ఓం శ్రీ సాయిరాం
శ్రీ సాయినాధ చరితామృతం
ఆరవ అధ్యాయం - మంగళవారం పారాయణ
ప్రార్ధన
శ్రీ సాయినాధ దేవుల పాదపద్మాలకు నమస్సులు
ప్రభూ! ముల్లోకాలకూ సృష్టికర్తవైన తండ్రీ !
మేము నీ బిడ్డలం. మా శరీరాలు, మనసులు, ఆత్మలు నీవిగా చేసుకో. మేము నీకు సాష్టాంగంగా నమస్కరిస్తున్నప్పుడు మా కాళ్ళు చేతులు పొట్ట, గుండె, పెదవులు, నుదురు, ముక్కు, చవులు అన్నీ నేలకాంచి నమస్కారం చేస్తున్నాము. మా శరీరం మొత్తం నీ సేవకే ఉపయోగిస్తామని ఆ విధంగా ప్రమాణం చేస్తున్నాము. కానీ, మళ్లీ మళ్లీ అది మరచి పోతుంటాము. సాయీ, నీవే మాకది గుర్తు చేస్తుండాలి. మా కనులు నిన్నే చూస్తుండాలి. మా చెవులు నీ కథలే వింటుండాలి. మా పెదవులు నీ పేరే పలుకుతుండాలి. మా మనసులు మీ బోధలు గురించే ఆలోచిస్తుండాలి. మా చేతులు నీవు చెప్పిన మంచి పనులే చేస్తుండాలి. మా పాదాలు నీవు చూపిన దారిలోనే నడుస్తుండాలి. ఆ విధంగా నీవే మమ్మల్ని నడిపిస్తుండాలి. స్వామీ!! నీ కరుణ లేనిదే మేము ఏమీ చెయ్యలేమని మాకు తెలుసు. అందుకే మళ్లీ మళ్లీ నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం. సాయీ! అన్నివేళలా మాతో ఉండు . మమ్మల్ని నడిపించు.
******************
శ్రీ సాయి నాద చరితామృతం
మొదటి అధ్యాయం - గురువారం పారాయణ
రెండవ అధ్యాయం - శుక్రవారం పారాయణ
మూడవ అధ్యాయం - శనివారం పారాయణ
నాల్గవ అధ్యాయం - ఆదివారం పారాయణ
ఐదవ అధ్యాయం - సోమవారం పారాయణ
ఆరవ అధ్యాయం - మంగళవారం పారాయణ
ఏడవ అధ్యాయం - బుధవారం పారాయణ
ముగింపు హారతి పాట
ఈ అధ్యాయంలో శ్రీ సాయిబాబా అరవై ఏళ్ళు షిరిడీలో ఉండి, చేసిన మంచి మంచి ఉపదేశాలు, బోధలు తెలుసుకుందాం. పూర్వం మన దేశంలో ఎందరో గొప్ప ఋషులు ఉండేవారు. వాళ్లు తపస్సు చేసి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోగలిగారు. వాటిని వేదాలు అంటారు. కొన్ని వేల సంవత్సరాలు గడిచేటప్పటికి జనంలో అప్పటి తెలివితేటలు లేకుండా పోయాయి. ఆ వేదాలు అర్ధం చేసుకొనే శక్తి లేకుండా పోయింది. వాటి సారం అంతా కలిపి "ఉపనిషత్తులు" వ్రాసారు.
శ్రీ కృష్ణుడు ద్వాపర యుగంలో పుట్టాడు. మహాభారత యుద్ధంలో అర్జునునికి జ్ఞానబోధ చేసాడు. అప్పుడాయన మరికాస్త తేలికగా ఉండేట్లు "భగవద్గీత" చెప్పాడు. ఇప్పుడు మనకు అది కూడా అర్ధం చేసుకునే శక్తి లేదు. అందుచేత సాయి బాబా తన దగ్గర చేరిన మనుష్యులకు తేలికగా తెలిసేటట్లు చిన్న చిన్న కధలుగా అనేక ఉపదేశాలు చేసారు. భగవద్గీతలో మనిషి ఎలా బ్రతకాలని కృష్ణుడు చెప్పాడో అలా జీవించి చూపారు. సాయి అప్పుడప్పుడు తన భక్తులకు భోదించిన వాటిలో ముఖ్యమైన విషయాలు ఈ అధ్యాయంలో చెప్పుకుందాం.
సర్వజీవులలోను సాయిబాబా
శ్రీ సాయి బాబా శిష్యులలో చాలా గొప్ప స్ధితికి చేరుకున్నవాడు శ్రీ ఉపాసనీ శాస్త్రి. ఆయనను నాలుగేళ్ల పాటు ఖండోబా దేవాలయం లోనే ఉండమని ఆజ్ఞాపించారు సాయి బాబా. అలాగే మూడున్నరేళ్ళు పాటు ఉండి గొప్ప శక్తులు సంపదిన్చాడతాను. ఉపాసనీ శాస్త్రికి ఆచారాలు, మది పట్టింపులు ఎక్కువ. ఆయన ప్రతి రోజూ వంటచేసి, మడిగా బాబా దగ్గరకి తీసుకువెళ్ళి నివీదన చేసి, అప్పుడు భోజనం చేసేవాడు. బాబామీద ఆయనకు శ్రద్ధ భక్తులు ఉన్నాయి. కానీ, బాబా అన్ని జేవులలొనూ వున్నారనే విషయాన్ని యప్పటి కప్పుడు మరచిపోతుండేవాడు.
ఒక రోజు అతను భోజనం తయారుచేసుకొని బాబా దగ్గరకు వేల్లబూతుండగా ఒక నల్ల కుక్క అతని కెదురు వచ్చి ఆశగా వంటకాల కేసి చూస్తూ నిలబడింది. ఉపాసనీ శాస్త్రి దానిని కొట్టి, బాబా దగ్గరకు వెళ్లారు. ఆవేళ బాబా ఆయన నివేదనను తేసుకొలేదు. "నేను అక్కడిదాక వస్తే కొట్టావు - ఇక్కడికి తెచ్చావెందుకు? నీవు కొట్టిన నల్ల కుక్కలో నేనే ఉన్నానని మరచి పోయావా?" అన్నారు. ఉపాసనీ శాస్త్రి సిగ్గుపడి వెళ్ళిపోయాడు.
మరునాడు మళ్ళి శ్రద్ధగా వంటచేశాడు. నల్ల కుక్క వస్తుందేమోనని చూచాడు - రాలేదు. దూరంగా ఒక గొడకానుకొని నిలబడి ఈ వంటకాల వైపే ఆశగా చూస్తున్న చందాలుడైన భిక్షగాడొకడు కనిపించాడు. ఆచారవంతుడైన మన ఉపాసనీ శాస్త్రికి వాడిని చూస్తే చిరాకు కలిగింది. అతన్ని కసిరికొట్టి, ద్వారకామాయికి వచ్చాడు. బాబా ఆవేళ కూడా ఉపాశానీ నివేధన గ్రహించ లేదు. "ఆ భిక్షకుడి రూపంలో వచ్చిన నన్ను కసిరికొట్టావు - ఇక్కడికేమో పెడతానని వచ్చావు. అన్ని ప్రానులనోనూ నేను లేనా? అంతటా నన్ను చూడటం నేర్చుకో" అని మందలించారు. చిన్నదైనా, పెద్దదైనా, ప్రదిజీవిలోనూ పరమాత్ముడున్నదన్న సంగతి ఇలా బొధించారు సాయి బాబా.
