ఓం శ్రీ సాయిరాం
శ్రీ సాయినాధ చరితామృతం
మొదటి అధ్యాయం - గురువారం పారాయణ
శ్రీ సాయినాధుల పాదపద్మములకు నమస్కారం
స్వామి! సాయినాధా!
శ్రీ సాయినాధ చరితామృతం
మొదటి అధ్యాయం - గురువారం పారాయణ
శ్రీ సాయినాధుల పాదపద్మములకు నమస్కారం
స్వామి! సాయినాధా!
మేమందరం నీ చరిత్ర చదవాలనీ, నీ మహిమను తెలుసుకోవాలనీ ఇక్కడ కూర్చున్నాం. మాకు అక్షరాలు చదవటం వచ్చు. కానీ వాటి వెనుక ఉన్నా గొప్ప గొప్ప భావాలేమిటో తెలుసుకోగల శక్తి లేదు. అది నేవే మాకివ్వాలి. మా మనస్సులు ప్రశాంతంగా ఉండేలాగా అనుగ్రహించు. ఏ విధమైన విఘ్నాలు, ఆటంకాలు లేకుండా నీ చరిత్ర పారాయణ పూర్తి అయ్యేటట్లు మమ్మల్ని దీవించు. నీ పూజ చెయ్యటానికి తగిన శ్రద్ధ మాకివ్వు. ఈ వారం రోజులు నీవు మా మధ్యలోనే వున్నావన్న గుర్తింపు కలుగజేసి నీ కధలన్నీ మాకు అర్ధమయ్యేలా చెయ్యి. మామంధారం నీ బిడ్డలం సాయీ!
మమ్మల్ని నీ నీడకు చెర్చుకో తండ్రీ!!
*************************************
బ్రహ్మ దేవుడు ఈ ప్రపంచం అంతటినీ సృష్టిస్తాడు. విష్ణుమూర్తి దీనిని పోషించి రక్షిస్తుంటాడు. ఇది పూర్తి కావలసిన సమయం రాగానే మహేశ్వరుడు దీనిని నాశనం (లయం) చేస్తుంటాడు. తానే ఇలా మూడు భాగాలుగా విడి పోయి మూడు రకాల పనులు చేస్తుంటాడు భగవంతుడు.
పూర్వం అత్రి అనే మహర్షికి, ఆయన భార్య అనసూయాదేవికి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలసి ఒకే రూపంతో జన్మించారు. ఆ పిల్లవాడికి 'దత్తాత్రేయుడు' అని పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులూ. ఆయన పెరిగి పెద్దవాడై ఎన్నో మహిమలు చూపించారు. ఎందరో భక్తులు తమ లీలలు చూపించి వారిని సరైన మార్గంలో పెట్టారు. దత్తత్రేయులు ఏ ఒక్క దుష్టుడునీ చంపలేదు. తన శక్తి తో, మంచి భోధలతో చేద్దవారిలోని చెడును మాత్రం చంపి వారిని మంచివారుగా మార్చారు. కొంతకాలానికి ఆ అవతారం ముగుసింది.
దత్తాత్రేయుల వారే "శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి" అనే పేరుతో పిఠాపురంలో మళ్ళీ అవతరించారు. ఎన్నో లీలలు చూపారు. ఆ తరువాత ఆయనే కాల కాలాల్లో "నృసింహ సరస్వతీ స్వామి" గా, "మాణిక్య ప్రభువు"గా, "అక్కల్ కోట మహారాజు" గా కూడా అవతారాలెత్తి లోకక్షేమం కోసం ఎన్నో శక్తులు చూపించారు.
ఆ వరుసలో చివరిది మన సమర్ధ సద్గురు సాయి నాధుల అవతారం. శ్రీ సాయి నాధులు దత్తాత్రేయుల వారి పూర్తి శక్తులతో అవతరించారు. అందు చేత శ్రీ సాయి బాబాను "పరిపూర్ణ దత్తావతారం" అంటారు.
శ్రీ సాయి నాధులు అవతరించే నాటికి దేశంలో హిందూ, మహమ్మదీయుల మధ్య ఎన్నో తగవులు, కొట్లాటలు సాగుతుండేవి. ఆ రెండు మతాల మధ్య స్నేహం కుదర్చాలని, వారికి అసలైన ధర్మ మార్గం చూపించాలని శ్రీ సాయి బాబా ఒక మహమ్మదీయ యోగి పుంగవుని వేషంలో అవతరించారు. అంతేగాక ప్రపంచంలోని మానవులందరూ సులభంగా తరించడానికి (మోక్షం పొందటానికి) తగిన భోధలెన్నో ఆయన చేసారు.
తన పిల్లలు ప్రేమించు కోవటం మరచిపోయి పోట్లాడు కుంటుంటే, తండ్రి వాళ్ల మధ్యకు వచ్చి నిలబడి మన్చినీ, ప్రేమనూ భోదించటం సహజమే గదా!
శ్రీ సాయి బాబా గురించి, మెహర్ బాబా అన్నా ఒక మహా యోగి దివ్య దృష్టితో చూచి, యిలా అన్నారు -
"ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తున్న యోగులు మొత్తం 72 మంది వున్నారు. వారందరికీ దారి చూపించే మాహా యోగులు ఐదుగురు. ఆ ఇదుగురుకి గురువైన పరమ యోగిస్వరుడు శ్రీ సాయి బాబా".
శ్రీ సాయి బాబా తల్లి దండ్రులేవారు, జన్మస్థానం ఏదో, అసలాయన పేరేమిటో కూడా య్వ్వరికి తెలియదు. మొట్ట మొదటి సారిగా ఆయన షిరిడీలో 1855 వ సంవత్సరంలో కన్పించారు. చూడటానికి 16 ఏళ్ళ పిల్లవాడి లాగా కన్పిస్తున్నారు
ఫకీరు వేషంలో వున్నారు. ఆయన ముఖంలో వింత కాంతి ఉంది. ఎవ్వరితోను ఎక్కువగా మాట్లాడేవారు కారు. యప్పుడూ ఒక వేపచెట్టు క్రింద కూర్చొని ఏదో ధ్యానం చేస్తున్నట్లు కన్పించేవారు. ఒకసారి అర్ధరాత్రి వేళ పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద పెద్ద చెట్లు కూడా కూలి పది పోయేంత విసురుగా గాలి, కుండపోతగా వాన. ఊళ్ళో వాళ్ళంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని గడిపారు ఆ రాత్రి. మనృనాటి ప్రొద్దున్నే కొంతమంది ఆ బాల ఫకీరు ఏమిపోయాడో చూద్దామని వేప చెట్టు దగ్గరకు వెళ్లారు. ఆ చుట్టూ ప్రక్కలంతా జలమయమై పోయింది. కానీ - చిత్రంగా ఆ ఫఖిరు కూర్చున్న చోట, అతని చుట్టూ మాత్రం ఒక్క చుక్క నీరు కూడా లేదు. అసలా తడే లేదు. ఊరివారంతా ఆశ్చర్య పోయారు.
షిరిడీ లో ఖండోబా దేవాలయం (వీరభద్ర స్వామి గుడి) ఒకటి ఉంది. ఒకసారి ఒక భక్తుడికి ఖండోబా దేవుడు ఒంటి మీదకి వచ్చాడు. పూనకంతో ఊగిపోతున్న ఆ భక్తుడిని కొందరు అడిగారు - "స్వామీ! ఆ వేపచెట్టు క్రింద ఉండే పిల్లవాడు ఎవరు? ఎక్కడనుంచి వచ్చాడు?" అతడు "వేపచెట్టు క్రింద త్రవ్వి చూడండి" అన్నాడు. బాల ఫకీరు లేని సమయం చూసి ఆ వేపచెట్టు క్రింద తవ్వారు కొందరు. ఒక రాతి పలక తగిలింది గునపానికి, దాన్ని ప్రక్కకు తీసి చూస్తే లోపల ఒక సన్నటి సొరంగం ఉంది. దానిలోంచి దిగి లోపలికి వెళ్లారు. ఆ వెళ్ళిన వాళ్ళకు నోట మాట రాలేదు. యేని సంవత్సరాలు క్రితం వెలిగించ్ పెట్టినవో - నాలుగు దీపాలు నిశ్చలంగా వేలుగుతున్నయక్కడ. ప్రక్కన జపమాలలు , ఇంకా యోగులు వాడుకొనే యితర వస్తువులు కన్పించాయి. అందరూ అలా చూస్తూ నిలబడిపోయారు. అంతలో ఆ బాల ఫకీరు అక్కడకు వచ్చాడు. "ఇది నా గురుస్థానం, దాని నెందుకు తవ్వారు? దయచేసి మూసెయ్యండి" అన్నాడు.
అతనికి గురువేవారు? ఈ దీపాలలా వెలుగుతూ ఎంతకాలం నుంచీ ఉన్నాయి? మొన్న మొన్ననే వచ్చిన యీ ఫకీరు "ఇది నా గురుస్ధానం" అనతమేమిటి? ఎవ్వరికీ అర్ధం కాలేదు. అడిగినా అతనేమి చెప్పలేదు. సరే - ఊరి వాళ్ళు అలాగే దాన్ని మల్లి మోసేశారు. ఆ తరువాత కొంత కాలానికి ఆ బాల ఫకీరు ఎటు వెళ్ళిపోయాడో కానీ - ఎవరికీ కన్పించకుండా మాయమై పోయాడు. అలా మూడేళ్లు గడిచి పోయాయి.
బాబా పుర్నర్దర్శనం
అది వేసవి కాలం - మిట్ట మద్యాహ్నం వేళ. గుఱ్ఱపు జినొకటి భుజాన వేసుకొని నీరసంగా కాళ్ళీడ్చుకంటూ నడుస్తున్నదొక వ్యక్తి. అతని పేరు చాంద్ పాటిల్. అతనికొక విలువైన గుఱ్ఱం ఉండేది. చాలా రోజుల క్రితం అది ఎలాగో తప్పిపోయింది. చంద్ పాటిల్ కి ఆ గుఱ్ఱం అంటే తగని ప్రేమ. ఎక్కడయినా కొరక్కపోతుండా అని వెదుక్కుంటూ తిరుగుతున్నాడు. అలసటే మిగిలింది కానీ, గుఱ్ఱం దొరకలేదు. అతడు కాసేపు కూర్చుందామని ఒక మామిడి చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ ఒక ఫకీరు కూర్చొని ఉన్నాడు. చిలుము వెలిగించుకొనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఇతన్ని చూసి "చాంద్ పాటిల్! భుజాన ఆ జీనేమిటి?" అని అడిగాడు. తన పేరు ఎలా తెలిసిందా అని తెల్ల బోతూనే సంగతి చెప్పాడు చాంద్ పాటిల్. "ఆహా! అయితే అది నీ గుఱ్ఱం ఏనాన్నమాట. ఆ దిగువ కాలువ లో మేస్తున్నది చూడు" అని అన్నాడు ఫకీరు.
"అబ్బే లేదండీ! ఇప్పుడు నేను అక్కడనుంచే వస్తున్నాను. అదంతా వెదికాను. ఎక్కడా లేదు". అన్నాడు నిరాశగా చాంద్ పాటిల్. "నేను ఉన్నదంతున్నాను గా! నువ్వు వెళ్లి చూడు" అన్నాడు ఫకీరు ద్రుఢంగా చాంద్ పాటిల్ అనుమానిస్తూనే లేచి వెళ్ళాడు. మరో రెండు నిమిషాలలో గుఱ్ఱంతో సహా తిరిగివచ్చి ఆ ఫకిరుకు నమస్కారం చేసాడు. "మీరెవరో మహానుభావులు, క్షణంలో నా గుఱ్ఱం ని నాకు చూపించారు" అన్నాడు.
అప్పటికి ఫకీరు చిలుం గోట్టంలోకి పొగాకు నింపాడు. ఇక దాన్ని నీటితో తడపాలి, వెలిగించాలి. ఆయన తన జోలె లోంచి చిమట పైకి తీసి దానితో నేల మీద గుచ్చారు. పాతాళగంగ పొంగి నట్లు నీళ్ళు పైకి చిమ్మాయి. చిలుం పీల్చాటానికి కావలసిన గుడ్డ పిలిక తదిపారాయన. ఇక నిప్పు కావాలి. ఫకీరు మల్లి అదే చోట తన పొట్టి గట్టి కర్రతో (సటకా) తో కొట్టారు. నిప్పు ప్రత్యక్షమయింది. ఫకీరు మళ్ళీ అదేచోట తన చేతిలోని పొట్టి గట్టి కర్రతో (సటకా) తో కొట్టారు. నిప్పు ప్రత్యక్షమయింది. ఫకీరు ఆ నిప్పుతో చిలుం వెలిగించి తానోకసారి గట్టిగా పీల్చి, 'ఊఁ! కానీ! అంటూ చాంద్ పాటిల్ చేతిలో పెట్టారు ఆ చిలుం గొట్టం. చాంద్ పాటిల్ గుడ్లప్పగించి, నోరు తెరుచుకొని చూస్తూ ఉంది పోయాడు ఆ వింత ఫకీరును.
ఒక చోటనుండి నీరు, నిప్పు సృష్టించ గలిగిన ఈ ఫకీరు సామాన్యుడు కాదని అర్ధమయింది. సముద్ర గర్భంలో బడబాగ్నిని నిల్పగల ఆ చెయ్యి పరమాత్ముడిదే నని నమ్మకంతో ఆయన పాదాలనండుకొని నమస్కారం చేసాడు. "స్వామీ! మా యింటికి దయ చేయండి" అని వేడుకున్నాడు. ఫకీరు చాంద్ పాటిల్ వెంట వాళ్ల ఊరు ధూప్ వెళ్లి కొంతకాలం అక్కడ ఉన్నారు. అంతలో ఆ పాటిల్ బావమరిది కొడుకు పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురిది షిరిడీ.
(కోపర్ గావ్ దగ్గరి గోదావరి నదికి ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంది షిరిడీ) పెళ్లి వారందరితో పాటు మన ఫకీరు కూడా మూడేళ్ళ తరువాత మళ్లీ షిరిడీకి వచ్చారు.
షిరిడీ ఊరిబయట ఖండోబా దేవాలయం ఉంది. పెళ్ళివారు ఆ గుడిని ఆనుకొని ఉన్న ఖళీ స్థలంలో బండ్లు ఆపుకున్నారు. ఒక్కొక్కళ్ళు బండ్ల లోంచి దిగుతున్నారు. ఖండోబా దేవాలయ పూజారి పేరు మహాల్సాపతి. ఆయన ఈ దిగుతున్న పెల్లివారిని చూస్తున్నాడు. అంతలో ఫకీరు కూడా క్రిందికి దిగారు. ఆయన్ని చూడగారే మహాల్సాపతికి ఏదో ఆనందం పొంగి వచ్చింది. గబగబా ఎదురు వెళ్లి "రా! సాయీ! రా!" అన్నాడు. ఆ క్షణం యెంత పవిత్రమైనదో! అప్పటివరకు ఏ పేరు లేని ఫకిరుకు 'సాయి' అన్నా నామకరణం జరగింది. 'సాయి' అంటే సాధువు అని అర్ధం. 'బాబా' అంటే త్రండ్రి. అల్లా ఫకీరును ఆనాటినుంచీ 'సాయిబాబా' అని అందరూ పిలవటం మొదలు పెట్టారు.
ఆ రావటం రావటం సాయి బాబా మరి షిరిడీ విడిచి వెళ్ళలేదు. అరవై ఏళ్ళ పాటు అక్కడే ఉన్నారు. ఊరి బయట ఒక పాడుబడిన మసీదు లో ఉండేవారు. బాబా వేషం చిత్రంగా ఉండేది. పొడవాటి లాల్చి లాగా ఉండే 'కఫనీ' వేసుకునేవారు. తలకొక గుడ్డ చుట్టుకోనేవారు. ఎప్పుడూ "అల్లా మాలిక్" (భగవంతుడే యజమాని) అంటుండేవారు. వేషము, నివాసమూ ముస్లిం లాగా ఉండటం చేత కొండరాయనాను ముస్లిం అనుకొనేవారు. తానుంటున్న మసీదుకు "ద్వారకామాయి" అని పేరు పెట్టారాయన. అక్కడే తులసి మొక్కలు నాది పెంచసాగారు. ప్రది రోజూ నూనే దీపాలు వెలిగించి గోడల నిండా పెట్టేవారు. ఇవన్ని హిందువుల విధానాలే గనుక, సాయి బాబా హిందువని కొండరనుకోనేవారు. రెండు మతాల వారు ఆయన దగ్గరకు వస్తుండేవారు. మతాలన్నితిని సృష్టించిన భగవంతుడిది ఏ మతం గనుక?
సాయి బాబా అందరితోనూ ఎంతో కలసి మెలసి ఉండేవారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ ఫకీరు బాబా అంటే ఇష్టపడేవారు. బాబా కూడా ఈ పిల్లల్లో తానూ ఒకరి గోలిలాడుతూ, నవ్వుతూ గడిపేవారు. వాళ్ళలో తాత్యా కోటేపాటిల్ అనే పిల్లవాడు బాబా కు ఎంతో దగ్గరయ్యాడు. అతడు బైజాబాయి అని ౦క భక్తురాలి కొడుకు. "సాయి బాబా అంటే బిచ్చమెత్తుకుంటూ బ్రతికే ఫకిరేగా!" అని అందరూ అనుకుంటున్నా ఆ రోజుల్లోనే ఆయనను సాక్షాత్తూ భగవంతుడుగా గుర్తించింది బైజాబాయి.
సాయిబాబా ప్రతిరోజు ఆమె గడపలోకి వచ్చి " అక్క! రొట్టె ముక్క పెట్టవూ! అనేవారు. ఆమె ఎంతో ఆదరంతో, గౌరవంతో రొట్టెలు, కూరలు తెచ్చి ఆయనకు పెట్టేది. అలా బాబా వచ్చి భిక్ష తీసుకోని వెళ్ళేవరకు తానూ భోజనం చేసేది కాదు బైజాబాయి. ఆ తల్లి ఎన్నని జన్మల పుణ్యం చేసుకున్నదో గాని ఆమె కు సాయి అంటే ఎక్కడ లేని నమ్మకం ఏర్పడింది. ఒక్కొక్క సారి సాయి బిక్షానికి వచ్చేవారు కారు. ఎక్కడో చొట్టు ప్రక్కల్ అడవుల్లో తిరుగుతుండేవారు. అలాంటప్పుడు బైజాబాయి తానూ చేసిన వంటకాలన్నీ ఒక గంపలో పెట్టుకొని అది తలకెత్తుకోని, తాత్యాను వెంటబెట్టుకొని చుట్టూ పక్కలంతా గాలించి గాలించి చివరికాయాన్ని వెదికి పట్టుకొనేది. సాయి బాబాను కూర్చోబెట్టి, భోజనం వడ్డించి, తినిపించి మరి ఇంటికి వచ్చేది. శ్రీకృష్ణునికి గోరుముద్దలు తినిపించిన యశోదమ్మ ఎంత పున్యాత్మురాలో ఈ బైజాబాయి కూడా అంత పుణ్యాత్మురాలు అయింది.
బైజాబాయి కొడుకు తాత్యా సాయి బాబాను "మామా!" అని పిలిచేవాడు. బాబా ఒడిలో చేరి ఆటలాడు తండేవాడు. బాబాతో తాత్యాకున్న అనుభంధం చాల గొప్పది. తమ సొంత విషయాల్లో తాత్యాను తప్ప మరెవరినీ కలుగ జేసుకోనిచ్చేవారు కారు. "తాత్యాను నా ప్రాణంతో సమానంగా చోచు కుంటాను" అని సాయి బైజా బాయికి మాట యిచ్చారు. అది నిలుపు కున్నారు కూడా.
సాయిబాబా రకరకాల చెట్ల మూలికలతో, పసర్లతో వైద్యం చేస్తూ ఉండేవారు. ఆయన హస్తవాసి చాల గొప్పది. ఆయనిచ్చే మందులతో ఎంతటి ఒర్గమైనా యిట్టే మయమయ్యేది. దానితో ఆ ఊళ్లోనేగాక చుట్టూ పక్కల కూడా సాయి బాబా మంచి వైధ్యుదన్న పేరు వచ్చింది.
బాబా షిరిడీ లో ఉన్న దెవాలయాలన్నిటినీ గౌరవించేవారు. మారుతి దేవాలయంలో ఉన్న దేవిదాసు అనే యోగితో చాలా స్నేహంగా ఉండేవారు. షిరిడీకి వస్తూపోతూ ఉండే సాధువులందరితో మాట్లాడుతూ, వారితో కలసి వేదాంత విషయాలు చర్చిస్తూ ఉండేవారు. ఆ మొదటి రోజుల్లోనే కొందరు యోగులు, సాధువులు బాబాను పరమాత్ముడని గుర్తించారు. జానకిదాసు, గంగాఝిరు అనే యోగులు సాయి బాబా మేలిమి రత్నం లాంటి వారనీ ఆయన పద స్పర్శకు షిరిడీ కాలక్రమేణా గొప్ప పున్యక్షేత్రమై విలసిల్లు తున్దనీ అన్నారు. ఆనందనాధుడు, తెమ్బెస్వామి (వాసుదేవానంద సరస్వతి) మొదలైన యోగులేందరో శ్రీ సాయిని మొదటి రోజుల్లోనే గౌరవించి కీర్తించారు. క్రమంగా సాయి బాబా కీర్తి చుట్తు పక్కల్ ఊళ్లకు కూడా పకసాగింది.
శ్రీ సాయి నాధులు షిరిడీ లో అడుగు పెట్టగానే ఆహ్వానించిన మహాల్సాపతిని బాబా "భక్తా" అని పిలిచేవారు. అతడు కూడా బాబాను భగవంతుడి లాగానే కొలిచేవాడు. ఆయనతో పాటే తాను కూడా నిత్యము మసీదులో పడుకునేవాడు.
తరతరాల నుంచి కులవృత్తిగా వస్తున్న బంగారం పనిని కూడా మానివేశాడు. ఖండోబా మందిరంలో పూజ అయిపోగానే వచ్చిన్ బాబా దగ్గరే మసీదులో ఉండి పోయేవాడు మహాల్సాపతి భరించలేనంత పేదరికాన్ని అనుభవించాడు. బాబా ఎందరికో వందలాది రూపాయలు దానం చేసేవారు గానీ మహాల్సాపతికి మాత్రం ఒక్క రూపాయైనా యిచ్చేవారు కారు. పైగా ఒకసారి హంసరాజనే ఒక భక్తుడు పదివేల రూపాయలు తెచ్చి అతనికి కానుకగా ఇవ్వబోతే - ఆ డబ్బు మహాల్సాపతి తీసుకోవడానికి వీలు లేదన్నారు బాబా. "అమ్మ పెట్ట పెట్టాడు - అడుక్కొనివ్వదు అన్నట్లు ఇదేం పరస్థితి అనుకోలేదు మహాల్సాపతి.
"బాబా నాకు ఇలా ఉండాలని ఆజ్ఞ ఇచ్చారు. ఇక అదంతే అనుకున్నాడు. తల వంచాడు. ఒక్కొక్కసారి పిల్లలతో ఇంట్లో అందరూ నాలుగేసి రోజులు ఉపవాసం ఉండవలసి వచ్చేది. ఎయినా మహాల్సాపతి చికాకు పడలేదు. తనకు బాబా పట్ల ఉన్నా నమ్మకాన్ని వదులుకోలేదు. అందుకే బాబా అతదోక్కదినే "భక్తా!" అని పిలిచేవారు.
మనందరం భగవంతుడి చేతిలో ఆట బొమ్మల వంటి వాళ్ళం. ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తాం. అయితే ఒక్కొక్కసారి మనం కావాలనుకున్న కోరికలు తీరకపోతే ఆ భగవంతుడి పైన విసుక్కుంటాం. మన కోర్కెలు నెరవేర్చనందుకు ఆయన్ను నిదిస్తాం. ఏడుస్తాం. కానీ ఆయనకు బాగా తెలుసు మన సంగతి. మన యింట్లో పసి పిల్లలుంటారు గదా! వాళ్ళు ఏ మిరప పళ్ళో చూచి, వాటి ఎర్రని రంగు చూచి అవి తినాలని ప్రయత్నిస్తారు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? వాళ్లకు అందకుండా ఆ పళ్ళు దాచి పెట్టేస్తుంది. దాంతో పిల్లలకు బోలెడు కోపం వస్తుంది - దుఃఖం వస్తుంది - గి పెట్టి ఏడుస్తుంటారు. బిడ్డ ఏడుస్తున్నాడు కదా అని వాటిని ఆ తల్లి తినటానికిస్తుందా? ఇవ్వడు కదా!
అలాగే మనందరికీ తల్లి అయిన ఆ భగవంతుడికి నిజంగా మనకు కావలసిందేమిటో, మోజు కొద్దీ అడుగుతున్నవేమిటో
తెలుసు. మనకు తగని వాటికోసం యెంత మొత్తుకున్నా వాటిని మనకు అందనివ్వదాయన. మనకు తెలియక పోయినా ఏవి మనకు మేలు చేస్తాయో వాటిని మాత్రమే యిస్తాడు. అందుచేత లేనిదానికి ఏడవకుండా, మనకు ఏది ప్రాప్తమో అదే వస్తున్దనుకున్నవాడే నిజమైన భక్తుడు. మహాల్సాపతి అలాంటి నిజమైన భక్తుడు. చివరి క్షణాల వరకూ బాబా వెంటనే ఉండి తన జన్మ ధాన్యం చేసుకున్నాడు.

శ్యామా (మాధవరావ్ దేశ్ పాండే)
సాయి బాబా ఉంటున్న మసీదు ద్వారకామాయికి దగ్గరలోనే ఒక చిన్న బడి ఉండేది. ఆ బడి లో టీచరు గా పని చేసేవారు మాధవరావ్ దేశ్ పాండే. ఆటను రాత్రిళ్ళు బడిలోనే పడుకునే వారు.
మొదట మొదట అతడూ అందరిలాగానే సాయి బాబాను పిచ్చి ఫకిరను కున్నాడు. ఒకనాటి రాత్రి మాధవరావ్ కు యంతకీ నిద్ర పట్టలేదు. ఆ కిటికీకి య్డురుగా మసిదుంది. మసీదు నుంచి రకరకాల బాషలలో మాటలు వినిపిస్తున్నాయి. "ఎవరబ్బా ఇంత రాత్రివేళ యీ ఫకీరుతో మాట్లాడు తున్నది!" అని మాధవరావ్ ఆశ్చర్యపడుతూ పరిశీలనగా చూచాడు. అక్కడ సాయి బాబా తప్ప మరెవ్వరూ లేరు.
ఎదురుగా ఉన్నా ఎవరితోనో మాట్లాడుతున్నట్లు బాబా చేతులు తిప్పుతూ తానె కాసేపు మరాఠీలొ, కాసేపు హిందీలో, మరికొంతసేపు గుజరాతీలో, ఇంకొంచంసేపు ఇంగ్లీషులో, ఇంకా మాధవరావు గుర్తించలేని రకరకాల భాషల్లో మాట్లాడుతూ ఉన్న్నారు. మాధవరావు దేశ్ పాండేకు అయోమయమ్గా అన్పించింది. "ఈయన నిజంగా పిచ్చి ఫకీరు కాదన్నమాట!" అనుకున్నాడు. తెల్లవారగానే ద్వారకామాయికి వెళ్లి బాబాకు నమస్కారం చేశాడు. మెల్ల మెల్లగా అతడు బాబాకు దగ్గరి భక్తుడై పోయాడు. బాబా అతన్ని ప్రేమగా "శ్యామా!" అని పిలిచేవారు. పరమశివునికి నందిశ్వరుడెంత దగ్గరివాడో శ్యామా సాయి బాబా కు అంత దగ్గరి వాడి పోయాడు. సాయి దగ్గరకు తిన్నగా వెళ్లి తమ గోడు చెప్పుకోలేక కొందరు భక్తులు శ్యామా దగ్గరకు వచ్చి అతనితో తమ బాధలు చెప్పుకొని, అతని ద్వారా బాబాకు చెప్పించు కొనేవారు.

బాబా ప్రసాదం
సాయి నాధుల దగ్గరకు అన్ని జాతులవారూ, అన్ని మతాల వారూ వచ్చే వారనుకున్నాం గదా! ఆయన హిందువులకు జ్ఞానేశ్వరి, ఏకనాధ భాగవతం, విష్ణు సహస్రనామం, గురుచరిత్ర మొదలైన గ్రంధాలు పారాయణ చెయ్యమని చెప్పేవారు. మహమ్మదీయుల చేత ఖురాన్ చదివించేవారు. రెండు మతాల గ్రంధాలూ తానూ వింటున్డేవారు. ఆ గ్రంధాలలో లోతైన విషయాలను ఆ భక్తులకు వివరించేవారు.
ఒకే రోజున ఉదయం హిందువుల చేత జండా ఉత్సవం, సాయంత్రం మహమ్మదీయుల చేత ఉరుసు ఉత్సవం చేయించేవారు. పెద్ద యెత్తున శ్రీరామ నవమి ఉంట్సవాలు చేయించేవారు. సాయి బాబాకు చక్కని కంఠం ఉండేది. ఆయనా గొంతెత్తి చక్కగా మంచి పాటలు పాడేవారు. టకియా అనే మహమ్మదీయుల సమావేశ్స్ధలంలో ఆయన కాళ్ళకు చిన్న చిన్న మువ్వలు కట్టుకొని చక్కగా నాట్యం గూడా చేసేవారు.
మెల్ల మెల్లగా బాబా శక్తినీ, మహిమలనూ గురించి విని ఎక్కడెక్కడి వారూ ఆయన దర్శనానికి రాసాగారు. తన దగ్గరకు వచ్చిన వారికి బాబా ఎన్నో రకాల మేళ్ళు కలగజేసే వారు. విద్యార్ధులకు చక్కని విద్యను ప్రసాదించే వారు. ఎన్నో ఆపదలనుంచి కాపాడేవారు. అలా మేలు చేస్తూనే వాళ్ళల్లో జ్ఞానం పెంచేవారు. క్రమంగా "ఈ లోకంలో ఉండే బంధువులు, స్నేహితులూ మొదలైన వాళ్ళందరి కన్నా భగవంతుడే దగ్గరివాడు" - అన్నా విషయం వాళ్ల మనస్సుల్లో ముద్ర వేసుకునేలాగా చేసేవారు.
అలా బాబా అందరికీ మోక్షమార్గం చూపిస్తూ 1918 లో తామూ మహా సమాధి చెందే వరకూ షిరిడీ లో ఉన్నారు.
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
శ్రీ సాయి నాద చరితామృతం
మొదటి అధ్యాయం సంపూర్ణం
(ఈనాటి పారాయణ పూర్తి కాగానే కొబ్బరికాయ కొట్టి, పరమాన్నం నైవేద్యం పెట్టి హారతివ్వాలి. ఆ ప్రసాదం కనీసం పదిమందికైనా పంచి పెట్టాలి)

*********************************************
No comments:
Post a Comment