Tuesday, August 5, 2008

ఐదవ అధ్యాయం - సోమవారం పారాయణ

ఓం శ్రీ సాయిరాం

శ్రీ సాయినాధ చరితామృతం

ఐదవ అధ్యాయం - సోమవారం పారాయణ

శ్రీ సాయినాధ భగవత్పాదులకు సాష్టాంగ ప్రణామాలు
స్వామి! సాయినాధా!


నేటికి నాలుగు రోజులై నీ కాధాంమృతం త్రాగి త్రాగి మా మనసులు చల్లబడుతున్నాయి. నీ మహిమలు ఆశ్చర్యాన్నీఆనందాన్నీ కలుగజెస్తున్నాయి. నిన్ను చేరుకోగలిగిన నీ భక్తుల అదృష్టమే అదృష్టం. మేము నీవు శరీరంతో ఉండగా చూడలేక పోయాము. కానీ, నీ శక్తి మా చుట్టూ వ్యాపించే ఉందని ఇప్పుడే తెలుసుకుంటున్నాము.
నీ శక్తి మేము పొందగలిగేటట్లు మమల్ని దీవించు. నీ విభూతి ద్వారా మేము మేలు పొందగలిగేటట్లు మమ్ము కాపాడు. ఎల్లవేళలా నీ బొధలే మా చెవులలో రింగుమనే లాగ చెయి. క్షణక్షణం మా దగ్గరే నిలబడి ఉండి మా వెన్ను కాచి నడిపించు తండ్రీ.

****************************

విభూతి మహిమలు

మైనతాయి నానా సాహెబ్ చందోర్కర్ కూతురు. ఆమె ప్రసవ వేదన పడుతున్నది. నొప్పులు విపరీతంగా వస్తున్నాయి. రెండు రోజులు గడిచిన ప్రసవం కాలేదు. ఇంట్లో అందరూ చాల కంగారు పడుతున్నారు. ఎవరికి బాధ కలిగినా ఊది కాస్త నీళ్ళల్లో కలిపి త్రాగించటం ఇంటి వారికి అలవాటు. కానీ, దురత్రుష్టం ఏమిటంటే - సమయానికి ఎప్పుడు ఇంట్లో ఉండే ఊది కాస్త అయిపోయింది. ఓక ప్రక్క మైనాతాయి పరస్థితి చాల ప్రమాదకరంగా ఉంది. పొనీ గభాల్న వెళ్లి బాబా నడిగి ఊది తెచ్చు కుందామంటే షిరిడీకి చాల దూరంలో ఉన్నా 'జామ్నేర్' లో ఉన్నారు వీళ్ళు. ఇక చేసేదేముంది! ఆగకుండా బాబాను ప్రార్ధిస్తూ కూర్చున్నారు. భక్తులు దుఃఖంతో, నమ్మకంతో పిలిచే పిల్లుపు సాయికి వినపడకుండా ఉంటుందా? ఆయన ఏదో ఏర్పాటు చయ్యకుండా వుంటాడా?

శ్రీ సాయిబాబా దగ్గర 'రాంగిరబువా' అనే సన్యాసి ఉంటున్నాడు అప్పట్లో. బాబా మాత్రం అతన్ని బపుగిర్ అని పిలిచేవారు. అతడారోజు తన ఊరికి వెళ్లడానికి ప్రయాణం అవ్తున్నాడు. బాబా అతన్ని పిలిచి, "చూడు బపుగిర్! ఇవ్వాళా నీవు దారిలో జమ్నేర్ వెళ్ళాలి. నేను ఉదీ, ఒక హారతి పాట ఇస్తాను. వాటిని నానాసాహేబ్ ఇంట్లో ఇచ్చి వెళ్ళాలి" అన్నారు. రాంగిర్ బువా " నా దగ్గర జమ్నేర్ వెళ్లడానికి సరిపోయేంత డబ్బు లేదు సాయి! జలగావ్ స్టేషన్ వరకే సరిపోతుంది. అక్కడినుంచి జామ్నేర్ కు ముప్పై మైళ్ళు గుర్రపుబండి మీద పోవాలి. అంత డబ్బు నా దగ్గర లేదు. నేనెలా వెళ్ళాను?" అన్నాడు. బాబా "అదంతా నికెందుకొయ్! అంతా అదే ఎర్పాటవుతుంది పో" అన్నారు. సరే - రాంగిర్ బాబా మాట మీద విశ్వాసంతో బయలుదేరాడు.


జలగావ్ స్టేషన్లో రైలు ఆగేప్పటికి తెల్లవారుజామున 2 గంటలవుతోంది. రాంగిర్ రైలు దిగగానే ఒక బంట్రోతు "బాపూగిర్
బువా ఎవరండీ?" అని అరుస్తున్నాడు. రాంగిర్ అతని దగ్గరకు వెళ్లి తానేనని చెప్పగానే బంట్రోతు నమస్కారం చేసి "నానాసహేబ్ గారు మీ కోసం బండి పంపించారు - రండి " అని తీసుకువెళ్లి, బండి లో ఎక్కించుకొన్నాడు. కొంత దూరం పోయాక ఓకే చోట ఆపించి నానాసహేబ్ గారు పంపించారని చెప్పి ఫలహారాలు పెట్టాడు. రాంగిర్ ప్రయాణం హాయిగా సాగింది. తెలతెలవారు తుండగా జామ్నేర్ పోలిమేరలోకి వెళ్ళాడు. రాంగిర్ బండి ఆపించి రెండు నిమిషాలు
అవతలికి వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చేప్పటికి బండి లేదు. రాంగిర్ తెల్లబోయాడు.

అదేమిటి! బంట్రోతు, బండి వాడూ తనను విడిచిపెట్టేసి బండి తోలుకు పోవటం ఏమిటి? ఎందుకిలా చేసారో - అనుకుంటూ ఊళ్లోకి వెళ్లి వారినీ వీరినీ అడిగి నానాసాహేబ్ ఇల్లు వెదికి పట్టుకున్నాడు. అప్పటికి మూడు రోజులు గడిచినా మైనతాయి ప్రసవించలేదు. ఆమె చచ్చిపోతుందనే భయంతో అందరూ కన్నీరు మున్నీరుగా ఎడుస్తునారు. సమయంలో వెళ్లి సాయి బాబా పంపించారని చెప్తూ ఊదీ యిస్తే యిక వాళ్ల ఆనందం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా ! ఊదీ కాస్త మైనతాయి నోట్లో వేసి, నుదుట బొట్టు పెట్టారు. బాబాకు హారతిచ్చి ఆయన పంపిన పాట పాడారు. (అదే ఆరతీ సాయి బాబా అనే పాట). మరుక్షణంలో మైనాతాయి కి మగ పిల్లవాడు పుట్టాడు. అందరూ 'హమ్మయ్య!' అనుకున్నారు.