కుల మాట బేధాలు పాటించటం అంటే సాయి బాబా కు నచ్చదు. హిందు మహమ్మదీయ మతాల వారిని కలిసి మెలసి ఉండమని ఆయన ఎప్పుడు బోధించేవారు. ఏ మతం వారైనా తమ మతంలోని గొప్పతనాన్ని తెలుసుకుంటే అది వాడాలి వేరే మతాల వైపు పరిగెత్తారు. అన్ని మతాలు బోదించేది మంచినే. అవన్నీ భగవంతుడిని చేరడానికి మనం తయారుచేసుకున్న వేరు వేరు దారులు - అంతే. కానీ కొన్ని మతాలవారు ఇతరులను తమ మతంలోని లగాతాన్ని గొప్పగా భావిస్తారు. అలాంటి పనులను బాబా అసహ్యించుకున్నారు. ఒకసారి బడేబాబా అన్నతాడు ఓకే యువకుడిని బాబాకు చూపిఇంచి ఇతన్ని మహమ్మదీయ మతం లోకి మార్చానని చెప్పాడు. బాబా ఆ యువకుడిని దగ్గరకు పిలిచి, చెంపమీద కొట్టి "నీ అబ్బను మార్చు కుంటావురా ?" అని కోప్పడ్డారు. హిందువైనా, మహామ్మదియుడైన, క్రైస్తవుడైనా, యికేవరైనా నీతి నియమాలతో బ్రతకటం ముఖ్యం. సరయిన ప్రవర్తన, మంచి మనసు, దైవ భక్తీ ఉండాలి - అనేవారు.

నిందలు వేయటం
వాచిక పాపాలను గూర్చి పోయిన అధ్యాయంలో చదువుకున్నాం గదా! వాటిలో ఇతరుల గురించి చెడ్డగా ప్రచారం చెయ్యటం ఒకటి. ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చాడు. మరో భక్తుడి గురించి చేదుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. వాడలో కూర్చొని ఏదో ఒక సారి అని ఊరుకోవటం కాదు - అదే పనిగా మాట్లాడుతున్నాడు. వితున్నా వాల్లన్దరకూ కూడా చికాకు కలిగించింది. ఆ సాయమ్త్రం లెండీ తోటవైపు అందరూ కలసి నడుస్తున్నారు. దారిలో ఒక పంది అశుద్ధం తింటూ కనిపించింది.
వెంటనే బాబా ఆ నోటిదురుసు వాడిని పిలిచి "అదిగో చూచావా! ఆ పంది అందరూ అసహ్యించుకునే అసుద్ధాన్ని ఎంత రుచిగా తింటున్నదో! నీవు కూడా నీ సాటి భక్తుడి గురించి అసష్యంగా మాట్లాడవు. అతడి పాపాల్ని నీ నాలుకాతో నాకివేశావు. ఎంతో పుణ్యం చేసుకుంటే నీకీ మానవ జన్మ దొరికింది. తిరిగి ఇలాంటి పనులు చేస్తే - ఇలా మాట్లాడితే ద్వారకామాయి నిఇంను క్షమించదు అన్నారు. ద్వారకామాయి అంటే బాబాయ్ క్షమించరన్న మాట.
ఎప్పుడయినా మనం ఎవరినైనా నిందించటం గాని, వాళ్లు చేసిన చెడ్డ పనులను గురించి అదీపనిగా మాట్లాడటం గాని చేస్తే - వాళ్ల పాపాలన్నీ పోయి, అవన్నీ మనకు వస్తాయని శాస్త్రాలు చెపుతాయి. అంటే మనం ఎదుటి వాళ్ల పాపాలన్నీ మన నాలుకాతో నాకినట్లవుతుంది కదా! అందుచేత అలాంటి మాటలు నాలుక మీదికి రాగానే, మనం "అమ్మబాబోయ్! వాళ్ల పాపాలన్నీ నాకెందుకు!" అని మాట్లాడటం మానెయ్యాలని శ్రీ సాయి బోధించారు.

కూలి:
మనం ఎవరితోనైనా పనులు చేయించుకుంటే వాళ్లకు సరైన కూలి యివ్వాలి. కాస్త ఎక్కువగా ఇవ్వగలిగితే మరీ మంచిది. లేకపొతే మనం వాళ్లకు ఋణపడిపోతము. ఒకసారి శ్రీ సాయి బాబా ఒక ఇంటి పై కప్పు మీదికి ఎక్కడానికి నిచ్చెన తెమ్మన్నారు. ఆ నిచ్చెన తెచ్చినవాడికి ఆయన రెండు రూపాయలిచ్చారు. ఆ రోజుల్లో రెండు రూపాయలంటే చాల ఎక్కువ గదా! అందరూ "నిచ్చెన తెచ్చినందుకు రెండు రూపాయలివ్వటం చాలా ఎక్కువ" అన్నారు. ఒకరి కష్టాన్నిన్కోకరుంచుకో కూడదు". అం చెప్పారు. ఇవ్వాళా కమ్యునిష్టులు, సోషలిస్టులూ గొంతులు చించుకొని అరుస్తుంటారు గదా! ఆ మాట సాయి బాబా ఎన్నడో చెప్పారన్న మాట.
భగవంతుని చేరే మార్గంకొంత మంది మనుష్యులు ప్రతిదాన్ని డబ్బుతోనే కొనగలం అనుకుంటారు. ఏదైనా కొనగాలరేమోగానీ పరమాత్మను డబ్బు తో తెలుసుకోలేరు గదా! ఒకసారి ఒక ధనవంతుడు బాబా దగ్గరకు వచ్చాడు. "బాబా! నీవు నాకు బ్రహ్మ జ్ఞానాన్నిస్తావని ఇంతదూరం వచ్చాను. మళ్ళి తొందరగా వెళ్లిపోవలసిన పని వుంది. అంచేత రానుపోను బండి మాట్లాడుకొని వచ్చాను. నాకు తొందరగా యిచ్చేయ్యండి" అన్నాడు.
బాబా చిరునవ్వుతో "అలాగే నాయనా! చాలా సంతోషం. నా దగ్గరకు పిల్లల్నిమ్మనీ చదువిమ్మనీ, ఉధ్యొగాలిమ్మనీ - ఇలాంటి కోరికల కోసం వస్తారు గానీ, నీలాగా బ్రహ్మజ్ఞానానిమ్మనివచ్చేవా ళ్ళే లేరు. తప్పకుండా యిస్తాను" అన్నారు. అతన్ని కూర్చోబెట్టి ఒక పిల్లవాడిని పిలిచి, "నందూ మార్వాడీ dagగరకు పో' అన్నారు బాబా. వాడు మళ్ళి వచ్చి అతనూ లేదన్నాడు. అల ఐదారు చోట్లకు తిరిగాడు పిల్లవాడు. ఇదంతా చూస్తూ కూర్చున్న ధనవంతుడు "బాబా! నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వు" అని తొందర పెట్టాడు.
అప్పుడు బాబా నవ్వి, "నాయనా! ఇదిగో నీకు బ్రహ్మాన్ని చూపడానికే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను. దైవాన్ని పొందాలనుకునీవాడికి మొదట మోక్షం పొందాలనే గట్టి కోరిక ఉండాలి. ఈ లోకంలో ఉన్నా సుఖాలంటే విరక్తి కలగాలి. నా డబ్బు, నా ఇల్లు, నా పిల్లలు అనే మమకారం, చెడ్డ మాటల చెడ్డ పనులు మానెయ్యాలి. ఎప్పుడూ నిజం చెప్తూ బ్రహ్మచర్యంతో వుండాలి. మామూలుగా మనుశ్యులన్దరికీ ఈ లోకంలో వస్తువుల మీద మొజుంటుంది. కాని అవన్నీ ఇవ్వాలుండి రేపు పోయేవే. నాశనం లేకుండా వుందేడల్లా ఒక్క భగవంతుడే. ఆ విషయం ఎప్పుడు గుర్తున్చుకొవాలి.
మన మనస్సు కోతిలాగా చపలమైంది. ఒకసారిటూ ఒకసారటూ గెంతుతుంటుంది. అందుచేత మనసును, శరీరాన్ని 'బుద్ధి' తో అదుపులో పెట్టుకోవాలి. యప్పటికప్పుడు - ఇది మచిదా కాదా? అని ఆలోచించు కుంటూ నడవాలి. తన పనులు తానూ జాగ్రత్తగా చేస్తూ భగవంతుని ధ్యానించే వాడికే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
మనిషి లోపల ఆరు శత్రువులుంటాయి. వాటిని కామం (కోరిక ), క్రోధం (కోపం), లోభం (పిసినారితనం), మొహం(మోజు), మదం (పొగరు), మాత్సర్యం (అసూయ) అంటారు. బయటి శత్రువులను కత్తితో పోదిచో, కర్రతో కోతతో చంపుతాం. ఈ లోపలి శత్రువులనేట్లా చంపగలం? వీటికి ఇద్దరు నాయకులుంటారు. వాళ్ల ప్రేలు మమకారం (నాది, నాది అనుకోవటం), అహంకారం (అన్ని నేనే చేస్తున్నాననుకోవటం). ఎంత గొప్పవాళ్ళను కూడా యీ శత్రువులు పడగోట్టేస్తూ వుంటాయి. మరెలా వీటిని జయించడం? ఒకే ఒక్క మార్గం. మంచి గురువు చెప్పే బోధలు ఆచరణలో పెట్టటం. గురువును సేవిస్తూ వుంటే ఆయన మన జీవితాన్ని సరైన మార్గంలో నడుపుతారు. ఈ శత్రువులంతా చచిపోతారు వరుసగా. ఆ పైన మెల్లమెల్లగా భగవంతుని దయ మన మీదకి వస్తుంది. అప్పుడు మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
నాయనా! నీ జేబులో బ్రహ్మం ఏభై యింతలుగా వుండి చూడు. ధనం మిద కోరిక, సంసారం మిద ఆస పోనివాడికి దేవుడెలా కన్పిస్తాడు? నీకున్న అర్హతను బట్టే నీకు మేలు కలుగుతుంది". బాబావారి యీ మాటలన్నీ అక్కడున్న వాల్లదరికీ కళ్లు తెరిపించాయి. బాబా వంటి మహానుబావుడికి ఇదు రూపాయలతో ఏంపని? ఒకవేళ ఆయనకు అవసరమైతే ప్రక్కనున్న ధనవంతుదివ్వవచ్చు గదా! వాడి జేబులో రూ. 250 వున్నాయి గదా. పిల్లవాడు ఇదారుచోట్లకు తిరుగుతుంటే చూస్తూ ఊరుకున్నదే తప్ప జేబులో చెయ్యి పెట్టలేదే! తన డబ్బు మిఇడ అంత లోభితనం వున్నవాడికి బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది?
అందుచేత మనం భగవంతుని చేరుకోవాలంటే - యీ లోకంలో మన చెయ్యవలల్సిన పనులన్నీ పద్దతి ప్రకారం చేస్తూనే
ఉండాలి. మనకివన్నీ నిలబడేవి కావనీ, ఎప్పటికైనా మనం వీటన్నిటిని విడిచి పొవలసిన్దెననీ గుర్తుంచుకొని వాటి మీద మమకారం తగ్గించుకొని ఎప్పుడు లోపల భగవన్నామం చెప్పుకుంటూ మంచిమార్గంలో నడవాలి.
గురువును సేవించటంబాబా చిరునవ్వుతో "అలాగే నాయనా! చాలా సంతోషం. నా దగ్గరకు పిల్లల్నిమ్మనీ చదువిమ్మనీ, ఉధ్యొగాలిమ్మనీ - ఇలాంటి కోరికల కోసం వస్తారు గానీ, నీలాగా బ్రహ్మజ్ఞానానిమ్మనివచ్చేవా ళ్ళే లేరు. తప్పకుండా యిస్తాను" అన్నారు. అతన్ని కూర్చోబెట్టి ఒక పిల్లవాడిని పిలిచి, "నందూ మార్వాడీ dagగరకు పో' అన్నారు బాబా. వాడు మళ్ళి వచ్చి అతనూ లేదన్నాడు. అల ఐదారు చోట్లకు తిరిగాడు పిల్లవాడు. ఇదంతా చూస్తూ కూర్చున్న ధనవంతుడు "బాబా! నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వు" అని తొందర పెట్టాడు.
అప్పుడు బాబా నవ్వి, "నాయనా! ఇదిగో నీకు బ్రహ్మాన్ని చూపడానికే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను. దైవాన్ని పొందాలనుకునీవాడికి మొదట మోక్షం పొందాలనే గట్టి కోరిక ఉండాలి. ఈ లోకంలో ఉన్నా సుఖాలంటే విరక్తి కలగాలి. నా డబ్బు, నా ఇల్లు, నా పిల్లలు అనే మమకారం, చెడ్డ మాటల చెడ్డ పనులు మానెయ్యాలి. ఎప్పుడూ నిజం చెప్తూ బ్రహ్మచర్యంతో వుండాలి. మామూలుగా మనుశ్యులన్దరికీ ఈ లోకంలో వస్తువుల మీద మొజుంటుంది. కాని అవన్నీ ఇవ్వాలుండి రేపు పోయేవే. నాశనం లేకుండా వుందేడల్లా ఒక్క భగవంతుడే. ఆ విషయం ఎప్పుడు గుర్తున్చుకొవాలి.
మన మనస్సు కోతిలాగా చపలమైంది. ఒకసారిటూ ఒకసారటూ గెంతుతుంటుంది. అందుచేత మనసును, శరీరాన్ని 'బుద్ధి' తో అదుపులో పెట్టుకోవాలి. యప్పటికప్పుడు - ఇది మచిదా కాదా? అని ఆలోచించు కుంటూ నడవాలి. తన పనులు తానూ జాగ్రత్తగా చేస్తూ భగవంతుని ధ్యానించే వాడికే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
మనిషి లోపల ఆరు శత్రువులుంటాయి. వాటిని కామం (కోరిక ), క్రోధం (కోపం), లోభం (పిసినారితనం), మొహం(మోజు), మదం (పొగరు), మాత్సర్యం (అసూయ) అంటారు. బయటి శత్రువులను కత్తితో పోదిచో, కర్రతో కోతతో చంపుతాం. ఈ లోపలి శత్రువులనేట్లా చంపగలం? వీటికి ఇద్దరు నాయకులుంటారు. వాళ్ల ప్రేలు మమకారం (నాది, నాది అనుకోవటం), అహంకారం (అన్ని నేనే చేస్తున్నాననుకోవటం). ఎంత గొప్పవాళ్ళను కూడా యీ శత్రువులు పడగోట్టేస్తూ వుంటాయి. మరెలా వీటిని జయించడం? ఒకే ఒక్క మార్గం. మంచి గురువు చెప్పే బోధలు ఆచరణలో పెట్టటం. గురువును సేవిస్తూ వుంటే ఆయన మన జీవితాన్ని సరైన మార్గంలో నడుపుతారు. ఈ శత్రువులంతా చచిపోతారు వరుసగా. ఆ పైన మెల్లమెల్లగా భగవంతుని దయ మన మీదకి వస్తుంది. అప్పుడు మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
నాయనా! నీ జేబులో బ్రహ్మం ఏభై యింతలుగా వుండి చూడు. ధనం మిద కోరిక, సంసారం మిద ఆస పోనివాడికి దేవుడెలా కన్పిస్తాడు? నీకున్న అర్హతను బట్టే నీకు మేలు కలుగుతుంది". బాబావారి యీ మాటలన్నీ అక్కడున్న వాల్లదరికీ కళ్లు తెరిపించాయి. బాబా వంటి మహానుబావుడికి ఇదు రూపాయలతో ఏంపని? ఒకవేళ ఆయనకు అవసరమైతే ప్రక్కనున్న ధనవంతుదివ్వవచ్చు గదా! వాడి జేబులో రూ. 250 వున్నాయి గదా. పిల్లవాడు ఇదారుచోట్లకు తిరుగుతుంటే చూస్తూ ఊరుకున్నదే తప్ప జేబులో చెయ్యి పెట్టలేదే! తన డబ్బు మిఇడ అంత లోభితనం వున్నవాడికి బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది?
అందుచేత మనం భగవంతుని చేరుకోవాలంటే - యీ లోకంలో మన చెయ్యవలల్సిన పనులన్నీ పద్దతి ప్రకారం చేస్తూనే
ఉండాలి. మనకివన్నీ నిలబడేవి కావనీ, ఎప్పటికైనా మనం వీటన్నిటిని విడిచి పొవలసిన్దెననీ గుర్తుంచుకొని వాటి మీద మమకారం తగ్గించుకొని ఎప్పుడు లోపల భగవన్నామం చెప్పుకుంటూ మంచిమార్గంలో నడవాలి.
మనకెవరైనా గురువు లేకపొతే మనం భగవంతుని చేరుకోలేము. ఒక పెద్ద అడవిగుండా ప్రయాణం చెయ్యాలనుకోండి. అంతకు ముందే ఆ అడవితో పరిచయం ఉన్నా వాల్లెవరినైనా తొడు తిసుకువేడితే తేలికగా ప్రయాణం చేయ గలుగుతాం. ఎక్కడ గోతులుంటాయో, ఎక్కడ ఊబులుంటాయో, ఎక్కడ క్రోర జంతువులుంటాయో వాళ్ళకు బాగా తెలుస్తుంది. కనుక ప్రమాదాల్లో పడకుండా మనకు దారి సరిగా చ్పించ గలుగుతారు. అలాగే ఆత్మజ్ఞానం వున్నవాల్లను గురువులుగా అనుకోని, వాళ్ళను భగవంతుని సేవించినట్లే సేవించాలి. అప్పుడే మనకు కూడా ఆత్మజ్ఞానం కలుగుతుంది.
"గురువు, దేవుడు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందు గురువుకే నమస్కరిస్తాను - ఎందుకంటే నాకు దేవుడిని చూపించింది గురువే" అన్నారు భక్త కబీరు.
శ్రీ సాయి బాబా తన గురువును పన్నెండేళ్ళ పాటు సేవించానని చెప్పారు. ఈ కధ వినండి. రాధాబాయ్ దేశ్ ముఖ్ అనే ఒక ముసలమ్మ బాబా దగ్గరకు వచ్చింది. బాబా దగ్గర ఏదైనా మంత్రోపదేశం పొందాలనీ, అలా బాబా తనకు మంత్రమివ్వకపొతే ఉపవాసాలుండి చచ్చిపొవాలనీ ఆమె నిర్ణయించుకుంది. ఈ సంగతి శ్యామా బాబాకు చెప్పాడు. "ముసలిది చచ్చిపోతుందో ఏమో, ఏదైనా చెప్ప" మన్నాడు. బాబా ఆమెను పిలిపించాడు.
"అమ్మా! నా గురువు నాకే మంత్రము ఉపదేసించలేదు. ఇక నేను నీకేం చెప్పగలను? నేను పన్నెండేళ్ళు నా గురువును సేవించాను. ఆయనను చూడకపోతే నాకు కళ్ళున్నా వ్యర్ధమనిపించేది. లోకం అంతా ఖాళిగా అన్పించేది. ఆ చూపుతోనే నాకెంతో శక్తి వచ్చినట్లుండేది. వారి సేవ తప్ప నాకింకొక పనే లేదు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలండేవి కావు. ఆయన నా తల గోరిగించారు. అంటే నాకున్న అహంకారాన్నీ, గర్వాన్నీ పోగొట్టారు. రెండు కాసుల దశిన అడిగారు. ఒకటి శ్రద్ధ, రెండవది ఓర్పు. నేను శ్రద్ధతో ఆయన్ను సేవించాను. నామీద ఆయనకు దయ కలిగేవరకూ ఓర్పుతో కాచుకొని వున్నాను. అలా పన్నిండెళ్లు గడిచాయి. ఏ మంత్రమూ లేకుండానే నేనింత వాడినయ్యను.
అమ్మ! తాబేలు నడికొక ఒడ్డున గ్రుడ్లు పెడుతుంది. తానూ రెండవ ఒడ్డుకు పోయి కూర్చుంటుంది. తల్లి పిల్లలకు పాలివ్వటం, లాలించటం, పెంచటం ఏమి చెయ్యదు. ఊరికే పిల్లలవైపు ప్రేమతో చూస్తుంటుంది. పిల్లలు కూడా తల్లివైపే చూస్తుంటాయి. తల్లి చూపులతో పంపే ప్రేమతోనే పిల్లలు ప్రేఇగి పెద్దవవుతాయి. అలాగే నా గురువు ప్రేమతోనే నేనింత వాడినయ్యను. నీవు కూడా ఏ ఉపదేశాలవైపు పరుగుతీయకు. శ్రద్ధతో, ఓర్పుతో గురువును సేవించు. అదే మోక్షానికి దారి తీస్తుంది" ఈ మాటలన్నీ విని తధబాయ్ దేశ్ ముఖ్ తృప్తి పది వెళ్ళిపోయింది.
ఇంకొక సారి సాయి బాబా "నా గురువు నన్ను పెద్ద బావిలో తలక్రిందులుగా వేలాడదీసారు. నీళ్ళు చేతులకు అన్దీ అంద కుండా వున్నాయి. ఆయినా నేను బాధపడలేదు. చాల సంతోషించాను" అన్నారు. గురువు శిష్యుడిని పరీక్షించడానికి ఎన్నోరకాల పరిక్షలు పెడుతుంటాడు. శ్రీ సాయి బాబా చెప్పినట్లు మనందరం తాబేటి పిల్లలం కావాలి. మనతల్లి తాబేలు బాబాయే. పైకి కళ్ళతో ఏం చేస్తున్నా, చేతులతో మన మాకూలు పనులౌ చేసుకుంటున్నా - మన మనసు మాత్రం ఎల్లప్పుడూ సాయి మీదనే వుండాలి. అప్పుడే ఆయన నుంచీ మనం శక్తి పొందగాలుగుతాం.
ఎలాంటివారిని సాయి రక్షిస్తారు?"గురువు, దేవుడు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందు గురువుకే నమస్కరిస్తాను - ఎందుకంటే నాకు దేవుడిని చూపించింది గురువే" అన్నారు భక్త కబీరు.

ఒకసారి దామూ అన్నాకు ఒక అనుమానం వచ్చింది. ఇంతమంది బాబా దగ్గరకి వస్తున్నారు కదా! వాళ్ళలో ప్రతివాడూ మేలు పొండుతున్నడా?" అని. అతని మనసులోని ఆలోచన బాబాకు తెలిసిపోయింది. ఆయన యిలా అన్నారు. "దాము! ఆ మామిడి చెట్టు వైపు చూడు. దానినిండా ఇప్పుడు పూట వుంది. అదంతా పండ్లు అవుతాయా ? కొంత పూత చిన్న చిన్న గాలులకే రాలిపోతుంది. కొన్ని పిందెలుగా రాలిపోతాయి. కొన్ని కాయలయ్యాక రాళ్ళ దేబ్బలకో, తుఫానుల తాకిదికూ రాలిపోతాయి. ఇక మిగిలిన కొద్ది కాయలూ - అంటే మొదటినుంచీ తోడిమెనే అంటి పెట్టుకుని వున్నా కాయలు మాత్రమె పండ్లుగా మారతాయి."
దాముఅన్నాకు జవాబు దొరికింది. ఏదో కొన్నిసార్లు గురుసేవ చేసి తప్పుకు పోయినవారికి ఫలితం దక్కదు. కష్టాలకో, ఇంట్లో వాళ్ల గోదావకో భయపడి గురుపాదాలు వదిలి పోయేవాళ్ళు పిందెల వంటి వాళ్లు. కొన్ని సంవత్సరాలు శ్రద్ధతో చేసి, ఓర్పు లేక యింకేన్నాళ్ళు చేస్తాం! అని వదిలిపెట్టి పోయేవాళ్ళు కాయలుగా రాలిపోయేవారు. మొదటినుంచీ ఫలితం వచ్చేవరకూ - నమ్మిన బాబా పాదాలు వదలకుండా సేవించేవాదికే పండయ్యే అదృష్టం పట్టేది.

మహిమలు చూపించటం - సాయి ఉపదేశం
ఒకసారి కుశాభావు అనే ఒకతడు సాయి బాబా దగ్గరకు వచ్చాడు. అతడు చాలా కాలం ఓకే గురువును సేవించి కొన్ని విధ్యలు నేర్చుకొన్నాడు. ఎక్కడెక్కడి వస్తువులో తన చేతిలోకి తెప్పించ గలిగెవాడు. వింత వింత శక్తులన్నీ చూపిస్తూ వుండేవాడు. వాటి సహాయంతో చుట్టూ వున్నవాళ్ళని లొంగదీసుకుంటూ వుండేవాడు. కుశాభావు ఇలా ప్రవర్తించటం చూసి అతని గురువు బాధపడ్డాడు. తానూ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతూ, "నీవు సాయి బాబా దగ్గరకి వెళ్ళు - ఆయన నీకు మేలు చేస్తారు" అని చెప్పాడు.
కుశాభవు యింకా చాలా శక్తులు పొందాలన్న ఆశతో బాబా దగ్గరకు వచ్చాడు. కానీ, బాబా అతన్ని చూస్తూనే "ముందు ఆ చేతులకున్న కడియాలు తేసి, గోదావరిలో పారేసి, అప్పుడు నా దగ్గరకు రా" అన్నారు. కుశాభావు అలాగే చేశాడు. శక్తులు పోగొట్టుకొని దుఖించాడు. బాబా అతన్ని " గురు చరిత్ర" నూట ఎనిమిది సార్లు పారాయణ చెయ్యమన్నారు. ఆ పారాయణం తో కుశాభావులో కొంత మార్పు వచ్చింది. బాబా శక్తి మిద నమ్మకం ఏర్పడింది.
ఇలా ఉండగా ఏకాదశి వచ్చింది. కుశాభావు ద్వారకామాయి కి వచ్చాడు. అప్పుడు బాబా కుశాభావుని ఉల్లి గడ్డలు తినమన్నారు. "ఇవ్వాళ ఏకాదశి కదా! ఉల్లిగడ్డలు తినను నేను" అన్నాడు కుశాభావు. "తింటే ఏం?" అన్నారు బాబా. "మీరు తింటే నేను కూడా తింటాను" అన్నాడు కుశాభావు. బాబా ఉల్లిపాయలు తిన్నారు. కుశాభావు కూడా తిన్నాడు. బాబా నవ్వుతూ "ఇదిగో దద్ ఆచార వంతుడు ఇవ్వాళా ఎకాదసినాడు ఉల్లిగడ్డలు తిన్నాడు" అన్నారు. కుశాభావుకు కాస్త రోషం వచ్చింది. "బాబా తింటే నేను తిన్నాను." అన్నాడు.
బాబా కొంటెగా నవ్వి, "ఏం భావూ!! నేను ఉల్లిగడ్డలు తిన్నానంటున్నావా? ఏవి చూపించు? అంటూ తానూ తిన్నదంతా కక్కేశారు. ఆశ్చర్యంగా అందులో ఒక్క ఉల్లిముక్కినా లేదు. పైగా రకరకాల దుమ్పముక్కలు ఉన్నాయి. కుశాభావు కి హఠాత్తుగా అర్ధమైంది. బాబా తనకొక పరీక్షగానే ఈ లీల చూపిస్తున్నారని. వెంటనే అతడు బాబా కక్కినదానిలో పడిన దుమ్పలన్ని ఎరుక్కొని తినడా మొదలు పెట్టాడు. సాయి బాబా "ఛీ ఛీ అదేం పని" అంటూ అతన్ని పక్కకు లాగేశారు - తిట్టారు - కొట్టారు. ఏం చేసినా కుశాభావూ తానూ చేస్తున్న పని మాన లేదు. ఆ ముక్కలన్నీ తినేసాడు. బాబాకు కుశాభావూ మీద దయ కలిగింది. అతన్ని దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నారు. "భావూ ని భక్తి శ్రద్ధలు నాకు నచ్చాయి. ఇదిగో నీ చేయి చాపు" అన్నారు. వెంటనే భావూ చేతిలోకి వెచ్చని ఊది వచ్చింది. సాయి ప్రేమతో కుశాభావును ఇలా ఆశీర్వదించారు - నీవు కోరినప్పుడల్లా ఎక్కడ వున్నా సరే, ఇలాగే దునిలోని వెచ్చని ఊది నీ చేతిలోకి వస్తుది". ఆ పైన కుశాభావు జీవించి ఉన్నంత కాలం అలా ఊదీ తెప్పించి రోగాలతో ఉన్నవాళ్ళకు, కష్టాలలో ఉన్నవాళ్ళకు యిస్తూ ఉండేవాడు.
ఈ కధ ద్వారా మనకు ఒక గొప్ప విషయం తెలుస్తున్నది. సాయి బాబాకు ఎన్నో శక్తులు, మహిమలు వుండేవి. కానీ, ఆయన ఎంతో అవసరమైతే తప్ప ఉపయోగించేవారు కారు. ఎక్కడెక్కడి వస్తువులో చేతుల్లోకి తెచ్చి ప్రదర్శించటం, మామూలు మనుషుయ్లకు లేనిపోని మహిమలు చూపించి, తానేదో గొప్పవాడి ననిపించు కోవటం, వాళ్ళను భయపెట్టో, ఆస పెట్టో దగ్గరకు చేర్చుకోవటం - ఇలాంటివి చయ్యకూడని పనులని ఆయన బోధించారు. అందుచేత బాబా భక్తులైనవారు బాబా పేరు మీద అలాటి ఆడంబరాలు, మహిమల ప్రదర్సన, హడావుడీ చేసేవాళ్ళ గురించి చిన్నప్పుడు కుశాభావు కధ, అందులోని నీతి, గుర్తు చేసుకోవాలి.

మానవ జీవితం ఎందుకు?
శ్రీ సాయి బాబా మానవ జీవితం ఎంత గొప్పదో దానిని చక్కగా ఎలా ఉపయోగించుకోవాలో మళ్లీ మళ్లీ చెబుతుండేవారు. 84 లక్షల జన్మల తరువాత దొరికే ఈ కొప్పు అదృష్టాన్ని ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్లీ పొందటం అన్నది చాల కష్టం. మళ్లీ ఎన్ని లక్షల సార్లు పురుగులమై, పక్షులమై, జంతువులమై, నిచపు బ్రతుకులు బ్రతకాలో తెలియదు.
మనం మన చిన్న పిల్లవాడికి ఒక మంచి విలువైన వస్తువేదైనా యిచ్చామను కోండి. వాడు దాన్ని చ్తక్కొట్టి, పాడుచేసి అవతల పాడేశాడు. మళ్లీ వెంటనే వాదికల్లాంటి వస్తువు కొనిస్తామా? "నికిచ్చినా లాభం లేదు" అని వాడిని మళ్లీ విలువ తెలుస్తుదన్న నమ్మకం ఏర్పడేవరకూ ఇవ్వము. భగవంతుడికి మనందరం పిల్లలమే. ఆయన ఇంత విలువైన గొప్ప మానవ జీవితాన్ని మనకిచ్చారు. మనం దాన్ని ఆటలతో, పాటలతో, విందు వినూదాలతో, కోపతాపాలతో, అహంకార మమకారాలతో ఈ లోకంలో ఉండే సుఖాల మెడ కోరికలతో వృధా చేసుకుంటే - ఆయన మళ్లీ అంత గొప్ప జన్మ మనకివ్వాడు. మళ్లీ ఎన్ని వేళ సంవత్సరాలో నీచ జన్మలు పొందుతూ ఉండవలసిందే. సాయి ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెబుతుండేవారు.
"ఏదో ఒక సాధన ద్వారా మోక్షం పొందే ప్రయత్నం చెయ్యండి. లేకపొతే మీ జన్మ వ్యర్ధం." అనేవారాయన. ఇదిగో ఈ కధ కూడా దానినే చెబుతుంది. ఒకసారి సాయి బాబా కొందరి భక్తులతో కలసి లేండీ తోట వైపు వెళుతుండగ మేకల మందను తొలుకొనీ పోతూ ఒకదేడురైనాడు. వాటిలో రెండు మేకల మిద బాబా చూపు పడింది. మేకలవాడికి ముప్పై రెండు రూపాయలిచ్చి ఆ రెండు మేకలను కొన్నారు. దగ్గరున్న వాళ్ళంతా ఆ మేకల ఖరీదు ఎంత ఎక్కువ పెట్టినా ఎనిమిది రూపాయలకు మించదనీ, బాబా అనవసరంగా అంత డబ్బు ఖర్చు చేసారని అన్నారు. బాబా నాలుగు శేర్ల సెనగపప్పు కొని మేకలకు పెట్టించారు. తరువాత వాటిని వాటి యజమానికి ఇచ్చేసారు. అప్పుడాయన యిలా చెప్పారు.
"నేను మేకల బేరంలో మోసపోయానని మీరు అనుకుంటున్నారు గదా! పూర్వ జన్మలో ఈ రెండు మేకలూ సొంత అన్నదమ్ములు. మొదట ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. చిన్నవాడు చురుకైనవాడు కనుక బాగా డబ్బు సంపాదించాడు. సోమరైన పెద్దవాదికిది అసూయ కలిగించింది. ఇద్దరి మధ్య కొట్లాటలు మొదలయ్యాయి. అన్నా తమ్ముడిని చంపి వాడి ఆస్తి కాజేయ్యలనుకున్నాడు. పెద్ద బడితెతో తమ్ముడిని చంపి వాడి ఆస్తి కాజేయ్యలనున్నాడు. పెద్ద బడితెతో తమ్ముడిని కొట్టాడు. తమ్ముడు గొడ్డలితో అన్నాను నరికాడు. ఇద్దరూ ఒకేసారి చచ్చిపోయారు. మనిషి జన్మ ఎట్టి కూడా ద్వేషంతో, పగతో జన్మ వృధా చేసుకొని ఇలా మేకలై పుట్టారు. అందుకని వాటి మీద జాలితో నా దగ్గరున్చ్కున్దామని కొన్నాను. మీరందరూ వద్దన్నారు గదా - వదిలేసాను". దీనిని బట్టి మనం జీవితాలను ఎలా జాగ్రత్తగా నడుపుకోవాలో గుర్తుంచుకోవాలి.

తృప్తి
మనిషి ఆశల పుట్ట. బావిలో నీళ్ళు తోదేకోద్ది ఊరేటట్లు మనిషికి కూడా ఒక కోరిక తిరితే ఇంకొక కోరిక పుట్టుకొస్తుంది. నడుస్తున్నన్నాళ్ళూ సైకిల్ కావాలనిపిస్తుంది. సైకిల్ కొన్నాక మోటారు సైకిల్ మీద కోరిక - అదీ దొరికాక కారు కావలి... ఇలా ఒకదాని మీద ఒకటిగా కోరికలు పుడుతూనే ఉంటాయి. మనకేది దొరికితే అదే మహా ప్రసాదం - అదే భగవంతుదిచ్చాడు అనుకుంటే తృప్తి. సంతోషం కలుగుతాయి. మనకేం కావాలో మనకంటే భగవంతుడికే బాగా తెలుసు. పిల్లవాడికి ఏది మంచిదో, ఏది కాదో తల్లికి తెలియదా! బాబా యీ విషయాన్నే ఒక పనిపిల్ల ద్వారా చెప్పించారు.
దాసుగణు ఈశావాశ్యోపనిశాత్తు అనే ఒక సంస్కృత గ్రంధాన్ని మరాఠీ భాషలోకి వ్రాయలనుకున్నాడు. ఆ గ్రంధం చాలా చిన్నది కాని చాలా గొప్పది. దానిలో మొట్టమొదటి మంత్రంలోనే "భగవంతుడు ఈ ప్రపంచమంతటా, ప్రతి వస్తువులోను వ్యాపించి ఉన్నాడు. అందుచేత దేన్నయినా ఆయన ప్రసాడంగానే అనుకోవాలి. ధనం ఎవ్వరి సొంతమూ కాదు, నలుగురికీ పెట్టి, తినాలి" అని ఉంది. ఆ ఉపనిషత్తులో ఉన్నా లోతైన అర్ధాలు దాసుగానుకు అంతుబట్టలేదు. ఎవరెవరో పండితులను అడిగి అడిగి చివరకు సాయి బాబాను అడిగాడు. బాబా - "నీవు దాన్ని గురించి ఏమి బాధపడకు. విల్లిపార్లే అనే ఊళ్లో కాకాసాహెబ్ ధిక్షిత్ పనిపిల్ల నీకన్నీ వివరంగా తెలియజేస్తుంది" అన్నారు. అక్కడున్న వారందరూ బాబా తమాషా చేస్తున్నాడు అనుకొన్నారు. కానీ దాసుగణు మాత్రం అలా అనుకోలేదు.
బాబా చెపారు గనుక నేను విల్లిపార్లే వెళ్లాలి అనుకొన్నాడు, వెళ్లాడు. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. ప్రొద్దున అతను నిద్ర లేచేటప్పటికి ఒక పాట వినిపించింది. ఎర్రంచు ఉన్న ఒక చీరను గురించిన పాట అది. దాని అంచు, కొంగు ఎంతో బాగున్నాయని పాడుతున్నది కాకాసహేబ్ పనిపిల్ల. దాసుగణుకు ఆ పిల్ల మీద జాలి వేసింది. తనకు ప్రధాన అనే ఆయన ధోవతులు పెడుతుండగా - ఆ పిల్లకు చిన్న చిర కొనిమ్మని చెప్పాడు. ఆ మరునాడు ఆ పనిపిల్ల ప్రధాన్ ఇచ్చిన కొత్తచిర కట్టుకుని సంతోషంగా ఆడుతూ, చక్కగా పాటలు పాడింది. మూడవరోజు కొత్త చిర దాచిపేట్టుకుని చినిగిన పాత చీర కట్టుకొని పనిలోకి వచ్చింది. అయితే ఆరోజు కూడా ఆ పిల్ల ఆనందంతో పాడుతూనే, ఆడుతూనే ఉంది. దాసుగణుకు బాబా తనను అక్కడికేందుకు పంపించారో అర్ధమైంది. ఆ పిల్ల కొత్త చీర లేనప్పుడూ సంతోషంగానే ఉంది. ఉంది దాచుకొని పాతచీర కట్టుకున్నప్పుడూ సంతోషంగానే ఉంది. దీనినుంచి దాసుగణుకు ఈసావస్యోపనిషత్తులోని సారాంశం అర్ధమైంది. మనిషి ఎప్పుడు తానూ చేయవలసిన కర్మ (పని) చేస్తూనే ఉండాలి. భగవంతుడు ఏ సమయానికి ఏమిస్తే అది మనకు ప్రాప్తం అనుకోవాలి. అదే మనకు అవసరమని తెలుసుకోవాలి. కష్టమైనా, సుఖమైనా దాన్ని సంతోషంతొ అనుభవించాలి. ఈ విషయం అర్ధం చేసుకొని దాసుగణు ఆనందంతో తిరిగి వెళ్లాడు.

మనం దేనికీ కర్తలం కాము
మనిషి గుణం విచిత్రంగా ఉంటుంది. ఏదైనా మంచి జరిగితే తన గోప్పేననుకుంటాడు. చెడు జరిగితే 'దేవుడిలా చేసాడు' అంటాడు. తప్పయినా ఒప్పయినా ప్రతిదీ భగవంతుడి యిష్టం ప్రకారమే జరుగుతుంది. అది గ్రహించుకుంటే మనకంతా ప్రశాంతంగానే నడుస్తుంది. ఆ సంగతి బాబా ఎలా చెప్పారో చూద్దాం.
పుండలీకరావు అనే ఒక ప్లీడరు వసుదేవానంద సరస్వతి అనే యోగిని చూడడానికి రాజమండ్రి వెళ్లాడు. ఆ యోగి దర్శనం అయిన తరువాత ఏదో మాటలలో షిరిడీ గురించీ, సాయిబాబా గురించీ వచ్చింది. ఆ యోగి బాబా పేరు వినగానే నమస్కారం చేసి ఒక కొబ్బరికాయ పుండలీకరావుకిచ్చి "ఇది నా సోదరుడు సాయిబాబా కివ్వు, నా మీద ప్రేమ ఉంచమను" అని చెప్పాడు. సామాన్యంగా యోగులు ఇతరులకు నమస్కారం చెయ్యరు గానీ సాయి యోగులందరికీ దేవుడే కదా!
సరే - మన పుండలీకరావు ఆ కొబ్బరికాయ తెసుకొని, కొండకాలం తరువాత స్నేహితులతో కలిసి షిరిడీ బయలుదేరాడు. మన్మాడ్ చేరేసరికి వారికి ఫలగారం వేళయింది. అందరూ కారపు అటుకులు తిన్నారు. అవి చాల కారంగా ఉండటంతో పొరపాటున బాబా కోసం యోగి యిచ్చిన కొబ్బరి కాయ కొట్టి ఆ ముక్కలు అందులో కలుపుకు తిన్నారు. ప్రయాణం సాగింది. షిరిడీ చేరుతుండగా హఠాత్తుగా పుండలీకరావుకు తామూ కొట్టింది బాబా కోసం యిచ్చిన కొబ్బరికాయ అని గ్రుతూ వచ్చింది. అతనికి దుఃఖం, భయం రెండూ కలిగాయి.
బాబా దర్శనానికి వెళ్ళాడు పుండలీకరావు. బాబా 'నా సోదరుదిచ్చిన టెంకాయ ఏది? ఇలా యివ్వు? " అని అడిగారు. జరిగినదంతా చెప్పి తన తప్పు క్షమించమనీ, దానికి బదులుగా చాలా టెంకాయలిస్తానని చెప్పాడు. బాబా "నీవు ఎన్ని కాయలిచ్చినా దానికి సమానం కావు. అయినా జరిగిన దానికి బాధపడకు. ఆ యోగి యివ్వటమూ, దారిలో నీవు పగలగోట్టటమూ అన్ని నా సంకల్పం ప్రకారంగానే జరిగాయి. మంచి గానీ, చెడు గానీ దేనికీ నివే కర్తవని (నివే చేస్తున్నావని) అనుకోవద్దు. అందుచేత మన వంతుకు వచ్చిన పని మనసు పెట్టి శ్రద్ధగా చేస్తూ పోవాలి. ఫలితం మంచైనా, చ్డైనా మన పట్టించుకోకూడదు. అదంతా భగవంతుడి సంకల్పమే అనుకోవాలి.
పుస్తకాలు చదివినంత మాత్రాన చాలదు - అందులోని విషయాలు ఆచరణలో పెట్టాలి.
సాయి బాబాకు ముఖ్య భక్తులైన కపర్దే, బట్టీ, నూల్కర్ అనేవారు ముగ్గురు బాబా ఎదుట ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడేవారు కారు. వాళ్ళంతా గొప్ప గొప్ప గ్రంధాలు, శాస్త్రాలు, పురాణాలు చదివినవారే. కానీ నిజమైన ఆత్మా జ్ఞానం ముందు యివన్నీ పనికిరానివే గదా! శ్రీ సాయి బాబా ఎప్పుడు ఆచరణ అవసరం అనేవారు.
ఒకసారి వి. హెచ్. ఠాకూర్ అనే ఒక ఉద్యోగి 'అప్పా' అనే కన్నడ యోగిని కలుసుకున్నాడు. ఆ యోగి 'విచారసాగరం' అనే పుస్తకం చదవమనీ, అది మేలు చేస్తుందనీ చెప్పాడు. ఉద్యోగపు పనిమీద ఉత్తరదిక్కుగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప యోగిని కలుసుకుంటావు. ఆయన నీకు శాంతినీ, మేలునూ కలిగిస్తారని చెప్పాడు. ఆ తరువాత కొంతకాలానికి ఠాకూర్ షిరిడీకి వెళ్లాడు. బాబా దర్శనం కాగానే అతనికి కన్నీళ్లు వచ్చాయి. ఏదో తెలియని సంతోషం కలిగింది. బాబా అతన్ని చూచి "ఇక్కడ మార్గం అప్పా నీతులంత తేలిక కాదు. ఈ ఆద్యాత్మిక మార్గంలో చాలా కష్టపడి ముందుకు పోవాలి" అన్నారు.
వెంటనే ఠాకూర్ బాబా పాదాలకు నమస్కారం చేశాడు. సాయి అతన్ని దీవించి "విచారసాగరంలో గొప్ప విషయాలున్నాయి. కానీ, ఊరికే చదివి లాభం లేదు. చదివినదంతా ఆలోచించి ఆచరణలో పెట్టాలి. గురువు ఆశీర్వాదం లేకపోతె ఆత్మజ్ఞానం కలగదు" అన్నారు. దిన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే - మనం ఊరికే విన్నా చదివినా లాభం ఉండదు. వాటిని బాగా మనసుకి పట్టించుకోని వాటిని బట్టి మన ప్రవర్తన దిద్దుకోవాలి. అప్పుడే బాబా దయ మన మీద ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఫలితం ఆశించకుండా పని చెయ్యాలి
కొందరు మనుష్యులు బాబా దగ్గరకు వచ్చి, "మేము ఫలానా వాళ్లకు ఇంత మేలు చేసాం, -వాళ్లు మాకేమి చ్య్యటం లేదు. కనీసం మంచి మాట కూడా అనరు" అని బాధపడుతూ ఉండేవారు. అది విని బాబా చిరునవ్వుతో యిల చెప్పేవారు.
"చూడండి! ఒక గింజ మొలకెత్తి, పెరిగి, పెద్ద వృక్షం కావాలంటే ఎన్ని విధాల ఎన్ని శక్తులు సాయం చేస్తాయి? నేల, నీళ్లు, సూర్యుడు, గాలి - యిన్ని కలిస్తే గానీ గింజ ప్రాణం పోసుకోదు, పైకి పెరగదు. అయినా యివన్నీ ఆ మొక్కనుంచీ ఏమైనా ఆశిస్తున్నయా? మొక్కనుంచీ ఏమైనా లాభం పొందా లనుకుంటున్నాయా? ఫలితం ఆశించకుండా పని చేస్తేనే పరమాత్ముడికి సంతోషం కలుగుతుంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. ఎవరినుంచీ ఏమీ ఆశించకండి. ఎవరికి ఏమీ కీడు చెయ్యకండి - చేతనైతే మేలు మాత్రమె చెయ్యండి." అని చెప్పారు.
ఈ విధంగా శ్రీ సాయి బాబా తన దగ్గరకు చేరే భక్తులకు ఎన్నెన్నో రకాల బద్దలు చేసేవారు. మనం మంత్రజపం చేసినా, హొమాలు చేసినా, యజ్ఞాలూ చేసినా, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినా - మన బుద్ధి కుదురుగా లేకపొతే, మన ప్రవర్తన సరిగా లేకపొతే మనకు మోక్షం లేదు. అందుకే బాబా మంకివాన్ని భోధించారు.

"ఓం శ్రీ సాయినాధం నమమ్యహమ్"
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
(ఈ నాటి పారాయణ పూర్తి కాగానే హారతిచ్చి ప్రసాదం అందరికీ పంచాలి. రాత్రికి పాడుకొనే ముందు ఇవ్వాళ విన్నవన్నీ గుర్తు చేసుకుంటూ, వాటిలో ఎన్ని మనం యింతకు ముందే నేర్చుకున్నాం. యింకా ఎన్ని నేర్చుకోవలసి ఉంది? - అనేది ఆలోచించుకోవాలి. ఇకనుంచి మనను ఎలా దిద్దుకోవాలో ఒక గట్టి నిశ్చయం చేసుకోవాలి.)
శ్రీ సాయి నాద చరితామృతం
మొదటి అధ్యాయం - గురువారం పారాయణ
రెండవ అధ్యాయం - శుక్రవారం పారాయణ
మూడవ అధ్యాయం - శనివారం పారాయణ
నాల్గవ అధ్యాయం - ఆదివారం పారాయణ
ఐదవ అధ్యాయం - సోమవారం పారాయణ
ఆరవ అధ్యాయం - మంగళవారం పారాయణ
ఏడవ అధ్యాయం - బుధవారం పారాయణ
ముగింపు హారతి పాట
No comments:
Post a Comment