శ్రీ సాయినాధ చరితామృతం
(ఏడవ అధ్యాయం - బుధవారం పారాయణ)
ప్రార్ధన
పరమ పూజ్యమైన శ్రీ సాయినాధుల పాదపద్మములపై తలవాల్చి నమస్కరిద్దాం
ప్రభూ! సాయీశ్వరా!!
అంతకుముందు కొద్ది రోజుల క్రిందటే ఒక సంగతి జరిగింది. బాబా దగ్గర ఎప్పుడు ఒక ఇటుక రాయి ఉండేది. రాత్రి పూట కూడా అది ఆయన తలక్రిందే ఉండేది. అది తన గురు ప్రసాడమని చెప్తుండేవారు. అలాంటి ఇటుక ఒక రోజు పనివాడి చేతిలోనుంచి జారి పది విరిగిపోయింది. బాబా ఆ ముక్కలను తన చెంపకు ఆనించుకొని "ఇది నా జీవితమంతా నాకు తోడుగా ఉంది, ఇది విరిగిపోయింది. ఇక నేను ఎక్కువ రోజులు బ్రతకను" అన్నారు. అంతలోనే ఈ జ్వరం మొదలియింది.
ఒక రోజు బాబా తాత్యాకు ఒకసారి రమ్మని కబురంపారు. ఎలాగో శ్రమపడి వచ్చాడు తాత్యా. బాబా అతనికి పాయసం తినిపించారు. తాత్యాకి, బాబాకి విడదియ్యడానికి వేల్లేనంత బంధం ఉంది. కొన్ని సంవత్సరాలు పాటు బాబాతో పాటు ద్వారకా మాయి లోనే పడుకున్తుండేవాడు. చిన్నప్పటినుంచి ఈ మామా (బాబా) అంటే తాత్యాకి ఎంతో ఇష్టం. బాబా తాత్యాతో ఇలా అన్నారు. "ఒరేయ్ తాత్యా! మనిద్దరి కోసమని రెండు ఉయ్యాలలు తెప్పించానురా! కాని నీవు వద్దులే అని వెనక్కి పంపించేసాను. నేనొక్కడినే వెడతాను. నువ్వుండు". తాత్యా ఎన్నో సంవత్సరాలుగా బాబా గుండెలలో ఉన్నవాడు. అతనికి బాబా మాటల వెనుక బావం వెంటనే అర్ధమైంది. బాబా ఉయ్యాల అనేది 'సమాధి' అనే అర్ధంలో వాడారు.
తాత్యాకు దుఃఖం పొంగివచ్చింది. "బాబా! నన్నే పంపరాదా? నువ్వుంటే భక్తులందరికీ సంతోసం, నేనెందుకు?" అన్నాడు ఏడుస్తూ. అతడి దుఃఖం చూచిన బాబాకు కూడా అతడి మీద ప్రేమతో కన్నీళ్ళు వచ్చాయి. "నోర్మోయ్! యిక చాల్లే యింటికి ఫో" అని కోప్పడుతూ "ఎందుకురా దాంమ్యా ఏడుస్తావ్! బుద్ది లేదూ! నాకు మరణం ఎక్కడిదిరా? " అన్నారు. అంటే తన శరీరం లేకపోయినా తానూ బ్రతికే ఉంటానని బాబా భావం.
ఇక దసరా పండుగ వారం రోజులుంది. ఆ రోజు కొందరు దర్వీషులు (భిక్షగాళ్ళు) ఒక జబ్బుతో ఉన్నా పులిని బండిమీద గొలుసులతో కట్టి తీసుకు వచ్చారు. అది బాధతో తెగ గర్జిస్తున్నది. తన జీవనాధారమైన దాని జబ్బు బాబా తగ్గిస్తారన్న ఆశతో ఫకీర్లు దానినక్కడికి తెచ్చారు. బాబా దాన్ని క్రిందకి దిన్చమన్నారు. మొదట బయపడినా దర్వీషులు దాని కట్లుదదీశారు. అది తిన్నగా మసీదు మెట్లెక్కి వచ్చి బాబా ముందు నిలబడింది. బాబా దాని కళ్ళలోకి సూటిగా చోచారు. పులి తలదించుకోంది. బాబా దర్శనంతో దానికి పాపాలన్నీ నశించి పోయినాయో ఏమో - తోక మూడుసార్లు ఉపి, నేలమీద పది ప్రాణాలు విడిచింది. ఆ పులి పూర్వ జన్మ భాగ్యం ఎంత గొప్పదో గానీ సాక్షాత్తూ పరమాత్ముడి ముందే మరణించింది. దానికి మోక్షమే దొరికుంటుంది. (ఈ పులి సమాధిని ఆ మసీదుకు దగ్గరలోనే యిప్పటికీ చూడవచ్చు).
దసరా దగ్గరకు వచ్చే కొద్దీ సాయి క్షీణించి పోతున్నారు. శ్యామా, బుట్టీ, లక్ష్మిబాయి, మహాల్సాపతి లాంటి భక్తులెప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు. అంతకు ముందు రెండు మూడు రోజుల నుంచీ "నాకిక్కడ విశ్రాంతిగా లేదు, బుట్టీ వాడలో బాగుంటుంది." అంటున్నారు అప్పుడప్పుడు. చివరి రెండు వారాలలు 'వఝే' అన్నా భక్తుడితో "రామ విజయం" చదివించ్కొని విన్నారు. బాబా వఝేకు దక్షిణ యిచ్చి పంపివేశారు.
ఆ రోజు దసరా పండుగ - అక్టోబర్ 15 వ తేదీ. సాయి బాబా ఉదయం నుంచీ అసలు లేవలేక పోతున్నారు. చాల బాధపడుతున్నారు. బాగా నీరసంగా ఉన్నారు. మద్యాహ్నం అందరినీ బోజనాలు చేసి రమ్మన్నారు. లక్ష్మిబాయి షిండే, భాగోజీ, బయాజీ పాటిల్ వంటి నలుగురైదుగురు భక్తులు బాబా దగ్గరే కూర్చొని ఉన్నారు. బాబా తన ఆసనం మీద కూర్చొని తాంబూలం అడిగి వేసుకున్నారు. తరువాత మంచినీళ్ళు త్రాగాబోతే పూర్తిగా మింగుడు పడలేదు. దానితో తన సమయం అయిపోతున్నాడని బాబాకు తెలిసిందో ఏమో కఫనీ జేబులో చెయ్యి పెట్టి తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మిబాయి షిండేకు ఇచ్చారు.
కొద్దిగా ఆయాసపడుతూ "నాకిక్కడ బావుండలేదు, నాన్న రాతివాడా (బుట్టివాడా) కు తీసుకువెళ్ళండి" అన్నారు. అలా అంటూనే తన ప్రక్కనే కూర్చొని ఉన్నా బాయాజీపాటిల్ మీదకి ఒరిగిపోయారు. అంతే పరమాత్ముడు అవతారం చాలించాడు. చుట్టూ ఉన్నా భక్తులంతా భోరమని ఏడ్చారు. "బాబా! బాబా! అన్నా కేకలూ అరుపులూ, ఏడుపులు ఒక్క నిమిషంలో షిరిడీ అంటా పాకిపోయాయి. భోజనాలకు వెళ్ళిన భక్తులంతా పల్లెలలో నీళ్ళు పోసేసి పరుగెత్తుకు వచ్చారు.
అందరు ద్వారకామాయికి చేరుకుంటున్నారు. చుట్టూ ప్రక్కల పల్లెలకు కూడా కబురు పాకింది. శ్రీ సాయి బాబా శరీరం కదలకుండా మసీదులో పది ఉంది. కొందరు భక్తులు "మునుపటి లాగే బాబా మళ్లీ బ్రతుకుతారేమో' అని ఆశ పడుతున్నారు. ప్రతివారూ ఆ స్వామి శరీరాన్ని చూచి కుమిలి పోతున్నారు. "ఆ చెయ్యే ఎన్ని లక్షల మందికో ఊదినిచ్చి కాపాడింది. ఆ పాదాలే షిరిడీ నెలపై తిరిగి మన గడ్డకు కొప్పు శక్తినిచ్చాయి. ఆ నొరే క్షణక్షణం ఎన్నో మంచి నిటులు బొధిస్తూ మన బ్రతుకులు సరిదిద్దడానికి ప్రయత్నం చేసింది. ఆ కనులే తమపై ప్రేమజల్లులు కుర్సేవి. ప్రతివారికీ సాయి తమకు చేసిన మేలు, ఆయన పోగొట్టిన కష్టాలు గుర్తు వస్తున్నాయి. ఇన్నాళ్ళూ తమకు తలమీద గొడుగులాగా ఉన్నా ఆ చల్లని తండ్రి యిక లేడు, ఇంక ఆయన గొంతు తమకు వినపడదు - అనుకోగానే అందరికీ దుఃఖం పొంగిపొంగి వస్తున్నది.
నిజంగా సాయికి మరణం ఉందా? లేదని ఆయనే ఋజువు చేశారు. శ్రీ సాయి సమాధి చెందినా రోజు తెల్లవారు ఝామున పండరీపురంలో ఉన్నా దాసుగానుకు కలలో దశనమిచ్చారు. "గాణూ! మసీదు కూలిపోయింది, నేను ఆచోటు విడిచి వెళ్ళిపోయాను. నువ్వు వచ్చి నా శవాన్ని పూలతో కప్పు" అని చెప్పారు. దాసుగను వెంటనే తన శిష్యులతో కలసి షిరిడీకి వచ్చాడు. అదే రోజు తెల్లవారుతుండగా లక్ష్మణ్ మామజోషి అనే భక్తుడికి కనిపించారు.
బాబా "ఇన్నాళ్లూ నాకు హారతిస్తున్న జోగ్ నేను చనిపోయాననుకొని హారతివ్వటం లేదు. నువ్వు వచ్చి హారతివ్వు" అని చెప్పారు. అతదలాగే మసీదుకు వచ్చి ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా వినకుండా బాబాకు హారతిచ్చి వెళ్ళాడు. ఆ మధ్యాహ్నం మామూలుగా జోగ్ కూడా వచ్చాడు. అందరూ కలిసి హారతిచ్చారు. అప్పుడు జోగ్ బాబా చెయ్యి తెరచి దక్షిణ పెట్టాడు. మామూలుగా అయితే మనిషి చనిపొతే శరీరం బిగుసుకు పోతుంది. కాని పోయిన 24 గంటల తరువాత కూడా సాయి చెతివెళ్ళు చక్కగా తెరుచు కున్నాయి. మళ్లీ ముడుచు కున్నాయి కూడా.
శ్రీ సాయి బొంబాయిలో ఉన్నా 'ప్రధాన్' అనే భక్తుడి వదిన గారికి కలలో కనిపించారు. 'మీ సంచిలో వున్నా పట్టు బట్ట నా మీద కప్పడానికి పంపించండి' అని చెప్పారు. ఆ పట్టు బట్ట ఎన్నో సంవత్సరాల నుంచీ తమ దగ్గరున్నడనే సంగతి ఆమె మర్చేపాయింది. ఈ కల రావటం తో వెదికితే దొరికింది. దాన్ని షిరిడీకి పంపారు. (1923 వరకూ కూడా సాయి బాబా సమాధి మీద ఎక్కువగా దాన్నే కప్పుతూ ఉండేవారు.)
బుట్టీ మురళీధరుడి కోసం కట్టిస్తున్న మందిరంలో శ్రీ సాయి బాబా శరీరాన్ని సమాధి చేసారు. ఆ విధంగా సాయే
శ్రీ కృష్ణుడని లోకానికి స్పష్టమై పోయింది. షిరిడీ వెళ్ళే భక్తులందరూ దర్శించేది యీ సమాధి మందిరాన్నే. ఇక్కడ ప్రతిష్టించబడిన సాయి నాధుల పాలరాతి విగ్రహం ఎంతో కలలు చిందుతూ, జేవంతో ఉన్నా సిని చూస్తున్నంత అందంగా ఉంటుంది. ఆయన కళ్లు మనని చూస్తున్నట్ల్హూ, ఆ పెదవులు చిన్న నవ్వుతో "వచ్చావా" అని మనని పలకరిస్తూ విచ్చుకున్తున్నట్లూ అనిపిస్తాయి.
శ్రీ సాయి సమాధి మాములుగా చచ్చిపోయిన వాళ్ళను పాతిపెట్టి, పైన కట్టిన సమాధి కాదు. దానికి కూడా ప్రాణం ఉంది. మనం నిజమైన బాధతో, దుఃఖంతో వెళ్లి, ఆ సమాధి ఎదుట నిలబడి ప్రార్ధన చేస్తే, మన మనసులో ఉన్నవాణ్ణి విన్నవించు కొంటె ఆ సమాధే మనకు సమాధానం యిస్తుంది. ఆ మాట బాబాయే స్వయంగా చేప్పారు. తానూ సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు తనను చూడడానికి వచ్చిన భక్తులతో సాయి బాబా యిల చెప్పారు.
"నా సమాధినుంచే నేను సర్వకార్యాలు నిర్వహిస్తాను. నా శరీరం సమాధినుంచే మాట్లాడుతుంది. నా భక్తులకు రక్షణ నా సమాధినంచే వస్తుంది." దీనిని బట్టి మనకు తెలుస్తోంది కదా! - శ్రీ సాయి సమాధి కేవలం రాతి సమాధి మాత్రమే కాదనీ, దాని లోపలాల్ ఉన్నది సాయి శవం కాదనీ, స్వయంగా సాయి నాధుల శక్తేననీ.
సాయి సమాధి చేదింది 1918 వ సంవత్సరంలో. అంటే యిప్పటికి (2008) తొంభై ఏళైపొయింది. ఆయన శక్తి రోజు రోజుకీ ప్రప్రాంచమంతా వ్యాప్తి చెందుతున్నది. ఇతర దేశాలలో కూడా సాయి భక్తులు వేల మంది ఉన్నారు. సాయి దేవాలయాలు కూడా వెలుస్తున్నాయి. ఇక మన దేశం సంగతి చెప్పనే అక్కరలేదు. సమాధి అయ్యాక యిన్నేళ్లకు ఆ శక్తి ఎలా పాకిపోతోంది? ఆయనింకా ఉన్నారు గనుక! మరి ఉంటే కనపడరేం - అని అనుమానం రావచ్చు. ఆనాడు షిరిడీలో ఉన్నట్లుగా అదే ఆకారంలో లేకపోవచ్చుగానీ, ఈ ప్రపంచంలో ఉన్నా ప్రతీ జీవిలోనూ ఆయనున్నారు. ఆ విషయం ఆయన ద్వారకామాయి లో ఉన్నప్పుడే చెప్పారు. ఎలాగో యీ క్రింది కధలు వినండి.
ఒకసారి ఒక భక్తురాలు బాబాను తమ యింటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. ఆమె శ్రద్ధా, ప్రేమ ఉన్నా భక్తురాలు గనుక బాబా అలాగే వస్తానని చెప్పారు. ఆమె ఎంతో సంతోషంగా రకరకాల పదార్ధాలు తయారు చేసింది. పదకొండు గంటలయ్యేప్పటికి రొట్టెలు, అన్నం, కూరలు, మిఠాయిలు కూడా చేసేసింది. అన్నం వేడి ఆరకుండా పొయ్యి గట్టు మీద పెట్టి ఉంచి వీధి వాకిట్లో నిలబడి సాయి కోసం ఎదురు చూడ సాగింది. పన్నెండు - ఒంటిగంట - రెండు - మూడు గంటలు కూడా అయిపోయింది. సాయిబాబా రాలేదు. ఆమెకు దుఃఖం ముంచుకు వచ్చింది.
"వస్తానని చెప్పి ఆశపెట్టి, తీరా కష్టపడి వంట చేసుకుంటే యిల రాకుండా వుంటారా?" అని పోట్లాదదామనుకుంది. తలుపులు మూసి ద్వారకమయికి వెళ్ళాలని వెనక తలుపులు వేసి వచ్చేసరికి, ఒక నల్ల కుక్క ముందు మెట్లెక్కి లోపలికి వచ్చింది. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. ఛీ! ఫో! అవతలికి - కర్రేది! అంటూ దాన్ని భయపెట్టింది. అది జాలిగా వెనక్కి వెనక్కి చొస్తూ వెళ్లి పోయింది.
ఆ భక్తురాలు తలుపులు మూసేసి, ఒక్క విసురున బాబా దగ్గరకు వెళ్ళింది. అమేనంత దూరం నుంచీ చూస్తూనే బాబా చాలా జాలి ముఖంతో "ఏమ్మా! భోజనానికి రామన్నావు - తీరా వస్తే కర్రతో కొడతానని బెదిరిస్తావా? అన్నారు. ఆ భక్తురాలికి ఏమి అర్ధం కాలేదు. "మిరసలు రాకుండా నేను బెదిరించానంటారేమిటి బాబా?" అని అడిగింది. "నల్ల కుక్క రూపంలో వస్తే కొత్త బోయావుగా!" అన్నారు బాబా. ఆమె తెల్లబోయింది. భగవంతుడు కుక్క రూపంలో వస్తాడని తానెలా అనుకుంటుంది! "బాబా! నన్ను క్షమించండి. ఆ కుక్క మీరేనని నాకు తెలియలేదు. రేపు తప్పక రండి. ఈసారి పొరపాటు పడను" అన్నది. బాబా సరేనన్నారు. మరునాడు కూడా ఆ భక్తురాలు చక్కగా శుబ్రంగా వంట చేసింది. కొత్త మిఠాయిలు వండింది. కుక్క వచ్చినా కొత్తగూదదనుకుంది. సాయిబాబా వచ్చే వేలకు అన్నీ సిద్ధం చేసుకొని, మెట్లు గడప కడిగి ముగ్గులు వేసింది. అవి అందంగా వచ్చాయని మురిసిపోతూ చేతులు కడుక్కొని వచ్చే టప్పటికి ఒక గేదె బురద కాళ్ళతో ముగ్గులన్ని తోక్కేస్తూ మెట్లెక్కి వస్తోంది. ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. సాయి నాధుల పవిత్ర పాదాలు తొక్కాలని వేసిన ముగ్గులు పాడుసుస్తుండా యీ వెధవ గేదె! - అని మండిపడుతూ ఒక కట్టే తీసుకోని దాని వీపుమీద గట్టిగా ఒక్కటి వేసింది. గేదె గబగబ మెట్లు దిగింది. క్రింద నిలబడి ఆమె వైపోసారి జాలిగా చూస్తూ వెళ్లి పోయింది. ఆమె విసుక్కుంటూ మళ్లీ ముగ్గులు సరిగా వేసుకోవతంలో మునిగి పోయింది.
మధ్యాహ్నం పన్నెండు - ఒంటి గంట - రెండు - మూడు - నాలుగు గంటల వరకు చూచింది. ఇక మసీదుకు బయలుదేరింది. బాబా ఆమెను చోస్తూనే "అమ్మో ! మళ్లీ కొడుతుందేమో!" అని భయపడుతున్నట్లు అన్నారు. అలా అంటూనే కఫనీని పైకెత్తి తన వీపు మీద రక్తం చిందుతున్న పెద్ద కార్ర దెబ్బను చూపించారు.
"రమ్మంటావు - తీరా వస్తే యింత దెబ్బ కోడతావు - ఎందుకమ్మా అంట కోపం!" అన్నారు. ఆ భక్తురాలు గజగజ వణికిపోయింది. అయ్యో! తానెంత పాపం చేసింది! రోజూ చోచే గేదె రూపంలో ఆయనే వస్తారని ఎలా అనుకుంటుంది? అందుకే అంట దెబ్బ కొట్టింది. ఆమె బాబా పాదాల మిద పది భోరున ఏడ్చింది. "బాబా! నన్ను క్షమించండి - పాపిష్టిదాన్ని నా తండ్రిని కొట్టాను" అంటూ గిలగిలలాది పోయింది. బాబా ఆమెను ఓదార్చారు. కొంతసేపయ్యాక ఆమె తన యింటికి తిరిగి వెళ్ళబోతూ, బాబాను ఏదో అడగబోయి ముందువెనుక లాడుతోంది. బాబా అది చూచి "ఏమిటమ్మా - చెప్పు" అన్నారు. ఆమె తలవంచుకు నిలబడింది. బాబాకు విషయం అర్ధమై, "సరేనమ్మా రేపు వస్తానులే, కొట్టావు గదా మరి!" అన్నారు నవ్వుతూ. ఆమె పొంగిపోతూ బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయింది.
మరునాడు మధ్యాహ్నం కూడా వంట చేసి ఎదురు చూచిందా భక్తురాలు. కానీ, సాయి బాబా రాలేదు. ఆమె బాధపడింది. 'అవును - ఎలా వస్తారు! నేనొట్టి జ్ఞానం లేని మొద్దుని. గడపలోకి వచ్చిన నా తండ్రిని కొట్టిన పెద్ద పాపిని. అందుకే ఆయన రాలేదు. సరే నేనే వెళ్లి నా స్వామికివి తినిప్స్తాను' అంకున్నది. వంటగదిలోకి వెళ్లి చూచింది. మిఠాయిలకు చీమలు పట్టాయి. ఆమె వాటిని దులిపి, ఒక పళ్ళెంలో పెట్టుకొని ద్వారకామాయికి వెళ్ళింది.
శ్రీ సాయి బాబా ఆ భక్తురాలిని చూస్తూనే "రా తల్లీ, రా! నువ్వు చేసిన పేణీలు (అదొక మిఠాయి) యెంత బగున్నయమ్మా! కడుపు నిండా తిన్నాను" అన్నారు. ఆమె బాబా తనను వెక్కిరిస్తున్న రనుకున్నది. పళ్ళెం ఆయన ముందుంచి, మిరసలు రాకుండానే ఎలా తిన్నారు బాబా! నా మిద మీకు కోపంగా ఉంది.' అన్నది కన్నీళ్ళు పెట్టుకొని. బాబా "నేను నిజంగానే వచ్చాను తల్లీ! తిన్నాను కూడా - ఇదిగో చూడు" అంటూ తన కఫనీ పైకెత్తి పొట్ట చూపించారు. శ్రీ సాయి బాబా బొడ్డు చుట్టూ పేణీ ముక్కలు ముక్కున కరుచుకున్న చీమలు కొన్ని తిరుగుతున్నాయి. వెంటనే ఆమెకు మితాయికి చీమలు పట్టడం గుర్తు వచ్చింది. ఆనందంతో, ఆశ్చర్యంతో, భక్తీతో ఆమె సాయి పాదాల మీద వాలిపోయింది. "నా తండ్రి! చీమల రూపంలో వచ్చి నా వంట తిన్నావా!" అని పొంగి పోయింది. అప్పుడు సాయి ఇలా అన్నారు -
" అమ్మా! నేనెప్పుడూ అబద్దం చెప్పను. వస్తానంటే తప్పకుండా వస్తాను. ఏ రూపంలో వస్తానో నా భక్తులు గుర్తించాలి. ప్రపంచంలోని అన్ని జీవుల లోనూ నేనున్నాను. అది గుర్తుంచుకో" అందుచేత సాయి భక్తులైన వారు ఏ జేవినీ హింసించ కూడదు.
ఒకసారి ఆత్మారామ్ అనే ఆయన భార్య షిరిడీకి వచ్చింది. ఎవరింట్లోనూ ఉంటూ, వాళ్లకు డబ్బిచ్చి భోజనం చేస్తౌండేది. ఒకరోజు ఆమె మసీదుకు రాగానే బాబా "నువివ్వాళ పెట్టిన రొట్టెతో నా కడుపు నిండిపోయిందమ్మా! రోజూ యిలాగే పెడుతుండు" అన్నారు. "అదేమిటి బాబా! నేనిప్పుడే వస్తున్నాను నీ దగ్గరకి, పైగా నేనే యింకోకరింట్లో తింటున్నాను" అన్నది. దానికి రొట్టె పెట్టావా లేదా?" అన్నారు. ఆమె పెట్టనన్నది. "మరింకేం తల్లీ! అది నాకే వచ్చింది. ఆకలితో ఉన్నా ఏ ప్రాణికి నువ్వు కడుపు నింపినా నా కడుపే నిడుతుందని గుర్తుంచుకో" అన్నారు. అందుకేమన గడపలోకి వచ్చిన వారికి మనం తినే కారపు మేడుకులలోనైనా సరే - ఒక ముద్ద పెడితే బాబా ఎంతొ ఆనందిస్తారు.
మంచి ప్రాణులలోనే కాదు క్రూర జంతువులు, విషపు పురుగులలో కూడా తానే ఉన్నానన్నారు బాబా. ఒకసారి బాలాజీ నెవాస్కర్ అనే భక్తుడి పశువుల పాకలోకి ఒక పాము దూరింది. అది బుసగోడుతూ అటు యిటూ తిరుగుతుంటే పశువులన్నీ భయపడి కదులుతూ గోల చేస్తున్నాయి. నెవాస్కర్ అన్ని జీవులలోను బాబాయే ఉంటారని గొప్ప నమ్మకం. అందుచేత ఆయన ఏ మాత్రం భయపడకుండా ఒక గిన్నె నిండుగా పాలు తెచ్చి పాము ముందు పెట్టి, దాని ప్రక్కనే కూర్చున్నాడు. "బాబా! ఎందుకిలా గోల చేస్తున్నావు? మమ్మల్ని భయపెట్టాలనుకున్నావా? ఇదిగో ఈ పాలు మెల్లగా త్రాగు "అని ప్రార్ధించాడు. ఆ పాము కదలకుండా కాస్సేపుండి హఠాత్తుగా మాయమై పోయింది.
షిరిడీలో ఒకాయన కోడెదూడకు త్రిశూలం గుర్తు వేసి శివుడి పేరు మిద ఆంబోతుగా విడిచి పెట్టాడు. అది పెరిగి పెద్దదై అందరి చేలలోనూ పడి మేస్తుడేది. శివుడి ఆంబోతని యెవ్వరు ఏమీ అనేవారు కారు. మెల్ల మెల్లగా దాని అల్లరి హద్దు మీరి పోయింది. అందుచేత ఉళ్ళో వాళ్లందరూ కలిసి, దాన్ని బందేలదోడ్లో ఉంచి, దాని మేతకయ్యే ఖర్చు అందరూ కలసి భరించాలని అనుకున్నారు. సరే ముందు ఒక నేలకయ్యే ఖర్చు ఇచ్చి, ఆంబొతును ఒక మార్వాడీకి అప్పగించారు. దగ్గరలో ఉన్నా 'రహతా' అనే ఊళ్ళో బందేలదోడ్లో వదిలేసి రమ్మని చెప్పారు.
ఆ మార్వాడీ చాలా చెడ్డ వాడు. వాడు దానిని రహతా తోలుకువెళ్లి పద్నాలుగు రూపాయలకు ఒక కసాయివాడికి అమ్మేసి, షిరిడీ వచ్చాడు. బందేలదోడ్లో వదిలిపెట్టి వచ్చానని చెప్పాడు. అందరో నిజమే ననుకున్నారు. కానీ, ఆ రోజు తెల్లవారు జామున సాయి బాబా ఒక భక్తుడి కలలో కన్పించి "నన్ను రహతాలో కసాయి వాడి వాకిట్లో కట్టేసారు, వచ్చి విడిపించు" అని చెప్పారు. ఒక్కసారి కాకుండా వరుసగా మూడు సార్లు అలా కనిపించే సరికి ఆ భక్తుడికి అనుమానం వచ్చి, రహతా వెళ్లి వెదికితే కసి ముంగిట్లో కట్టేసి ఉన్నా ఆంబోతూ కనిపించింది. సాయి ఆ విధంగా పశువులలో కూడా తానే ఉన్నానని నిరూపించారు.
సాయి బాబాకు ఎంతో దగ్గరగా ఉండే మహాల్సాపతి ఒకరోజు గజ్జి కుక్క నొకదానిని కర్రతో కొట్టాడు. ఆ సాయంత్రం అతడు బాబా దగ్గరకు వెళ్ళగానే ఆయన "భక్తా, నాలాటిదే ఒక గజ్జికుక్క ఎలాగో తిరుగుతున్నది ఊళ్ళో, దాని నందరూ కొడుతున్నారు పాపం!" అన్నారు. మహాల్సాపతికి తన తప్పు గుర్తు చేసారన్నమాట.
ఇంత వరకూ మనం విన్న విషయాలన్నీ మనకేం చెప్తున్నాయి? శ్రీ సాయి నాధులు సమాధి చెడటం అంటే - ఆయన శరీరం మాత్రమె నశించి పోయింది. ఆయన శక్తి ప్రపంచమంతటా వ్యాపించే ఉంది. ప్రతి ప్రాణిలొనూ - చిన్న చీమ మొదలు పెద్ద ఏనుగు వరకూ, పాము మొదలు మనిషి వరకూ - ప్రతి ప్రాణిలోనూ ఆయన లేని చోటు లేదు. బాబా ముంచు రకరకాల నైవేద్యాలు పెట్టి పూజ చేసినంత మాత్రాన ఆయనకు తృప్తి కలగదు. ఆకలిగా ఉన్నవారి కడుపు నిమ్పినప్పుడే ఆయనకు సంతోషం కలుగుతుంది.
సాయి బాబా మన కల్లకిప్పుడు కనిపించరు. మరి, ఆయనకు సేవ చెయ్యటం ఎలాగ? ఆయన తానూ ప్రతి జీవిలోనూ ఉన్నానని చెప్పారు. అందుచేత కష్టంలో ఉన్నా ఏ జీవికి మనం సేవ చేసినా అది సాయి బాబాను సేవించినట్లే. అందుకని మాన్ చుట్టూ ప్రక్కల వారికి ఏ చిన్న కష్టం వచ్చినా పరుగున వెళ్లి సాయపడేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ ఒక్క గుణం నేర్చుకుంటే చాలు - ఆ స్వామి మన గుండెలోనే గుడి కట్టుకొని కూర్చున్నట్లే అవుతుంది.
ముగింపు ప్రార్ధన
ఏడు రోజులనుంచీ మనమంతా యిక్కడ కూర్చొని శ్రీ సాయి నాధుల జీవనలిలా విన్నాం. ఆ స్వామి దయగలిగితే ఎటువంటి మంచి చేస్తారో తెలుసుకున్నాం. అందుకు ఆయనకు ఎమివ్వలో అర్ధం చేసుకున్నాం. అన్ని ప్రాణులలోను సాయి బాబాయే ఉన్నారని గ్రహించాం. ఈ వారం రోజులలో మన కులం, మతం, డబ్బున్నవాడు, లేనివాడు - ఇలాంటి తేడాలన్నీ మర్చిపోయాం. అందరం కలిసి బాబా పూజ చేశాం. అందరం కలిసి ప్రసాదాలు పంచుకున్నాం. ప్రథిరోజూ సాయంత్రం పూట దేవుని పేరు తలుచ్కున్నాం. భజన చేశాం.
మనకున్న బాధలు, దిగుళ్లు, కష్టాలు, కన్నీళ్లు - అన్ని కాసేపు మర్చిపోయాం. అందరం కలిసి భగవంతుడి నామ సంకీర్తన చేస్తుంటే ఎంత బాగుందో చూడండి. మళ్లీ రేపటి నుండి ఎవరి గోల వారిదే. ఆయినా మనమంతా ఇప్పుడు చుట్టాలం, బంధువులం. సాయీ బంధువులం. సరిపదనివాడు, స్నేహితుడు అన్నా బేధం లేకుండా అందరిని ప్రేమించమని సాయీ చెప్పారు. అంచేత మనం యిలా ప్రమాణాలు చేసుకుందాం. ఈ మాటలు ఒకసారి విన్నా, మళ్లీ మనసులో చెప్పుకోండి.
"నేనింక మీదట ఎవ్వరికీ చెడు చెయ్యను - చెడు జరగాలని కోరుకోను."
నేనింక మీదట ఎవరి సొమ్మూ ఆశించాను. నా యింటికి ఆకలితో వచ్చిన ఏ ప్రాణిని ఊరికే పోమ్మనను. నేను తినే దానిలోనే ఒక్క ముద్దైనా పెట్టకుండా పంపాను.
ఎవరి గురించైనా చెడు ప్రచారాలు చేసేముందు గాని, నిందలు వేసేముందు గాని సాయీ బాబాను తలచుకొని, "బాబా యిందుకు నన్ను క్షమిస్తారా?" అని ప్రశ్న వేసుకొని అప్పుడు మాట్లాడతాను.
కోపం, విసుగు వంటివి తగ్గించ్కొనే ప్రయత్నం చేస్తాను. ఏది తాగుతున్న, తింటున్న, ఏ వస్తువును అనుభవిస్తున్న బాబాకు అర్పించ మరి తీసుకుంటాను.
స్వామీ, సాయీశ్వరా! మేము చ్సుకున్న పై ప్రమాణాలన్నీ సరిగా గుర్తుంచుకొని, ఆచరణలో పెట్ట గలిగేలా మమ్ము దీవించు. మా ఇరుగు పొరుగు, పిల్ల మేకా, గొడ్లూ గోడలు అన్నీ చల్లగా ఉండేలా చూడు బాబా! కష్టమైనా, సుకహ్మినా నివు ఇచ్చిన ప్రసాడంగానే తీసుకునే శక్తి మాకివ్వు తండ్రీ!
అన్ని వేళల మాకు తోడునీడవై ఉండు. మానవజన్మ ఎత్తినందుకు - నీ పాదాలు పట్టినందుకు - మా బ్రతుకులు సరైన దారిలో ఉండేలాగా నడిపించు తండ్రీ!
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
సాయీనాధ మహారాజ్ కీ జై!
సర్వే సన్తు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఖభాగ్ భవేత్!!
(ఈ ప్రార్ధన చదివిన తరువాత రెండు నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉంది, కళ్లు మూసుకొని, మన హృదయమ్లో సాయి బాబా ఉన్నట్లు ఊహించుకోవాలి. నమ్మకంతో, భక్తీతో, ప్రేమతో వారం రోజులూ కధలన్నీ విన్నవారికి బాబా ఆ క్షణంలో తప్పకుండా కన్పిస్తారు కూడా. ఆ తరువాత మెల్లగా కళ్లు విప్పి బాబా ఫోటో చూడండి. నమస్కారం చేసి ప్రసాదం తీసుకోవాలి).
(ఈ ముగింపు ప్రార్ధననే గురువారంనాడు కూడా చదివి కర్పూర హారతి యివ్వాలి.)
******************************************************************
No comments:
Post a Comment