నానాసాహెబ్ గబగబా రాంగిర్ బువా దగ్గరకు వెళ్లి, నమస్కారం చేసి "మీరు సరైన సమయానికి వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడారు" అన్నాడు. రాంగిర్ దానికి "నాదేమున్నదండీ! మీరు బండి పంపక పొతే నేను రాలేక పోయే వాడినే!" అన్నాడు. నానాసాహేబ్ తెల్లబోతూ, "బండా? నేను బండి పంపటమేమిటి " మీరు వస్తున్నారని నాకు తెలియనే తెలియదు గదా! బండెలా పంపుతాను?" అన్నాడు. రాంగిర్ ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. మరి బంట్రోతు తనకోసం ఎందుకు వచ్చినట్లు? పైగా ఫలహారాలు కూడా తినిపించాడే! కొద్ది క్షణాల తరువాత హఠాత్తుగా రాంగిర్ బువాకు గుర్తు వచ్చింది - స్టేషన్లో బంట్రోతు "బాపూగిర్ బువా ఎవరండీ?" అని కేక పెట్టాడు గదా! దానితో అతనికి సంగతంతా అర్ధమైంది. బాబా నాతో "అంతా అదే ఏర్పాటవుతుంది పో!" అన్నారు. అంతా ఆయనే ఏర్పాటు చేసారు మరి! స్వామే బండిగా మారి, బండివాడై, బంట్రోతు వేషం కూడా వేసుకొని వచ్చారు. నన్ను ఊరి దగ్గరకు చేర్చి మాయమైపోయారు అన్నాడు.


నానాసాహెబ్ బాబాకు తనమీద ఉన్నా ప్రేమకు ఎంతో పొంగి పోయి "శ్రీ సద్గురు సాయినాధ మహారాజ్ కీ జై ! " అని నమస్కారం చేసాడు. బాబా కు తన భక్తుల మీద ఉండే కరుణా అలాంటిది!

శ్యామా తమ్ముడు షిరిడీ కి కాస్త దూరంలో ఉన్నా ఒక ప్రదేశంలో ఉండేవాడు. ఒకరోజతాడు సాయంత్రం వేళ వచ్చి 'అన్నా! నీ మరదలికి ప్లేగు జబ్బు వచ్చింది. నాకు భయంగా ఉంది. నువ్విప్పుడు మాయింటికి రావాలి' అన్నాడు. శ్యామా తమ్ముడికి ధర్యం చెప్పాడు. కాని ఆ రోజుల్లో ప్లేగు అంటే చాలా భయంకరమైన వ్యాధి. ఒక్కసారి ఊళ్లోకి ప్లేగు వచ్చిందంటే జనం పిట్టల్లా రాలిపోయేవారు. అన్చీత శ్యామా కూడా భయపడుతూ వెళ్లి తమకు తమ్ముడింటికి వెళ్లడానికి అనుమతిమ్మని బాబాని అడిగాడు.

బాబా కొంచెం ఊది తీసి, శ్యామాకిచ్చి 'ఏం ప్రమాదం లేదు, ఈ ఊది ప్లేగు పొక్కుల మిద తాయమను. నివు ప్రొద్దున్నే వెళ్ళు - ఇప్పుడక్కర లేదు' అన్నారు. శ్యామా అలాగే తమ్ముడికి ఊది యిచ్చి పంపించాడు. తానూ మరునాడు వెళ్లి చ్చేప్పటికి మరదలు ఏ జబ్బు లేకుండా, మామూలు యింటి పనులు చేసుకుంటూ కన్పించింది. ఊదికిఉన్న శక్తి చూచి శ్యామా బాబాకు మనసారా నమస్కరించాడు.

చచ్చినవారు బ్రతకటం అసాధ్యం అని అందరికీ తెలుసు. కానీ, బాబా ఊదీకి అసాధ్యం (కానీ పని) ఏదీ లేదు. ఒకసారి ఒక భక్తురాలు భోరున ఏడుస్తూ వచ్చి బాబా పాదాలు పట్టుకొంది. ఆమె భర్త పామి కరిచి చనిపోయాడు. అతన్ని బ్రతికించమని వేడుకుంటూ ఆమె గుండెలు అవిసిపోఎలా ఏడుస్తోంది. బాబా రెండు మూడు సార్లు 'చావు పుట్టుకలన్నవి సహజం. ఎంత ఏడ్చినా పోయినవారు తిరిగిరారు' - అని చెప్పి చూచారు. కానీ ఆమె మోడి పట్టు పట్టింది. "బాబా! నువ్వు దేవుడివి. దేవుడే తీసుకుపోయే వాడూదేవుడే యిచ్చెవాడూనూ. నా భర్తను నాకివ్వు" - అని ఏడుస్తూనే ఉంది.

చివరికి బాబాకు దయ కలిగింది. 'నీకు నిజంగా నేను బ్రతికించ గలనన్న విశ్వాసం (నమ్మకం) ఉందా? అని అడిగారు. ఆమె 'ఉంది బాబా, నువ్వు తప్ప నాకు వేరే దేవుడు లేడు" - అన్నది. అయితే ఊది తీసుకువెళ్ళి నీ భర్త ఒళ్ళంతా రాయి అన్నారు బాబా. ఆమె అలాగే పరుగు పరుగున వెళ్లి సాయి నామం పలుకుతూ ఊది భర్తా ఒళ్ళంతా పూసింది. నాలుగు నిమిషాలలో అతడు కాస్తా కదిలాడు. కాసేపటికి లేచి కూర్చున్నాడు. బాబా పైన అమెకున్నా తిరుకులేని నమ్మకమే అతన్ని రక్షించింది.

ఒక్కొక్కసారి ఎంతో ఇబ్బందికరమైన పరిస్ధితుల నున్చీ కూడా ఊది మనను రక్షించ గలుగుతుంది. ఈ కదా చూడండి. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే భక్తుడికి బాబా పైన అంతులేని గౌరవం. ఈయన శిరిడిలో బాబా నడిచీ విదులన్నితిని ప్రతిరోజు ఊడ్చి శుభ్రం చేస్తుండేవాడు. ప్రతి సంవత్సరం కోటలు కాగానే తన పొలంలో పండిన పంటంతా తెచ్చి బాబా ముందుంచి, అందులోంచి బాబా ఎంత యిస్తే అంతతోనే సంవత్సరమంతా గడుపుకొనే వాడు. బాలాజీ యింటిలోని వారందరికీ బాబా పైన ప్రేమ, శ్రద్ధ ఉండేవి. కొంతకాలానికి బాలాజీ మరణించాడు. ఆయన సంవత్సరికాలు కూడా వచ్చాయి. ఆ సంవత్సరీకాలకు బంధు మిత్రులంతా వచ్చారు.

బాలాజీ కోడలు వంటంతా చేసేసింది. తీరా భోజనాల వేలకు అనుకోకుండా అనేక మంది అతిధులు వచ్చారు. బాలాజీ కోడలు వంటకాలు అన్దరికీ చాలవేమో! కుటుంబ గౌరవం కాస్తా పోడున్దేమోనని భయపడింది. ఆమె అత్తగారు కోడలి భయం చూచి "నువ్వేం కంగారు పడకు. ఇది మనది కాదు - సాయి ఆహారం. ఆయన తన భక్తుల గౌరవం పోగోడతారా? గిన్నెలో ఊది కాస్త వేసి పైన ఒక మూత పెట్టి ఉంచు. మూట పూర్తిగా తీయ కొండానే వడ్డన చెయ్యి" అన్నది. కోడలు అలాగే సాయి స్మరణ చేస్తూ ఊదీ వేసింది. గిన్నేలన్నితి మీదా ఓకే బట్ట కప్పి, అది పూర్తిగా తియకుండానే వడ్డించసాగింది. వచ్చిన వారందరి భోజనాలు అయాక, ఆ బట్ట తీసి చూస్తే యింకా బోలెడన్ని పదార్ధాలు మిగిలు కన్పించాయి. సాయి బాబా ఊదీ ఎవరికి ఏ లోటు కలిగించాడు మరి!

బాబా వెలిగించిన ధుని నుంచీ వచ్చే ఊదీ బాబా భక్తులందరికీ ఎంతో పవిత్రమైంది. ఒంటికి ఏదైనా వచ్చినా, యింట్లో ఏదైనా కష్టం వచ్చినా, సాయి ఊదీ ముందుగా పని చేస్తుంది. ప్రతి రొజూ ప్రొద్దున స్నానం చేసి, చిటెకెడు నోట్లో వేసుకొని, నొసట బొట్టు పెట్టుకోవాలి. తేలు కాటు వంటి వాటికైనా సరే నిప్పి ఉన్నా చోట ఊదీ రాస్తే తగ్గిపోతుంది. బొట్టు పెట్టుకొని, కొంచెం ఆ స్ధలంలో చల్లాలి. సాయి బాబా ఊదీ అంటే శ్రీరామరక్షన్న మాట.

సాయి తీర్చిన కష్టాలు

ఒక్కొక్కసారి శ్రీ సాయి కేవలం మాట మాత్రం చేతనే భక్తుల కష్టాలు తిర్చేవారు. ఎన్నో వందల మైళ్ళ దూరం నుంచీ 'సాయి!" అని పిలిస్తే చాలు - వెంటనే వాళ్ళను రక్షించిన సందర్బాలెన్నో ఉన్నాయి. ఒక ఊరిలో ఒక కుమ్మరి ఉన్నాడు. అతడు జబ్బుగా ఉన్నాడు. అతని భార్య పసిబిడ్డను ఒడిలో ఉంచుకొని, కొలిమి ముందు కూర్చొని తిత్తులు నొక్కుతున్నది. భర్తా దగ్గుతూ మంచి నిల్లిమ్మని ఆమెను పిలిచాడు. ఏదో ఆలోచనలో ఉన్నా ఆమె ఒడిలోని బిడ్డ మాట మరిచిప్యి గబాల్న లేచి నిలబడింది. బిడ్డ కొలామి మంటల్లో పడిపోయాడు.

అ తల్లి భయమ్తో "సాయీ" అని పెద్దగా కేక పెట్టింది. అదే సమయానికి శ్రీ సాయి షిరిడీలో ధుని ముందు కూర్చుని కట్టెలు వేస్తున్నవారు కాస్తా చటుక్కున ఆ మండుతున్న ధునిలో చెయ్యి పెట్టారు. చూస్తున్న భక్తులు బాబా చేతిని పైకి లాగి 'ఏమిటిది బాబా! ఇలా చెయ్యి కాల్చుకున్నరేమిటి? అని అడిగారు. బాబా యిలా అన్నారు - "నా భక్తురాలు తన బాబును రక్షించమని నన్ను పిలిచింది. నా చెయ్యి కాలిన ఫరవాలేదు. బిడ్డ క్షేమంగా ఉన్నాడు. నాకదే సంతోషం" ఆ బిడ్డకు ఒళ్ళు కాలవలసిన కర్మ ఫలం ఉంది. బాబా వాడి కర్మ ఫలం తానూ భరించి, వాడిని కాపాడారు. తన భక్తుల మిద బాబ్కు అంతటి దయ ఉంది.

ఒకరోజు శ్యామాను పాము కరిచింది. అందరూ వితోభా దేవాలయమ్లో పాముల మంత్రం వేసేవల్ల దగ్గరికి వెళ్ళమన్నారు. అందుకు శ్యామా ఒప్పుకోలేదు. అతనికి బాబాయే దేవుడు. అందుకని ద్వారకామాయికి పరుగున వచ్చాడు. కాని, బాబా అతన్ని చూస్తూనే - ఫో, దిగిపో! మసీదు పైకి ఎక్కి వచ్చావంటే నిన్నేం చేస్తానో చూడు" అని గట్టిగా కేకలేసారు. అది విని శ్యామా బయపదిపోయాడు. తన దైవమె తనను కాదు పోమన్న తరువాత ఇక తను బ్రతకటం అన్నది కల్ల అనుకున్నాడు. బాబా "ఏమీ భయం లేదు, దిగులు పడకు - ఫకీరు నిన్ను రక్షిస్తాదులే! ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో, బయట తిరగవద్దు" అని చెప్పారు. అలాగే శ్యామా ఏ ప్రమాదమూ లేకుండా బయట పడ్డాడు. పాము కాటుకు బాబా మాటలతోనే విషాన్ని పోగొట్టారు. వారు 'ఫో, దిగిపో' అన్నది నిజంగా శ్యామాను గాదు, పాము విశాన్నే. బాబా మాటకున్న శక్తి అంట గొప్పది.

బుట్టి అనే ధనవంతుడొకడు బాబా భక్తుడు. ఆయనకొక జ్యోతిష్కుడు ఆరోజు మరణ గండం ఉందని చెప్పాడు. బుట్టి బయపడి బాబా దగ్గరకు వచ్చాడు. అతనేమీ చెప్పకముందే బాబా 'ఏమిటి నీకు మరణ గండం ఉందంటుంన్నారా! అదెలా వస్తుందో నేను చూస్తాను. నీకేం భయం లేదులే - దిగులు పడకు" అన్నారు. ఆ రాత్రి బుట్టీ దొడ్డికి వేల్లినప్పుదొక పాము కళ్ళకు అడ్డంగా వచ్చింది. నౌకరు కర్ర తెచ్చే లోపలే అది తనంత తానె పారి పోయింది. అలా మాట మాత్రం తోనే రావలసిన ప్రమాదాలను కూడా ఆపగాలిగేవారు శ్రీ సాయి బాబా.

సంతానం లేని వారు, చదువులో పైకి రావలసిన పిల్లలు, వ్యాపారాలు చెయ్యాలను కుంతున్నవారు - యిలా ఎందరో సాయి దగ్గరకు వచ్చి తమ కష్టాలు, కోరికలు చెప్పుకున్తుండేవారు. అవన్నీ తిరుస్తుండేవారు సాయి. రతంజి శాపుర్జివాదియా అన్నా ధనవంతుడు నాన్దేడులో ఉండేవాడు. ఆయన మంచి ధర్మపరుడు. నలుగురిలో పేరు ప్రతిష్టలు సంపాదించు కున్నవాడు కూడా. అయినా సంతానం లేని దుఃఖంతో కుంగి పోతుండేవాడు. దాసుగను ఆయనకు బాబా దగ్గరకు వెళ్లి శరణు వేడుకొమ్మని సలహా యిచ్చాడు. రతంజి శిరిడికి వెళ్ళాడు. వినయంతో భక్తి శ్రద్ధలతో బాబా పాదాల దగ్గర కూర్చొని తన బాధ చెప్పుకున్నాడు.

బాబా అతన్ని ప్రేమతో చోచాడు. రతన్ జీ ఇవ్వదలచిన ఐదు రూపాయల దక్షిణ యిమ్మన్నారు. రతన్ జీ యివ్వబోగా "అందులో మూడు రూపాయల పద్నాలుగణాలు యింతకు ముందే ముట్టాయి, ఇక ఒక్క రూపాయి రెండణాలు ఇవ్వు" అన్నారు. రతన్ జీ ఆశ్చర్యపోతూ రూపాయి రెండణాలు సమర్పించుకున్నాడు. తనకు కొడుకులు కలిగేలా దివించమని వేడుకున్నాడు. బాబా అతన్ని దీవించి, నీ కీడు రోజులు పోయినాయి, చికాకు పడకు. అల్లా నీకు పుత్రులను ప్రసాదిష్టాడు" - అని చెప్పారు. రతన్ జీ సంతోషంతో నాందేడ్ తిరిగి వెళ్ళాడు.

దాసుగానుతో జరిగిందంతా చెప్పి, మూడు రూపాయల పదనాలు గణాలు ఇంతకుముందే యిచ్చానని సాయి బాబా అన్నారు. అదొక్కటే నాకు అర్ధం కాలేదు - అన్నాడు. ఐతే హఠాత్తుగా అతనికొక సంగతి గుర్తుకొచ్చింది. షిరిడీ వెళ్లేముందు రోజే నందేడులో ఉండే మౌలాసాహెబ్ అనే ఫకిరుకు విందు చేసాడు తాను. ఆనాది ఖర్చు సరిగ్గా మూడు రూపాయల పద్నాలుగానాలే అయింది. దీనివలన రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది - బాబాను నమ్మితే కోరుకున్నవి నేరవీరతాయి. రెండవది - ఏ మహానియుడికి ఎక్కడ దక్షిణ యిచ్చినా, భోజనం పెట్టినా, పూజ చేసినా - అది సాయికే చెందుతుంది (వేషగాల్లకు యిస్తే కాదు సుమా!)

అలాగే దామూ అన్నా అనే భక్తుడు కూడా బాబా నిదలోకి చేరి సంతానాన్ని పొందాగాలిగాడు. ఆయన జాతకంలో సంతానం కలిగే యోగం లేదని జ్యోతిష్కులు చెప్పారు కూడా. అతడు బాబా భక్తుడు. బాబా తన భక్తుని నిరాశ పదనిస్తాడా? ఒకరోజెవరో బాబాకు 300 మామిడిపళ్ళు పంపారు. బాబా అందులోనుంచీ నాలుగు పళ్ళు తీసి వేరే పెట్టి, "ఇవి దామూ అన్నాకు, ఇవి అక్కడే ఉండాలి" అన్నారు. ఆ తరువాత దామూ అన్నా ద్వారకామాయికి వచ్చినప్పుడు "దాంయా కోసం ఉంచినవీ పళ్ళు, అందరికళ్ళూ వాటి మీదే ఉన్నాయి. అవి దామ్యయే తినాలి" - అని చెప్పారు.

అటుపైన ఆ పళ్ళు అతనికిస్తూ బాబా "వీటిని నీ చిన్న భార్యకివ్వు, విటి శక్తి వలన నీకు నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు కలుగుతారు" అన్నారు. అలాగే బాబా మాటలే నిజమై, జ్యోతిష్యుల మాటలు అబద్దమై, దామూ అన్నాకు ఎనిమిది మంది పిల్లలు కలిగారు. అలా శ్రీ సాయి ఎందరికో ఒడి నింపారు. ఈ నాటికి బాబాకు అలా మొక్కుకుని సంతానం పొందినవారు అలా పుట్టిన పసిబిద్దలను తీసుకువచ్చి షిరిడీలో బాబా విగ్రహం పాదాలకు తాకించి తిసుకుపోతుంటారు.

దద్ దామూ అన్నని సాయి బాబా గొప్ప నష్టం నుంచీ కాపాదరోకసారి. అతడు వేరేవాళ్ళతో కలిసి ప్రత్తి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిన్చాలను కొన్నాడు. ఆ విషయమై బాబాని సంప్రదించి, ఆయన మాట ప్రకారం చేద్దామనుకొని శ్యామాకు ఉత్తరం వ్రాసాడు. శ్యామా ఆ ఉత్తరం తీసుకోని ద్వారకామాయికి వెళ్ళాడు. అతనింకా ఉన్త్తరం విప్పి చదివి వినిపించక ముందే సాయి బాబా "ఏమిటి దామూ ఏదో ఎట్టు వేస్తున్నట్లున్నాడు! ఉన్నదానితో తృప్తి చెందక ఆకాశానికేగిరే ప్రయత్నం చేస్తున్నాడా? అన్నారు. శ్యామా నవ్వుతూ "నీకు తెలియనిదేముంది దేవా! ఏదో కల్లోలం లేవదీస్తావు. నివిక్కడే కూర్చొని అన్దరినీ నీ దగ్గరకు లక్కుంటావు. కొందర్ని ఉత్తరాల రూపంలో లాక్కుంటావు" అన్నాడు. బాబా ఉత్తరం విని, "దామూని పెద్ద ఆశలకు పోవద్దని చెప్పు. ఉన్నదానితో తృప్తి పాడమని చెప్పు." అన్నారు.

దామూ శ్యామా ఉత్తరం చదివి చాలా నిరాశాపడ్డాడు. తనే వచ్చి బాబాతో మాట్లాడితే ఫలితం ఉండుందేమో ననుకొని షిరిడీ కి వచ్చాడు. తానూ వ్యాపారం చేయడానికి బాబా ఒప్పుకుంటే లాభంలో కొంత భాగం ఆయన క్కూడా యిద్దమనుకున్నాడు. కానీ, బాబా ససేమిరా ఒప్పుకోలేదు. దామూ నిరాశతో వెళ్లి పోయాడు. కాని కొద్ది రోజులలోనే బాబా చేసిన మేలేమితో అతనికి తెలిసింది. అతని స్నేహితులు కలిసి చేసిన ఆ ప్రత్తి వ్యాపారం బాగా దెబ్బ దిన్నది. విపరీతమైన నష్టాలు వచ్చాయి. దామూ అందులో తల పెట్టకపోవటం చేత మునగలేదు.

మరోకసారలాగే దామూ అన్నా ధాన్యం వ్యాపారం చెయ్యాలనుకుని బాబా అనుమతి కోరాడు. అప్పట్లో ధాన్యం ధర చాలా ఎక్కువగా ఉంది. చాలా లాభాలు వచ్చేలా కన్పించింది. కాని బాబా దానికి కూడా ఒప్పుకోలేదు. 'నివు రూపాయకు ఐదు సేర్లు కొని ఏడు సేర్లు అమ్మవలసి వస్తుంది, వద్దు' అన్నారు. దామూ అడ్కూడా వదులుకున్నాడు. కొద్ది రోజుల్లోనే బాబా మాటలు నిజమయ్యాయి. వదలకుండా నెలరోజుల పాటు బాగా వర్షాలు కురిసాయి. దానితో ధాన్యం ధర బాగా పడిపోయింది. ఆ వ్యాపారులంతా నాశపోయారు. ఇలా దామూ అన్నాను బాబా రెండుసార్లు నష్టపోకుండా కాపాడారు.

తన పిల్లలు ఏదైనా పెద్ద ప్రమాదానికి లోని "అమ్మ!" అని దుఃఖంతో అరిస్తే - యెంత దూరాన ఉన్నా తల్లి పెగైనా కదులు తుందట. తల్లికి తన బిడ్డా కష్టంలో ఉన్నాడని అనిపిస్తుందట. అలాగే తన భక్తులు ఆపదలో ఉంది బాధతో, భయమ్తో "బాబా" అని అరిస్తే సైనాదునికి తప్పకుండా ఆ పిలుపు అందుతుంది.


నానాసాహెబ్ చందోర్కర్ ఉద్యోగపు పని మీద ఒకసారి హరిశ్చంద్ర గుట్టలలోని వెళ్ల వలసి వచ్చింది. అది మనుష్యలు తిరుగాడని కూండ ప్రాంతం. ఎండాకాలపు మిట్ట మధ్యాహ్న వేళ. తల మాడిపోతోంది. ఎండ నిప్పులు చెరుగుతోంది. ఎండకు బాగా కాలిన కొండల మధ్య తిరిగి తిరిగి ననసహేబ్ అలసి పోయాడు. ప్రక్కనొక స్నేహితుడున్నాడు. చుట్టూ ఎక్కడా మనుష్యులున్న జాడలేదు. నానాసాహెబ్ అడుగు తీసి అడుగు వెయ్యలేక పోతున్నాడు. ఓకే బండ మీద కూలబడ్డాడు. అతని స్నాహితుడి పరిస్ధితి కూడా అలాగే ఉంది.

నానాసాహెబ్ కు సాయి బాబా గుర్తు వచ్చారు. ఆయనే తనను కాపాడ గలవారు! వెంటనే "బాబా! నాకు దాహం అవుతోంది సాయీ! రక్షించవా! సాయీ, సాయీ!" అంటూ ప్రార్ధించటం మొదలు పెట్టాడు. ప్రక్కనున్న స్నేహితుడు" ఎక్కడో వందలమిల్ల దూరాన ఉన్నా బాబాకు నీ ప్రార్ధన వినిపిస్తుందా?" అన్నాడు. తప్పకుండా విన్పిస్తుందనే నానా నమ్మకం. ఆగకుండా పిలుస్తూనే ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి షిరిడీ లో సాయీ బాబా "నానా చావబోతున్నాడు - నేను చావనిస్తానా!" అన్నారు. అని చెంబేడు నీళ్ళు గటగట తాగారు.

వెంటనే నన సాహెబ్ కూర్చున్న చోటికి ఒక బోయవాడు వచ్చాడు. నానా అతన్ని నీళ్లు అడగ్గానే "మీరు కూర్చున్న బండ క్రిందనే ఉన్నాయిగా చల్లని నీళ్లు! అన్నాడు. నానాసాహెబ్ లేచి ఆ తారిని కాస్త ప్రక్కకు జరపగానే దాని క్రింద రెండు మూడు చెంబుల తియ్యని నీళ్లు దొరికాయి. నానా, అతని స్నేహితుడు తృప్తి తీరా తాగారు. తరువాత కొంతకాలానికి నానా తన దగ్గరకు వచ్చినపుడు బాబా "అలాంటి కోడల్లోకి యెర్పాట్లేమీ లేకుండా ఎందుకు వెళ్లావు! నేనే రాకపోతే ఏమయ్యేది" అని కోప్పడ్డారు.

డాక్టరు పిళ్లే గొప్ప సాయి భక్తుడు. అతడి కొకసారి నారి కురుపు లేచింది. విపరీతమైన నిప్పి, వాపూ వచ్చాయి. మండులేమి పనిచేయటంలేదు. పిళ్లే బాధ భరించలేక పెద్దగా ఏడుస్తున్నాడు. అతడు కాకాసాహెబ్ దిక్షిత్ను పిలిచి, 'నెనీ బాధ భరించలేకుండా ఉన్నాను, పోయిన జన్మల్లో నేను చేసిన పాపానికి ఫలితం యిప్పుదనుభావిస్తున్నాను. బాబాను యీ పాపం పది జన్మలకు పంచమని చెప్పండి. నా బాధను ఇప్పటికి ఆపమని ప్రార్ధించండి' అని చెప్పాడు. ధిక్షిత్ యీ మాటలు చెప్పగానే బాబా "అతడు రాబోయే పది జన్మలదాకా ఎందుకు బాధపడాలి? పదిరూజుల్లో నేనా పాపం అంటా నశింప జేయగాలను. అతడిని ఇక్కడికి తీసుకురండి" అన్నారు. పిల్లెను మోసుకొని తెచ్చి బాబా ముందుంచారు. బాబా "మన పాపాలకు ఫలితాలను పోర్పుతో భరించాలి. ఆ కాటు తీసివెయ్యి, ఇప్పుడే ఒక కాకి వచ్చి నీ పుండు మీద పొడుస్తుంది" అన్నారు.

అంతలో సాయంకాలంపూట వెలిగించవలసిన దీపాలు తుడిచే పనివాడు అబ్దుల్లా అక్కడికి వచ్చాడు. అతడు లాంతరు తుడుస్తుండగా పొరపాటున అతని కాలు పిళ్లే కురుపు మీద పడింది. ఆ ఒత్తిడికి కురుపు పగిలిపోయింది. పిళ్లే కెవ్వున అరిచి ఏడవసాగాడు. ఆ పగిలిన పున్డులోనుంచి ఏడు పురుగులు బయటపడ్డాయి. దానితో క్రమంగా పెళ్ళే బాధ తగ్గసాగింది. అతడు ఎడుపాపుకొని నవ్వసాగాడు. బాబా కూడా నావ్వుతూ "మన పిల్లెభాయి నవ్వుతున్నాడు చోడండి, చూడండి" అన్నారు. డాక్టర్ పిళ్లే "నా కురుపును కాకి వచ్చి పోడుస్తుందన్నారు - రాలేదుగా!" అని అడిగాడు. శ్రీ సాయి చిరునవ్వు తో "కాకి వచ్చినదిగా, నివు చూడలేదా!" అన్నారు. అది గుర్తు రాగానే డాక్టర్ పిళ్లే బాబాకు నమస్కారం చేసాడు. అలా బాబా తన భక్తుల బాధలు పోగొట్టడానికి ఏదో ఒక ఉపాయం చోచేవారు.

ఒకసారి ఒకాయన యింట్లో ౩౦,000 రూపాయల దొంగతనం జరిగింది. బాబాకు మొక్కుకున్నాదాయన. తనకు ఆ డబ్బు తిరిగి బాబా ఇప్పించే వరకు తనకు చాలా యిష్టమైన అన్నం తినటం మానేస్తానని మొక్కుకున్నాడు. బాబా దయ వలన ఆ దొంగ స్వయముగా వచ్చి తన తప్పు ఒప్పుకొని ఆ డబ్బిచ్చి వెళ్ళాడు.

శ్రీ సాయి నాధుడు తన దగ్గరకు వచ్చినవారి కష్టాలను తిరుస్తునే వారిలో గొప్ప భక్తీ శ్రద్ధలను కలిగించేవారు. సరైన మార్గంలోకి త్రిప్పేవారు. ఎవరైనా పూజ, దానం ధర్మం వంటివి మర్చిపోతుంటే మళ్లీ గుర్తు చేసేవారు. ఒకసారి హరిశ్చంద్ర పితళే అనే పెద్ద మనిషి భార్యా బిడ్డాల్లతో షిరిడీ కి వచ్చాడు. అతని కొడుక్కి మూర్ఛలు వస్తుండేవి. కళ్లు తెలవేసి, స్పృహ లేకుండా క్రింద పది పోతుండేవాడు. సాయి బాబా తన కొడుకును బాగు చేస్తారన్న ఆశతో పితళే పిల్లవాడిని బాబా దగ్గరకు తీసుకువచ్చాడు. కనీ, అదేం విచిత్రమో గానీ - పిల్లవాడు బాబాను చూస్తూనే కళ్లు గిర్రున తిప్పి క్రింద పడిపోయాడు. నోట్లో నుంచి చొంగ కారుతోంది, పిల్లవాడి చచిపోయినట్లే ఉన్నాడు. మామూలుగా అయితే కొద్ది సేపట్లో తెలివిలోకి రావలసింది - ఎంతకీ రావటం లేదు. వాడి తల్లి భోరుమని ఏడవసాగింది.

అపుడు బాబా "కాస్త ఓపిక పట్టమ్మ! పిల్లవాడిని మీ బసకు తీసుకు వెళ్ళండి. అరగంటలో స్పృహ వస్తుంది". అని చెప్పారు. అలాగే అరగంట తరువాత పిల్లవాడు లేచి కూర్చున్నాడు. పితళే, అతని భార్యా సంతోషంతో బాబా దర్శనానికి వచ్చారు మళ్లీ. అప్పుడు బాబా నవ్వుతూ, "ఏమమ్మ! నీ అనుమానాలు, భయాలు చల్లబద్దాయా? నమ్మకము, ఓపికా ఉన్నవారిని భగవంతుడు తప్పకుండా కాపాడుతాడు" అని తల్లి తో అన్నారు. తారు తిరిగి తమ ఊరు వెళ్లి పోయేటప్పుడు శ్రీ సాయి పితళే ను పిలిచి మూడు రూపాయలిచ్చి "ఇంతకూ ముందు నిఇకు రెండు రూపయలిచ్చాను, ఇప్పుడు మూడు రూపాయలిస్తున్నాను. వీటిని జాగ్రత్తగా పూజలో ఉంచుకో, అంటా శుభమవుతుంది!" అన్నారు. పితళే బాబాకు నమస్కరించి యింటికి వెళ్లి పోయాడు.

షిరిడీ లో జరిగిన విశేషాలన్నీ తన ముసలి తల్లికి చెప్పి, పితళే "బాబా నాకు మునుపు రెండు రూపాయలిచ్చానన్నారు, అదే అర్ధం కాలేదు" అన్నాడు. అప్పుడామె యిలా చెప్పింది - "నాయనా! ఇప్పుడు నీవు నీ కొడుకును తీసుకోని షిర్డీ ఎలా వెళ్ళావో - నీ చిన్నతనంలో మీ నాన్నగారు నిన్ను వెంట బెట్టుకొని అక్కల్ కోట వెళ్ళారు. అక్కడున్నా అక్కల్ కోట మహారాజ్ అనే పేరుగల యోగి మీ తండ్రి కి రెండు రూపాయలిచ్చి పూజలో ఉంచుకోమ్మన్నారు. మీ నాన్నగారున్నన్నళ్లూ పూజ చేసేవారు. ఆయన పోయాక పూజా పోయింది, రూపాయలూ పోయాయి. ఇప్పుడు మళ్లీ సాయి బాబా నీకు అదంతా గుర్తు చేయడానికే యిలా చెప్పి ఉంటారు. ఇకనుంచీ నీవు మళ్లీ పూజ మొదలు పెట్టు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ప్రవర్తన విడిచి నీతిగా ప్రవర్తించు". హరిశ్చంద్ర పితళే తల్లి చెప్పిన ప్రకారం తిరిగి పూజ మొదలు పెట్టి మేలు పొందాడు.

పెద్దలను నిందించిన పాప ఫలం

పాపాలలో మానసికం, వాచికం కాయికం - అని మూడు రకాల పాపాలున్తాయని పెద్దలు చెప్పారు. మనసులో చెడ్డ ఆలోచనలు కలగటం, వేరేవాళ్ళకు చెడు కలగాలని కోరటం, ఇతరుల ప్రవర్తనను గురించి లేని పోనీ ఊహలు చెయ్యటం, పరాయి ఆడ వాళ్ళను గురించి చెడుగా ఆలోచించటం యివన్నీ మానసిక పాపాలు. మనసులోకి వచ్చిన ఓహలన్నీ పైకి మాట్లాడటం, పెద్దలనుఎదిరించి మాట్లాడటం, మహానియులను వక్కిరించటం, ఇతరులను గురించి చేదుగా ప్రచారం చెయ్యటం, నిందలు వెయ్యటం, ఎదుటి వాళ్ళను కఠినంగా తిట్టటం, బూతుమాటలు మాట్లాడటం, దారిన పోయే ఆడ వాళ్ళను ఏదో అని వాగటం, అబద్దాలాడటం యివన్నీ వాచిక - అంటే మాటలతో చేసే పాపాలు. ఇక దొంగతనాలు చెయ్యటం, ఎదుటివారిని హింసించటం, జంతువులను పక్షులను కొట్టటం, పరాయి ఆడవాళ్ళ జోలికి పోవటం యిలాంతివాన్ని కాయిక - అంటే శరీరం తో చేసే పాపాలు. మనకు తెలియకుండా చేసే పాపాల్లో మానసిక పాపాలు, వాచిక పాపాలు ఎక్కువ. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. ఫలితం అనుభవించక తప్పదు. తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలాక మానదు గదా! ఈ కదా వినండి.

షేవడే, సపత్నేకర్ అనే యిద్దరు కుర్రవాళ్ళు 'వకీలు' పరీక్షలు వ్రాస్తున్నారు. పరిక్షలకు ముందు స్నేహితులందరూ కూర్చుని వాళ్ళలో వాళ్ళే ప్రశ్నలు వేసుఒని జవాబులు చెప్పుకుంటున్నారు. వాళ్లలో షేవడే చాలా ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయాడు. ఆటను పరీక్షా పాసు కాలేదని అందరూ అన్నారు. దానికి షేవడే "నాకేమీ రాకపోయినా ఫరవాలేదు, నాకు సాయి బాబా ఆశీస్సు లున్నాయీ. సరిగ్గా పరీక్షా వ్రాస్తున్నప్పుడు నాకన్ని జవాబులూ గుర్తు వస్తాయి. నేను తాప్పకుండా పాసవుతాను - చూస్తుండండి" అన్నాడు. ఆ మాటలు వినగానే స్నేహితులంతా పకపక నవ్వారు. బాబా గారు నిఇకు మార్కులు వేసేస్తారా? అంటూ వెక్కిరించారు. వాళ్లలో సపత్నేకర్ మరీ హేళనగా మాట్లాడాడు. శేవడేని మాత్రమే గాక సాయి బాబాను కూడా వెక్కిరించాడు. అలా గుడ్డిగా నమ్మటం తెలివితక్కువతనం - అన్నాడు. బాబాను తక్కువజేసి మాట్లాడాడు. షేవడే బాధపడి ఊరుకున్నాడు.

కొన్ని నెలలు గడిచి పోయాయి. అంతేకాదు - యెమీ రాదనుకున్న షేవడే కూడా పాసయ్యాడు. అందరూ ఉద్యోగాలలో, సంసారాలలో స్ధిరపడ్డారు. సపత్నేకర్ బాగా సంపాదిష్టున్నాడు. ఒక్కడే కొడుకు, చల్లగా సాగిపోతున్న సంసారంలో హటాత్తుగా పిడుగుపడి నట్లయింది. సపత్నేకర్ ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. తల్లి దంత్రులకు దుఖంతో మతులు పోయినట్లింది. ఎన్నో తీర్దాలు, పుణ్య క్షేత్రాలు తిరిగారు. ఎందరెందరినో మహానియులను దర్శించారు. కొంచెమైనా శాంతి దొరకలేదు.

ఇలా ఉండగా ఒకరోజు సపత్నేకర్ కు చటుక్కున షేవడే గుర్తు వచ్చాడు. అతనికి సాయి బాబా మిద ఉన్నా విశ్వాసం
దాని ఫలితంగా ఆటను పాసవటం గుర్తు వచ్చాయి. వెంటనే అతడు షిరిడీ వెళ్ళాడు. కానీ, బాబా అతన్ని మసీదు మెట్లాయినా ఎక్కనివ్వలేదు. "వెంటనే మసీదు ఖాళి చేయి" అని కేకలు వేసారు. సపత్నేకర్ బాధతో భయం తో కుంగిపోయాడు. చేసేదిలేక వెనక్కు తిరిగి వెళ్లి పోయాడు. కొంతకాలం ఆగి మళ్లీ వచ్చాడు. అప్పుడు కూడా సాయి బాబా అతన్ని కరుణించలేదు. తన దగ్గరికే రానివ్వలేదు. సపత్నేకర్ నిరాశ చేసుకొని తమ ఊరు వెళ్లి పోయాడు. తానింతకుముందు చదువుకునే రోజుల్లో సాయి బాబాను నిందిన్చినందుకే ఆయన తనపైన దయ చూపించలేదని సపత్నేకర్ కు అనిపించింది. అతడు తానూ చేసిన పాపం గురించే బాధపడుతూ ఉండేవాడు. మనసులోనే బాబాను ప్రర్ధిస్థూ ఉండేవాడు. అలా దాదాపు సంవత్సర కాల గడిచి పోయింది. సపత్నేకర్ దంపతులకు బ్రతుకు మిద ప్రేమ, కోరిక పోయాయి. "ఇక కాశికి వెళ్లి పోయి, చివరి వరకూ అక్కడే గడిపేద్దాం" అనుకున్నారు.

వాళ్లు బయలుదేరుదామనుకున్న ముందటి రాత్రి సపత్నేకర్ భార్యకొక కల వచ్చింది. కలలో ఆమె బావి దగ్గరకు నీళ్లకొసం ఖాళీ కుండతో వెడుతున్నది. ఎదురుగా ఒక ఫకీరు వచ్చి "నికేండుకమ్మా శ్రమ! ఆ కుండ యిలా యివ్వు. నేను నీళ్లు నింపి యిస్తాను" అంటున్నాడు. ఆమెకు భయం వేసింది. మెలకువ వచ్చేసింది. ఈ కల విని సపత్నేకర్ " యిది సుభ సూచనే. ఆ వచ్చినది సాయి బాబా వారే. పాడ్ మనం మళ్లీ షిరిడీ వెడదాం" అన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు.

ఈ సారి సపత్నేకర్ దంపతులు మసీదు లోపలికి వెళ్లి శ్రీ సాయి బాబాకు దగ్గాలలో కూర్చున్నారు. తనకు కలలో కనిపించిన ఫకీరు బాబ్యేనని ఆమె గుర్తు పట్టేసింది. బాబా ఏదో వంకన ఎవరికో కదా చెప్తున్నట్లు సపత్నేకర్ కధంతా చెప్పారు. ఆ పైన ఆతని వైపు చూపిస్తూ "విడు తన కొడుకును చంపానని నన్ను తిడుతున్నాడెందుకు? నేను లోకుల పిల్లలను చంపుతానా? అసలు ఆ పోయిన బిడ్డనే మళ్లీ వీడి భార్య కడుపున వేస్తాను చూడండి" అన్నారు.

సపత్నేకర్ కన్నీళ్ళతో బాబా పాదాలు పట్టుకున్నాడు. ఆయన అతని తల నిమురుతూ "ఈ పాదాలు ముసలివీ, పవిత్రమైనవీను. ఇక నీ కష్టాలు తీరిపోయాయి. నాయందే నమ్మకం ఉంచు" అన్నారు. ఒక కొబ్బరి కాయ అతనికిచ్చి. "దిన్ని నీ భార్య కొంగున ఉంచు. నీకు త్వరలోనే కొడుకు పుడతాడు" అని ఆశీర్వదించారు.

బాబా ఆశీస్సు నిజమైంది. సంవత్సరం తరువార సపత్నేకర్ తన కొడుకును తీసుకువచ్చి బాబా పాదాలు మిద పడుకోబెట్టాడు. బాబా ఆ పసివాడిని ఆశీర్వదించి, వాడికి 'మురళీధర్' అని పేరు పెట్టారు. అటుపైన సపత్నేకర్ ఇంకో యిద్దరు కొడుకులు కూడా పుట్టారు.

మహానియులను మనం నిందిస్తే నష్టం వారికి కాదు. ఆకాశం మీదికి ఉమ్మి వేస్తే అది మన ముఖం మీదనే పడుతుంది. అలాగే మహానుభావులను తిడితే ఆ ఫలితం మనమే అనుభవించాలి. అదంతా అనుభవించాక గానీ మళ్లీ మన జీవితాలు ఒక దారిలోకి రావు. ఈ సంగతే మనకు సపత్నేకర్ కదా చెప్తుంది.

ఇప్పుడి అధ్యాయంలో శ్రీ సాయి ఎందరికో ఎన్నో కష్టాలు తీర్చటం గురించి విన్నాం. ఆయన దయగల తండ్రి. మనకెన్నో సహాయాలు చేస్తారు. నిజమే. మరీ కణం ఆయనకేమివ్వాలి? ఆయన మిద మనకు తిరుగులేని నమ్మకం ఉండాలి, అలాగే ఫలితం దక్కేదాకా ఓర్పుతో ఉండగలగాలి. మనం బావి త్రవ్వదలుచు కున్నం. ఒక చోట పది అడుగులు తవ్వం. 'అబ్బే నీళ్లు రాలీదే అని మరో చోట తవ్వం మరో పది అడుగులు. 'అయ్యో! ఇక్కాడా నీళ్లు పడలేదే' అని ఇంకోచోట ఇంకొక పది అడుగులు తవ్వం. అలా పది చోట్ల తవ్వం. మొత్తం పది పదులు వందడుగులు తవ్వం. ఏం లాభం? య్క్కడా నీళ్లు పడలేదు కదా! అని విచార పడితే నీళ్లు వస్తాయా?

మొదటిసారే ఆగకుండా, చోటు మార్చకుండా తవ్వుతూ పొతే య్ప్పుడో ఒకప్పుడు నీళ్లు పడేవి కదా! అలాగే - సాయి బాబాకు పూజ చెయ్యటం. అబ్బే! నెల రోజులనుంచి పూజిస్తున్న గాని ఏమి జరగలేదే! అని మరొక దేవుడి దగ్గరకు పోవటం - అక్కడా ఫలితం లేదని యికొక చోటికి - అలా తిరగకూడదు. బాబాయ్ ఎన్నోసార్లు చెప్పారు - "సంతోషంతో, ఓర్పుతో ఉండండి" అని. అలాటి సహనం ఉండాలి. పెట్టినా, కొట్టినా మన అమ్మ అమ్మే. అమ్మ కొట్టినా సరే పిల్లవాడు అమ్మను వదలడు ఏడుస్తూనే వచ్చి మళ్లీ అమ్మ కాళ్ళకే చుట్టుకుంటాడు.

మన కూడా ఆ పసిపిల్లల్లాగీ "సాయి" నే చుట్టుకొని ఉండాలి. పెట్టినా, ఆయనే దిక్కు ; కొట్టినా ఆయనే దిక్కు అనుకోవాలి. పాల ముంచినా, నీట ముంచినా ఆయనదే భారం అనుకోవాలి. అసలు మనం ఏదీ ఆలోచించనక్కరలేదు. ఒక కష్టం వచ్చింది - ఒక సమస్య వచ్చింది. వెంటనే "సాయీ! ఇదుగో య్దీ నా బాధ" అని ఆయనకు చెప్పేసి - యిక దిగులూ, చింతా లేకుండా వదిలెయ్యాలి. ఆపైన పని ఆయనే చేసుకుంటాడు. ఆ విశ్వాసమే, ఓపికే ముఖ్యం. ఆ రెండు కానుకలు ఆయనికిస్తే చాలు - యిక మనకు బాధలే ఉండవు. అన్ని సాయి నాదుడే మోస్తాడు. ఆ మాట ప్రతిక్షణం గుర్తుంచుకుంటే చాలు మనం. గుర్తుంచుకుందాం.

"ఓం శ్రీ సాయి నాదం నమామ్యహమ్"

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః


( నాటి పారాయణ పూర్తి కాగానే హారతిచ్చి "ఓం శ్రీ సాయిరాం" అనే నామం ఐదు నిమిశాల్లు భజన చేసి, ప్రసాదం పంచాలి. తాత్రి పడుకొని, "స్వామీ! మా కష్టాలు తీర్చు. కష్టాలైనా, సుఖాలైనా నీ ప్రసాడంగానే తీసుకోని, సమానంగా భరించే శక్తి మాకివ్వు". అని ప్రార్ధన చేస్తూ నిద్ర పోవాలి).












No comments: