. అనేక భాషల్లోకి మార్చారు దాన్ని. ఆయన సాయి బాబా ఆశిస్సులతో వ్రాసినది గనుక, సాయే వ్రాసుకున్న గ్రంధం అది.

దాసుగణు: వేటగాడు పక్షుల కాళ్ళకు దారాల ఉచ్చులు తగిలేలాగా విసురుతాడు. ఉచ్చులు బిగుసుకున్నాక ఆ దారం లాగి పక్షులను తనవైపు లాక్కుంటాడు. సాయి బాబా ఎన్నో సార్లు చెప్పారు - "నా వాళ్ళను పిట్టల కాళ్ళకు దారాలు కట్టి లగినట్లు లక్కుంటాను. నా వారు కానివారిని మసీదు మేట్లయినా ఎక్కనివ్వను" అని. అలా బాబా లాక్కున్న మరొక పిట్ట దాసుగణు. ఇతడు పోలీసుశాఖలో ఉద్యోగం చేసేవాడు. ఇన్స్పెక్టర్ కావాలని మహా కోరికగా ఉండేది. బాబా అతన్ని "నివు ఉద్యోగం మాని నా దగ్గరకు రా! నా కధలు పాడుతూ కాలం గడుపు" అన్నారు. పెద్ద ఉద్యోగం వస్తే అలాగే వస్తానన్నాడు దాసుగణు. కొంతకాలం జరిగింది. ఒక గజదొంగ 'కానూ భిల్లు" అనేవాడిని బంధించ వలసి వచ్చింది దాసుగణు. కొండల్లో, గుట్టల్లో వాడిని వెదుక్కొంటూ వెళ్ళు పెద్ద ప్రమాదంలో పడ్డాడు. శ్రీ సాయి ఎంతో దయతో అతన్ని ఆ ప్రమాదం నుంచీ రక్షించారు. అయినా దాసుగణుకు కళ్లు తెరుచుకోలేదు.

ఒకసారి కొంత పెద్ద మొత్తంలో డబ్బు పోలీస్ స్టేషనులో దాయవలసి వచ్చింది. అది కాస్తా పోయింది. దాసుగణుదే బాధ్యత. అతనికి శిక్ష పడే ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం తప్పితే బాబా సేవలో నిమగ్నుదనవుతానని మొక్కు కున్నాడు. బాబా దయ వల్ల అది తొలగి పోగానే ఉద్యోగం వదిలిపెట్టి వచ్చి బాబా కాళ్ళ మిద పడ్డాడు. బాబా చిరునవ్వుతో 'వచ్చావా' అన్నారు. ఆ తరువాత దాసుగణు గొప్ప హరిదాసుడై పోయాడు. అలనాటి నారద మహర్షి లాగ ధోవతి కట్టి మెడలో ఒక పూలదండతో, చేతిలో చిడతలు పట్టుకొని ఊరూరా శ్రీ సాయి చరిత్రను హరి కధలు గా చెప్పుకుంటూ తిరగసాగాడు.

ప్రతి ఏట షిరిడీలో జరిగే శ్రీ రామ నవమి ఉత్సవాలలో దాసుగణే హరికధ చెప్తుండేవాడు. షిరిడీ సంస్ధానంలో బాబాకు యిచ్చే హారతులలో దాసుగణే వ్రాసిన పాటలు కూడా ఉన్నాయి. దాసుగణే ప్రచారం వల్ల ఆ రోజులలో బాబా పేరు మూలమూల పల్లెలకు కూడా ప్రాకింది. ఆ కధలు విని, అతడు వేదిక (స్టేజి) మిద పెట్టె బాబా చ్త్రపతాన్ని చూచి ఎంతో మంది బాబా భక్తులుగా మారారు.

దాసుగణు గొప్ప భక్తుడు. షిరిడీ లో బాబా సమాధి చెందినపుడు దాసుగణు పండరీపురంలో ఉన్నారు. నాటి రాత్రి బాబా దాసు గనుకు కలలో కనిపించారు. "మసీదు కూలిపోయింది, నేను ఆ చోటు విదిచిపోయాను. నీవు వెళ్లి నా శవాన్ని పూలాతో కప్పు అని చెప్పారు. దాసుగణు పరుగు పరుగున వెళ్లి అలాగే చేసాడు. బాబా సమాధి అయ్యాక చాలాకాలంపాటు చివరి రోజుల వరకూ దాసుగణు బాబా కీర్తనలు పాడుతూ, ప్రచారం చేస్తూనే ధన్యుడయ్యాడు.

నానాసాహేబ్ చందోర్కర్: నానాసాహెబ్ చందోర్కర్ డిప్యూటి కలెక్టరుగా పెద్ద ఉద్యోగం చేస్తుండేవాడు. బాబా అతనికి కబురు పెట్టారు తన దగ్గర కొకసారి రమ్మని. నానాసాహెబ్ కాస్త అయిష్టంగానే వచ్చాడు. "ఏమిటి పని? ఎందుకు నా గురించి కబురంపారు?" అని అడిగాడు. బాబా చిరునవ్వుతో అతన్ని ప్రేమ పొంగే కళ్ళతో చోస్తూ, "అదేమిటి నానా! ఎన్ని జన్మల నుంచీ కలిసున్నాం మనం! నీవు మరచిపోఎనా నేను మరచిపోలేదులే" అన్నారు. నానాసాహెబ్ ఆనాటి నుంచీ బాబాకు ఆప్తుడైన సిష్యుడైపోయాడు. సాయి బాబా గురించి, ఆయన మహిమలను గూర్చి తానూ వెళ్ళిన చోటల్లా ఉపన్యాసాలిస్తుండేవాడు. ఆయినా అతనికి బాబా మహామ్మదియుడనే బావం మనసులో ఏమూలో ఉంది. నానాసాహెబ్ బాగా చదువుకున్నవాడు. సస్క్రుతం కూడా బాగా తెలిసిన వాడు.

ఒకనాడతాడు భగవద్గీతలోని ఒక శ్లోకం గోణుక్కుంటున్నాడు బాబా సేవ చేస్తూ. బాబా అదేమిటని అడిగి చెప్పించ్కొని విన్నారు. దానిలోని ప్రది మాటకూ అర్ధం చెప్పమని అడిగారు. నానా చెప్పిన దానిపై కొన్ని ప్రశ్నలు వేసారు. వాటికి జవాబులు చెప్పటం నన సాహెబ్ కు చేతకాలేదు. అతని గర్వం అణిగి పోయింది. 'నాకు తెలియలేదు' అని ఒప్పుకున్నాడు. అప్పుడు బాబా దాని అర్దానిని చక్కగా విడమరచి చెప్పారు. పైగా "కృష్ణుడు అర్జునునితో ఏమన్నాడు?" భగవంతును తత్త్వం తెలిసిన జ్ఞానుల దగ్గరకు వెళ్లి, జ్ఞానం నేర్చుకోమన్నారు గదా! ఏం కృష్ణుడు జ్ఞాని కాదా? తానే చెప్పా వచ్చు గదా! మారేందుకు చెప్పలేదు? ఎందుకంటే యోగులందరూ ఒక్కటే. అసలైన భక్తుడు తనకు జ్ఞానబోధ చేసేవాడిని (గురువుని) సాక్షాత్తు కృష్ణుని గానే - అంటే భగవంతుని గానే అనుకూవాలి" అని వివరించారు.

దానితో నన సాహెబ్కు అర్ధమింది. నాడు భారత యుద్ధం జరిగాతెఅప్పుడు అర్జునునికి గీత చెప్పినా కృష్ణుడే యీనాటి సాయి బాబా. అతడు బాబాకు సాష్టాంగపడి నమస్కారం చేసాడు. ఎవరైనా తనకేవైనా కష్టాలు చెప్పుకుంటే నానాసాహెబ్ వెంటనీ వారిని షిరిడీకి పంపేవాడు.

మనకేవైనా మంచి తియ్యని పదార్ధాలు దొరికాయనుకోండి ఎవ్వరికీ రుచైనా చూపించకుండా మనమే దాచుకొని తినం గదా! మన వాళ్ళందరికీ పంచి పెదితీనీ మనకు తృప్తి కలుగుతుంది. పైగా అదే ధర్మం కూడా. అలాగే నానాసాహెబ్ చందోర్కర్ కు సాయి బాబా శక్తి ఏమిటో తెలిసింది. ఆయన ప్రేమ అనే మిఠాయి దొరికింది. దాన్ని తానొక్కడే అనుభవించ కూడదు గదా! అలా చేస్తే అది స్వార్ధం అవుతుంది. అంచేత నానాసాహెబ్ తనకు పరిచయమైన ప్రతివారిని సాయి బాబా దగ్గరకు పంపిస్తూనే ఉండేవాడు. వాళ్లకు కూడా బాబా ప్రేమ మిఠాయి దొరికేలా చూచేవాడు. అలా వచ్చిన వారిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఒకడు.

కాకాసాహెబ్ దీక్షిత్: కకసహేబ్ దీక్షిత్ గొప్ప న్యాయవాది. వకీలుగా ఆయన వేలాది రూపాయలు సంపాదిస్తుండేవాడు. ఇతర దేశాలు కూడా తిరిగిన వాడాయన. ఒకసారి లండన్లో రైలు దిగుతుండగా జారి పడటం వలని అతని కాలికి దెబ్బ తగిలింది అంచేత కాలు వంకరగా ఉండిపోయింది. కకాసహేబ్ దీక్షిత్ ఒకసారి యీ విషయాన్ని నానాకు చెప్పి "ఎన్ని విద్యలు చేయిందినా యీ కుంతితనం పోలేదు" అన్నాడు. ననసహేబ్ సాయి బాబా దగ్గరకు వాళ్ళమని సలహా యిచ్చాడు. సాయి ని చూడగానే కాకా మనసులో ఏదో విచిత్రమైన మార్పు వచ్చింది. "ఇంతటి మహానియుడి దగ్గరకు వచ్చి కాలి కుంతితనం పోగొట్టమని అడగటం ఎందుకు? నా బుద్ధిలోని కుంతి తనమే సరిచేయమని అడుగుతాను" అనుకున్నాడు.

కాకాసహేబ్ దీక్షిత్ సాయి దర్శనంతోనే చిత్రమైన ప్రశాతత ఏర్పడింది. క్రమక్రమంగా ఆయనకు దగ్గరయ్యాడు. నెలల తరబడి ఆయన దగ్గరే ఉండిపోయేవాడు. రెండేళ్ళు గడిచేటప్పటికి అతనికి వాకీలు పని మిద కూడా విరక్తి కలిగింది. భార్యా బిడ్డలను, ఇల్లు వాకిళ్ళను విడిచి షిరిడీ లోనే ఉండిప్యాడు. "దీక్షిత్" అనే పేరుతో పెద్ద భవనం నిర్మించాడు. ఒక్కగది మాత్రం తానూ ఉంచుకొని మిగిలినవన్నీ సాయి ని దర్శించేందుకు వచ్చిపోయే యాత్రికులున్డటం కోసం యిచ్చేసాడు.

కాకాసాహెబ్ దీక్షిత్ కు సాయి బాబా మీద తిరుగులేని నమ్మకం ఉండేది. ఆయన ఏం చెప్పినా అది మంచా చేదా అని ఆలోచించటం లేదు - చేసేయ్యడమే. బాబా తనకు గురువు. బిడ్డ - తల్లి గుణం మంచిదా చెడ్డదా అని ఆలోచించ కూడదు. తల్లి తన క్షేమం కోరుతుందన్న నమ్మకంతో తల్లిని అంటి పెట్టుకొని ఉండటమే బిడ్డకు మంచిది. అలాగే గురువు చెప్పేదాన్ని ఏమాత్రం ఆలోచించకుండా చ్యాడమే శిష్యుడిపని. అలా చేసినపుడే శిష్యుడికి మంచి ఫలితం దక్కుతుంది. దీక్షిత్ అల్లాంటి మంచి శిష్యుడు.

ఒకసారి సాయి బాబా దగ్గరి కెవరో చావు బతుకుల్లో ఉన్నా ఒక మేకను తెచ్చారు. బాబా దాన్ని నరకమని తన శిష్యులకు చెప్పారు. దీక్షిత్ బ్రాహ్మణుడు. అతనికి ప్రాణులను చంపటం అన్నది అలవాటు లేని పని, అయినా సరే కట్టి పట్టుకొని మేకను నరకడానికి సిద్దమై పోయాడు. అది చూచి బాబా "ఏమయ్యా! బ్రహ్మణుడివి కదా! మేకను చంపటం నీకు ధర్మమేనా?" అన్నారు. అందుకు దీక్షిత్ "అదంతా నాకు తెలియదు బాబా! నీవు చంపమనావు - నేను తయారయ్యాను అంతే! నీ మాటే మాకు వేదం. నీ మాట తప్ప మరేదీ మాకు తెలియదు. నీవేం చెప్తే నేనది చేస్తాను" అని బదులు చెప్పాడు. బాబా "సరే నువ్వు చంపవద్దులే" అని ఆపేసారు.

కకసహేబ్ దీక్షిత్ వకీలు పని చేస్తుండే రోజుల్లో ఒక పెద్ద కేసు గెలిచాడు. పెట్టేడు వెండి రూపాయలు ఫీజుగా వచ్చాయతనికి. ఆ పెట్టె మొత్తం తెచ్చి సాయి బాబా ముందు పెట్టి "ఇది మీకే సాయి తీసుకోండి" అన్నాడు కాకా. అలా డబ్బు యిచ్చివేయ గలగటం వైరాగ్యానికి గుర్తు. దిక్షిత్లో ఎంతటి వైరాగ్యం ఉందో పరీక్షింప దలిచారు. "నిజంగా యిది నాకేనా!" అంటూనే పెట్టె తెరిచి దోసిళ్ళతో రూపాయి బిళ్ళలు తీసి అక్కడున్న వారికి పంచి పెట్ట సాగారు. చూస్తూ చూస్తూ ఉండగానే పెట్టె ఖాళి అయింది. కాకాసాహెబ్ దీక్షిత్ ముఖంలో కొంచెమైనా బాధ గానీ, విచారం గానీ కనిపించలేదు. "ఒకసారి ఇచ్చేసాక యిక అది తనది గాదు. బాబా ఎమ్చేస్తే తనకేం! ఏం చేసినా తన మేలుకే" అన్నట్లు సంతోషంగా ఉంది పోయాడు కాకాసాహెబ్.

కాకాసాహెబ్ విశ్వాసం చాల గొప్పది. వేలకు వేలు ఆదాయం వచ్చే వకిఇలు వృత్తినీ, బంగారం లాన్న్తి సంసారాన్ని విడిచిపెట్టి ఆటను బాబా దగ్గరే ఉండటాన్ని అనేకమంది నిదించేవారు వెక్కురించేవారు. అతడు బాబా వలలో పడిపోయాడనే వారు. ఎవరు ఏమన్నా అతడు ఏమాత్రం చేలించేవాడు కాడు. ఒకసారి తొమ్మిది నెలల పాటు తన గదిలోనే కదల కుండా ఉండి తపస్సు చెయ్యమని బాబా ఆజ్ఞ యిచ్చారు. కాకాసాహెబ్ దానిని అక్షరాల పాటించాడు. సాయి బాబా అతని పైని ప్రేమతో ఒకసారి "కాకాను అంత్యకాలం లో నేను విమానంలో తీసుకుపోతాను" అన్నారు. అన్నట్లు గానే బాబా సమాది చెందాక కొన్నాళ్ళకు కాకాసహేబ్, హేమాడ్పంతు కలిసి రైలెక్కారు. అంతవరకు సాయి దయ గురించి మాట్లాడుతున్న కాకా హాఠాత్తుగా మాట్లాడటం మానేశాడు. హేమాడ్పంతు నిద్రపోతున్నాడేమోనని కదిలించి చోచేసరికి కాకాసాహెబ్ దీక్షిత్ మరణించి ఉన్నాడు. సాయి నాధులు జీవితమంతా తన నామం పలుకుతూ తన సేవ చేసిన వారికి ఎలాటి అద్భుతమైన మరణాన్ని క్షణాల మీద ప్రసాదిస్తారో చూడండి.

మేఘశ్యాముడు : మేఘశ్యాముడు సాఠే అనే ఒక ధనవంతుని వంట బ్రాహ్మణుడు. తన యజమాని మాట కాదనలేక అతడు షిరిడీ వచ్చాడు గానీ, సాయి బాబా మహామ్మదియుదన్న భావం అతని మనసులో ఉంది. బాబా అతన్ని చూస్తూనే "నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడివి, నేను మహామ్మదియుడిని. నా దగ్గరకు వస్తే నీ జాతి పోతుంది పో పో!" అని కసిరి కొట్టారు. మేఘశ్యాముడు కొద్ది రోజులుండి వెనక్కు వెళ్లి పోయాడు. ఇంకెక్కడో తిరిగాడు. మనశ్శాంతి లేకుండా పోయింది. మళ్ళీ షిరిడీ వచ్చాడు. ఈసారి సాయి బాబా అతన్ని లోపలికి రానిచ్చారు. క్రమంగా మేఘ శ్యాముని మనస్సులో బాబా పట్ల గొప్ప భక్తి ఏర్పడింది. అతడు మొదట శివ భక్తుడు. కానీ రాను రాను సాయి బాబానే తన శివునిగా భావించి పూజించ సాగాడు.

ఒకసారి సంక్రాంతి పండుగనాడు అతనికి శివుడికి అభిషేకం చెయ్యాలని పించింది. బాబా దగ్గరకు వచ్చి " సాయీ! నా శివుడవు నీవే, అందుచేత యివ్వల నీకు అభిషేకం చేస్తాను" అన్నాడు. బాబా అందుకు ఒప్పుకోలేదు. నేను మహామ్మదియుదిన్, నాకు అభిషేకాలేమిటి పోమ్మనారు. కానీ మేఘశ్యం పట్టు వదలకుండా ప్రార్ధించటంతో ఆయన సరేననక తప్పలేదు. "సరే - అభిషేకం చెయ్యి గానీ నా ఒంటి నిండా నీళ్ళు పొయ్యకేం! తల మిద మాత్రమె పొయ్యి"
అన్నారు. మేఘశ్యం పరమానందంతో 8 కోసులదూరం నడిచి గోదావరీ జలం తెచ్చాడు. "హర గంగే - హర గంగే" అంటూ ఆనందం తో బాబాకు అభిషేకం చేసాడు. ఆనందంతో బాబా చెప్పినది మరిచిపోయి ఒళ్ళంతా నీళ్ళు పోసాడు. కానీ తీరా అభిషేకం పూర్తయ్యాక చూస్తే బాబా తల మాత్రమే తడిసింది గానీ ఒళ్ళు శుభ్రంగా పొడిగా ఉంది - అదీ బాబా లీల!

ఒక నాటి తెల్లవారు జామున మేఘశ్యామునికొక కల వచ్చింది. సాయి బాబా గది లోపలికి వచ్చి, అక్షతలు చల్లి, "త్రిశూలం గీయి అని చెప్పి మాయమైనట్లు చూచాడు కలలో. కళ్లు తెరిచి చూస్తే అక్షతలున్నాయి కానీ తలుపులన్నీ మూసి ఉంటే బాబా ఎలా వస్తాదు అనుకున్నాడు తనలో. మసీదుకు వెళ్లి బాబాకు ఈ విషయం చెప్పాడు. ఆయన "నాకు తలుపులు, ద్వారాలు అక్కర్లేదు లోపలికి రావడానికి, త్రిశూలం గియమన్ననుగా - గీయి" అని చెప్పారు. మెఘశ్యామ్ అలాగే చేసాడు.

ఆ మరునాడు సాయి కి ఎవరో ఒక శివలింగం తెచ్చిన్ కానుకగా యిచ్చారు. ఆయన దానిని మెఘశ్యామ్ కిచ్చి "ఇడుగో శివుడు వచ్చాడు పూజించు" అని యిచ్చారు. (ఆ శివలింగం షిరిడీలో గురుస్థానం దగ్గర నేటికీ ఉంది).

ఆ విధంగా మెఘశ్యామ్ మనసులో ఉన్నా శివ భక్తిని ప్రోత్సహించి అతనిలో మంచి ఆధ్యాత్మిక భావాలు కలిగించారు సాయి. మెఘశ్యామ్ మరణించి నపుడు అతని కర్మకాండల తరువాత భోజనాలన్నీ బాబా వారే స్వయమ్గా పెట్టించారు. తనకెంతో ఆప్తుడైన ఆ భక్తునికోసం కన్నీరు పెట్టుకున్నారు కూడా.

దురంధర సోదరులు: శ్రీ సాయికి అందరి పూర్వజన్మ వృత్తాంతాలు బాగా తెలిసి ఉండేవు యింతకు ముందే అనుకున్నాం గదా! ఒకసారి ఆయన మసీదులో ఉన్నవారికి "నా దర్బారు జనులు వచ్చుచున్నరీ రోజున" అని చెప్పారు. ఆయన చెప్పింతలుగా ముగ్గురన్నదమ్ములు దురంధర సోదరులు (వామనరావు, బబుల్జీ, బాలారాం అన్నవారు) బాబా దర్శనానికి వచ్చారు. వారు రాగానే బాబా "వీరే నా దర్బారు జనులు. విరి గురుంచే నేనిందాక చెప్పింది అన్నారు. తామూ ముందుగా కబురు చెయ్యకపోయినా తమ రాక గురించి బబకేలా తెలిసిందా? అని దురంధర సోదరులు ఆశ్చర్యపోయారు. వారు తనకు గత అరవై తరాల నుంచి తెలుసునన్నారు బాబా. ఆయన ప్రేమ అంత గొప్పది. ఒక్కసారి ఆయన పరిచయంలోకి వస్తే - యిక మనం మరచిపోయినా ఆయన మనలను వదలరు. య్లాగో ఒకలాగా దగ్గరకు చేర్చుకుంటారు.

బాలారాం దురంధర్ అప్పటికి ఆరేళ్లుగా ఉబ్బసం వ్యాధి తో (దమ్ము) తో బాధపడుతున్నాడు. శ్రీ సాయి ఆయనకు చిలుము పిల్చమని యిచ్చారు. ఆ చిలుము పిల్చతంతోనే బాలారాం కున్న జబ్బు కాస్తా తగ్గిపోయింది. ఆ రోజు చావడిలో హారతి సమయంలో సాయి ముఖంలో బాలారంకు పాండురంగని తేజస్సు కన్పించింది. మరునాటి ఉదయం హారతి సమయంలో కూడా అలాటి కాంతే కన్పించింది. సాయి తనవారిలో అలా నమ్మకం పెంచి లాక్కుంటారు.

రాధాకృష్ణమాయి: శ్రీ సాయి దయకు నోచుకున్న స్త్రీ భక్తులలో రాధాకృష్ణమాయి ఒకరు. ఆమె బ్రాహ్మణా స్త్రీ. భర్తా చాలా చిన్నతనంలోనే చని పోయాడు. ఎవరో బంధువులతో కలిసి షిరిడీ వచ్చింది. సాయి బాబా దర్శనం చేసుకున్నది. ఇక ఆ తండ్రి మిద నుంచి ఆమె చూపు మరలలేదు. అక్కడే ఆయన సేవ చేస్తూ ఉంది పోయింది.

రాధా కృష్ణమాయి ప్రతిరోజూ మసీదు అంటా శుభ్రం చేసేది. బాబా నడిచీ విధులన్నీ కూడా ఊడ్చేది. శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాక రాధా కృష్ణ మాయికి చాల పని పెరిగింది. ఆమె మసిదంతా సున్నం కొట్టేది. బాబా లేని సమయంలో మండుతున్న ధుని కూడా తీసి బయట పెట్టి, శుభ్రం చేసాక మళ్ళీ లోపల పెట్టేది. రాధాకృష్ణమాయి శ్రద్ధ వలన షిరిడీ లో ఉత్సవాలు చాలా చక్కగా నడిచేవి. నామ సప్తాహాలు ఉగాది నుంచీ శ్రీ రామ నవమి దాకా జరుగుతుండేవి. ఆ రోజులలో తెల్లవారు జామునే వచ్చి ఆమె కూడా నామ సంకిర్థనలో పాల్గొనేది. శొంఠిగుండ ప్రసాదం వంటివి తయారు చేయటం ఆమె చూచుకొనేది. వంట పనులలోజు భక్తులు ఒక పద్దతి ప్రకారం పనులు చేయటంలోనూ ఆమె శ్రమ చాల ఉండేది.

ప్రతిరోజు రాధాకృష్ణమాయి బాబా పంపిన భోజనం తప్ప తినేది కాదు. అందుచేత బాబా కొన్ని పదార్ధాలను ఆమెకు రోజు పంపేవారు. రాధా కృష్ణ మాయి చాలా శ్రద్ధతో బాబాకు కావలసిన వస్తువులేవు ఆలోచించి అవన్నీ భక్తుల ద్వారా తెప్పించేది. అసలు ఆ రోజుల్లో షిరిడీ సంస్తానం అంటూ ఏర్పడటానికి కారణం రాధాక్రిష్ణమాయే నని చెప్పవచ్చు. ఆమె చ్ప్పటం వలననే అనీక వస్తువులు - పల్లకీలు సింహాసనాల వరకూ ఏర్పడ్డాయి. బ్రతికినంత కాలమూ సాయి సేవలోనే బ్రతికిన రాద్ధ్కృష్ణమాయి చిన్న వయస్సులోనే మరణించింది.

లక్ష్మీ బాయి షిండే: లక్ష్మీ బాయి షిండే గొప్ప ధనవంతురాలు. చిన్న నాతనే భర్తను పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు. ఆమె కూడా ఎవరో బంధు మిత్రులతో కలిసి షిరిడీ కి వచ్చింది. సాయి దర్శనం ఆమె మనసులో గొప్ప శాతిని కలుగజేసింది. అందు చేత లక్ష్మీ బాయి యిక షిరిడీ విడిచి పోలేదు. ఒక ఇల్లు కొని, అక్కడే ఉండసాగింది. ఇంతకూ ముందున్న ఆ ధనవంతుల జీవితాన్ని విడిచి పెట్టి, మామూలు మనుష్యుల్లాగా బ్రతకటం మొదలు పెట్టింది.

ఒకరోజు లక్ష్మీ బాయి మసీదుకు రాగానే శ్రీ సాయి బాబా " అమ్మ నాకు ఆకల్వుతున్నది" అన్నారు. లక్ష్మీ వెంటనే " ఒక్క క్షణం ఆగు బాబా! రొట్టె చేసి తెస్తాను" అని యింటికి పరుగెత్తి, గబగబ రొట్టె కూరా చేసి తెచ్చింది. సాయి ముందు పెట్టింది. ఆయన యంతో ఆకలితో ఉన్నారు గదా - తింటారని ఆమె అనుకున్నది. కానీ బాబా అలా చెయ్యలేదు. తన దగ్గరే నిలబడి ఉన్నా నల్ల కుక్కకు ఆ రొట్టె, కూర తినిపించారు. లక్ష్మీ బాయి బాధ పడింది. "అదేమిటి సాయి! ఆకలని చెప్పి తెమ్మని యిలా చేశావేమిటి? కొంచెం రుచైనా చూడకుండా అలా కుక్కకు పడేశావెం?" అన్నది ఆమె. బాబా మెల్లగా నవ్వారు. "పిచ్చి తల్లీ! ఆ కుక్కకి కూడా ఆకలుంది. పైగా అందులో కూడా నేనే ఉన్నాను గదా! " అన్నారు. లక్ష్మీ బాయి షిండే కి బాబా సర్వాంతర్యామి అన్నది అర్ధమైంది.

లక్ష్మీ బాయి చొరవతో భక్తులన్దరినీ కూడగడుతూ ఉండేది. రాత్రివేళలా మసిడులోకి రావడానికి మహాల్సాపతి, తాత్యాలతో పాటు లక్ష్మీ బాయి శిందేకి మాత్రమే అధికారముండేది. బాబా భోజన సమయంలో మసీదులో ఒక తేరా వేసేవారు. ఆ సమయంలో ఆ తేరా తీసుకు రావడానికి కూడా లక్ష్మీ బాయి షిండే కి చనువుండేది.

శ్రీ సాయి సమాధి చెందే ముందు లక్ష్మీ బాయినీ పిలిచి తొమ్మిది వెండి రూపాయలు ఆమె చేతులలో పోసి, "జాగ్రత్తగా ఉంచుకో" అన్నారు. లక్ష్మీ బాయి ధనవంతురాలు. ఎన్నో వేళ రూపాయలు ఖర్చు చేసి ఉంటుంది. కానీ, సాక్షాత్పరమాత్ముని చేతి నుంచీ వచ్చిన ఆ రూపాయలకు సమానమైనావి ఆమెకు దొరకవు గదా! అవి తొమ్మిది రకాలైన భక్తులకు గుర్తు.

శ్రవణం (భగవంతుని గూర్చి వినటం), మననం (విన్నదాన్ని గుర్తు చేసుకూవటం ), కీర్తనం (తానూ భగవంతుని గూర్చి పాడటం, చెప్పటం), అర్చనం (చేతులారా పూజించటం), పాద సేవనం (సేవ చెయ్యటం), వందనం (వినయంతో, గౌరవంతో నమస్కారం చెయ్యటం, స్తుతించటం), దాస్యం (బానిస లాగా పని చెయ్యటం) సఖ్యత్వం (స్నేహితుదిలాగా మసులుకోవటం), ఆత్మా నివదన (తనకు అంటూ ఏమి మిగుల్ల్చుకోకుండా మొత్తం తనను తానె అర్పించు కోవటం) - యీ తొమ్మిదిన్తినీ నవవిధ భక్తులంటారు. తన పట్ల ఎంతో భక్తీ శ్రద్దలతో సేవించిన లక్ష్మీ బాయి షిండే కు బాబా ఆ నవవిధ భక్తులను గుర్తు చేయడానికే తొమ్మిది రూపాయలిచ్చి ఉంటారు (ఈ నాటికీ షిరిడీ లోని లక్ష్మీ బాయి షిండే యిండ్లో ఆ తొమ్మిది రూపాయలను మన చూడవచ్చు).

కపర్డే భార్య: కపర్డే చాలా గొప్ప భక్తుడు. ఆయన గొప్ప వకీలు కూడా. కొన్ని నెలలపాటు షిరిడీ లోనే ఉండిపోయాడు ఆయన. ఆయన భార్య మరి కొన్ని నేలలుంది. ఆమె పై గల కరుణాతో బాబా ఆమె కొడుకుకు వచ్చిన ప్లేగు పోక్కులను తన మీదకి తెచ్చుకున్నారు. ఆమె వచ్చి "నా కొడుక్కి ప్లేగు వచ్చింది. మా ఊరు తీసుకు వ్ల్లిపోతాను - అనుమతివ్వండి" అనడిగింది. అపుడు బాబా తన కఫనీని పైకెత్తి చంకలో కోడి గుడ్లంత పొక్కులు నాలుగు చూపించారు. "ఇప్పుడు మబ్బులు పట్టి ఉన్నాయి, మరి కాసేపటికి అంటా సర్దుకున్తుందిలే - పో నిర్భయంగా వాడలో ఉండు" అన్నారు.

కపర్డే భార్య ప్రతిరోజూ సాయి బాబా కోసం మధ్యాహ్నం పంనేడు గంటలకు భోజనం తెచ్చేది. దానిని బాబా తీసుకున్న తరువాత తానూ తినేది. ఆమె చూపే భక్తి శ్రద్దలకు బాబా ఆనందించి ఆమె నిలకడనూ, భక్తినీ యితరులకు చెప్పదలుచు కున్నారు. ఒకనాడు పళ్ళెంలో రకరకాల పదార్ధాలు పెట్టుకొని సాయి కోసం తెచ్చింది. సాయి వెంటనే ఆ పళ్ళెం తీసుకోని గబగబా తినటం మొదలు పెట్టారు. అది చూస్తున్న శ్యామా "ఎందుకీ పక్షపాతం? ఇంకెవరైనా తెస్తే వాటివైపు చూడనైనా చూడవు. ఈమె తెచ్చినవి మాత్రం ఇంట యిషంగా తింటున్నవే!" అన్నాడు. అందుకు బాబా నవ్వారు. "ఈ భోజనం నిజంగా విలువైనదే! ఈమె పళ్ళెం నుంచీ యిమ్కొన్ని ముద్దలు తిననివ్వు నన్ను. చాలా కాలానికి చూచానిమేను!" అంటూ ఆమె గతజన్మల విషయాలన్నీ చెప్పారు.

భోజనమైన తరువాత బాబా కాళ్ళు నొక్కుతూ కూర్చుంది కపర్డే భార్య. బాబా ఆమె చేతులు నొక్కటం మొదలు పెట్టారు. శ్యామా అది చూచి "బాగుంది, భగవంతుడూ, భక్తురాలు ఒకరికొకరు సేవ చేసుకుంటున్నారు" అన్నాడు. బాబాకు కపర్డే భార్యపైన అంతులేని పేమ, దయ కలిగాయి. ఎంతో మంది యెంత బ్రతిమాలినా బాబా మత్రోపదేశాలు చేసేవారు కారు. పైగా "మంత్రోపదేశాల వలన ప్రయోజనం లేదు. శ్రద్ధా, సహనం రెండూ ఉంటే చాలు" అనేవారు. అలాంటిది - ఆ రోజు కపర్డే భార్యకు మెత్తని గొంతుతో 'రాజారామ్' అనే మంత్రం ఉపదేశించారు. "ఎప్పుడూ ఈ మంత్రం జపిస్తూ ఉండు, నీకు మేలు కలుగుతుంది. మనసుకు శాంతి కలుగుతుంది" అన్నారు.

గురువూ, శిష్యుడూ పై చూపులకు యీ లోకానికి సంబంధించిన విషయాలలో వేరువేరుగా ఉంటారు. కానీ, లోపల మనసులో ఆత్మలో ఒక్కటిగానే ఉంటారు. గురుసిష్యులకు భేదం ఉందని అనుకొనే వాళ్లు మూర్ఖులు. ఈ విషయం ఈ కదా ద్వారా బాబా మనకు తెలియజేశారు.

ఇంటవరకూ మనం చెప్పుకున్న వాళ్ళంతా సాయి కొలువు లోనివారే. విరుగాక కొన్ని వేలమంది భక్తులు వస్తూ పోతూ ఉండేవారు. కొందరు కొంతకాలం ఉంటే - మరి కొందరు చాలా కాలం ఉండేవారు. కొద్ది కాలంలోనే గొప్ప మార్పు వచ్చేది కొందరిలో. చివరివరకూ ఉన్నా ఏ మార్పూ లేకుండా అలాగే పది ఉన్నవారు మరికొందరు. వారి వారి జీవ లక్షణాలను బట్టి, పూర్వ జన్మల సంస్కారాలను బట్టి - ప్రారబ్ధ కర్మలను బట్టి యిలా ఫలితాలు వస్తుండేవి.

ఓం శ్రీ సాయినాధం నమామ్యహం
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

(ఈ రోజు పూజ అయ్యాక హారతిచ్చి 'సాయి రాం జై సాయి రాం' అని ఐదు నిమిషాలు భజన చెయ్యాలి. తరువాత ప్రసాదం పంచాలి. పాడుకొనే తప్పుడు కధలోని ఆనాది సాయి భక్తులందరిని గుర్తు చేసుకోవాలి. వాళ్ళలో ఉన్నా శ్రద్ధా, భక్తీ మనలోకి కూడా రావాలని సాయిని ప్రర్ధిస్థూ పడుకోవాలి.)






No comments: