Tuesday, September 16, 2008
Tuesday, August 5, 2008
ముగింపు హారతి పాట
శ్రీ సాయినాధ చరితామృతం
ముగింపు హారతి పాట
శ్రీ సాయినాధాయ సిద్ధజనమాన్యాయ
చిత్కషరూపాయ జయ మంగళం
ఆద్యంత రహితాయ ఆగమవేధ్యాయ
ఆనంద రూపాయ శుభా మంగళం
శ్రీ దత్తరూపాయ షిరిడీపుర వాసాయ
భవరోగ వైద్యాయ వరమంగళం
దేవతావద్యాయ దివ్య స్వరూపాయ
దీన జన పాలాయ నిత్య మంగళం
సాయి మంగళం
*****************************
శ్రీ సాయినాధుని ఏకాదశ వాగ్దానాలు
- షిరిడీ ప్రవేశమే సర్వ దుఖ పరిహారము.
- ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించి నంతనే సుఖ సంపదలండ గలరు.
- ఈ భౌతిక దేహానంతరకు సైతము నేనప్రమత్తుడనే
- నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును.
- సమాదినుదియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.
- సమాదినుందియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.
- నన్నశ్రయించు వానిని నన్ను శరణు జొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము.
- నా యదేవారి దృష్టి కలడో వారియందు నా కటాక్షము కలదు.
- మీ భారములను నాపై పదవేయుడు ననే మోసెదను.
- నా సహాయమును గాని సలహాను గాని కోరిన తక్షనేమే ఒసంగేదను.
- నా భక్తుల గృహములయండు లేమియను శబ్దము పొడచూపదు
ఏడవ అధ్యాయం - బుధవారం పారాయణ
శ్రీ సాయినాధ చరితామృతం
(ఏడవ అధ్యాయం - బుధవారం పారాయణ)
ప్రార్ధన
పరమ పూజ్యమైన శ్రీ సాయినాధుల పాదపద్మములపై తలవాల్చి నమస్కరిద్దాం
ప్రభూ! సాయీశ్వరా!!
అంతకుముందు కొద్ది రోజుల క్రిందటే ఒక సంగతి జరిగింది. బాబా దగ్గర ఎప్పుడు ఒక ఇటుక రాయి ఉండేది. రాత్రి పూట కూడా అది ఆయన తలక్రిందే ఉండేది. అది తన గురు ప్రసాడమని చెప్తుండేవారు. అలాంటి ఇటుక ఒక రోజు పనివాడి చేతిలోనుంచి జారి పది విరిగిపోయింది. బాబా ఆ ముక్కలను తన చెంపకు ఆనించుకొని "ఇది నా జీవితమంతా నాకు తోడుగా ఉంది, ఇది విరిగిపోయింది. ఇక నేను ఎక్కువ రోజులు బ్రతకను" అన్నారు. అంతలోనే ఈ జ్వరం మొదలియింది.
ఒక రోజు బాబా తాత్యాకు ఒకసారి రమ్మని కబురంపారు. ఎలాగో శ్రమపడి వచ్చాడు తాత్యా. బాబా అతనికి పాయసం తినిపించారు. తాత్యాకి, బాబాకి విడదియ్యడానికి వేల్లేనంత బంధం ఉంది. కొన్ని సంవత్సరాలు పాటు బాబాతో పాటు ద్వారకా మాయి లోనే పడుకున్తుండేవాడు. చిన్నప్పటినుంచి ఈ మామా (బాబా) అంటే తాత్యాకి ఎంతో ఇష్టం. బాబా తాత్యాతో ఇలా అన్నారు. "ఒరేయ్ తాత్యా! మనిద్దరి కోసమని రెండు ఉయ్యాలలు తెప్పించానురా! కాని నీవు వద్దులే అని వెనక్కి పంపించేసాను. నేనొక్కడినే వెడతాను. నువ్వుండు". తాత్యా ఎన్నో సంవత్సరాలుగా బాబా గుండెలలో ఉన్నవాడు. అతనికి బాబా మాటల వెనుక బావం వెంటనే అర్ధమైంది. బాబా ఉయ్యాల అనేది 'సమాధి' అనే అర్ధంలో వాడారు.
తాత్యాకు దుఃఖం పొంగివచ్చింది. "బాబా! నన్నే పంపరాదా? నువ్వుంటే భక్తులందరికీ సంతోసం, నేనెందుకు?" అన్నాడు ఏడుస్తూ. అతడి దుఃఖం చూచిన బాబాకు కూడా అతడి మీద ప్రేమతో కన్నీళ్ళు వచ్చాయి. "నోర్మోయ్! యిక చాల్లే యింటికి ఫో" అని కోప్పడుతూ "ఎందుకురా దాంమ్యా ఏడుస్తావ్! బుద్ది లేదూ! నాకు మరణం ఎక్కడిదిరా? " అన్నారు. అంటే తన శరీరం లేకపోయినా తానూ బ్రతికే ఉంటానని బాబా భావం.
ఇక దసరా పండుగ వారం రోజులుంది. ఆ రోజు కొందరు దర్వీషులు (భిక్షగాళ్ళు) ఒక జబ్బుతో ఉన్నా పులిని బండిమీద గొలుసులతో కట్టి తీసుకు వచ్చారు. అది బాధతో తెగ గర్జిస్తున్నది. తన జీవనాధారమైన దాని జబ్బు బాబా తగ్గిస్తారన్న ఆశతో ఫకీర్లు దానినక్కడికి తెచ్చారు. బాబా దాన్ని క్రిందకి దిన్చమన్నారు. మొదట బయపడినా దర్వీషులు దాని కట్లుదదీశారు. అది తిన్నగా మసీదు మెట్లెక్కి వచ్చి బాబా ముందు నిలబడింది. బాబా దాని కళ్ళలోకి సూటిగా చోచారు. పులి తలదించుకోంది. బాబా దర్శనంతో దానికి పాపాలన్నీ నశించి పోయినాయో ఏమో - తోక మూడుసార్లు ఉపి, నేలమీద పది ప్రాణాలు విడిచింది. ఆ పులి పూర్వ జన్మ భాగ్యం ఎంత గొప్పదో గానీ సాక్షాత్తూ పరమాత్ముడి ముందే మరణించింది. దానికి మోక్షమే దొరికుంటుంది. (ఈ పులి సమాధిని ఆ మసీదుకు దగ్గరలోనే యిప్పటికీ చూడవచ్చు).
దసరా దగ్గరకు వచ్చే కొద్దీ సాయి క్షీణించి పోతున్నారు. శ్యామా, బుట్టీ, లక్ష్మిబాయి, మహాల్సాపతి లాంటి భక్తులెప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు. అంతకు ముందు రెండు మూడు రోజుల నుంచీ "నాకిక్కడ విశ్రాంతిగా లేదు, బుట్టీ వాడలో బాగుంటుంది." అంటున్నారు అప్పుడప్పుడు. చివరి రెండు వారాలలు 'వఝే' అన్నా భక్తుడితో "రామ విజయం" చదివించ్కొని విన్నారు. బాబా వఝేకు దక్షిణ యిచ్చి పంపివేశారు.
ఆ రోజు దసరా పండుగ - అక్టోబర్ 15 వ తేదీ. సాయి బాబా ఉదయం నుంచీ అసలు లేవలేక పోతున్నారు. చాల బాధపడుతున్నారు. బాగా నీరసంగా ఉన్నారు. మద్యాహ్నం అందరినీ బోజనాలు చేసి రమ్మన్నారు. లక్ష్మిబాయి షిండే, భాగోజీ, బయాజీ పాటిల్ వంటి నలుగురైదుగురు భక్తులు బాబా దగ్గరే కూర్చొని ఉన్నారు. బాబా తన ఆసనం మీద కూర్చొని తాంబూలం అడిగి వేసుకున్నారు. తరువాత మంచినీళ్ళు త్రాగాబోతే పూర్తిగా మింగుడు పడలేదు. దానితో తన సమయం అయిపోతున్నాడని బాబాకు తెలిసిందో ఏమో కఫనీ జేబులో చెయ్యి పెట్టి తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మిబాయి షిండేకు ఇచ్చారు.
కొద్దిగా ఆయాసపడుతూ "నాకిక్కడ బావుండలేదు, నాన్న రాతివాడా (బుట్టివాడా) కు తీసుకువెళ్ళండి" అన్నారు. అలా అంటూనే తన ప్రక్కనే కూర్చొని ఉన్నా బాయాజీపాటిల్ మీదకి ఒరిగిపోయారు. అంతే పరమాత్ముడు అవతారం చాలించాడు. చుట్టూ ఉన్నా భక్తులంతా భోరమని ఏడ్చారు. "బాబా! బాబా! అన్నా కేకలూ అరుపులూ, ఏడుపులు ఒక్క నిమిషంలో షిరిడీ అంటా పాకిపోయాయి. భోజనాలకు వెళ్ళిన భక్తులంతా పల్లెలలో నీళ్ళు పోసేసి పరుగెత్తుకు వచ్చారు.
అందరు ద్వారకామాయికి చేరుకుంటున్నారు. చుట్టూ ప్రక్కల పల్లెలకు కూడా కబురు పాకింది. శ్రీ సాయి బాబా శరీరం కదలకుండా మసీదులో పది ఉంది. కొందరు భక్తులు "మునుపటి లాగే బాబా మళ్లీ బ్రతుకుతారేమో' అని ఆశ పడుతున్నారు. ప్రతివారూ ఆ స్వామి శరీరాన్ని చూచి కుమిలి పోతున్నారు. "ఆ చెయ్యే ఎన్ని లక్షల మందికో ఊదినిచ్చి కాపాడింది. ఆ పాదాలే షిరిడీ నెలపై తిరిగి మన గడ్డకు కొప్పు శక్తినిచ్చాయి. ఆ నొరే క్షణక్షణం ఎన్నో మంచి నిటులు బొధిస్తూ మన బ్రతుకులు సరిదిద్దడానికి ప్రయత్నం చేసింది. ఆ కనులే తమపై ప్రేమజల్లులు కుర్సేవి. ప్రతివారికీ సాయి తమకు చేసిన మేలు, ఆయన పోగొట్టిన కష్టాలు గుర్తు వస్తున్నాయి. ఇన్నాళ్ళూ తమకు తలమీద గొడుగులాగా ఉన్నా ఆ చల్లని తండ్రి యిక లేడు, ఇంక ఆయన గొంతు తమకు వినపడదు - అనుకోగానే అందరికీ దుఃఖం పొంగిపొంగి వస్తున్నది.
నిజంగా సాయికి మరణం ఉందా? లేదని ఆయనే ఋజువు చేశారు. శ్రీ సాయి సమాధి చెందినా రోజు తెల్లవారు ఝామున పండరీపురంలో ఉన్నా దాసుగానుకు కలలో దశనమిచ్చారు. "గాణూ! మసీదు కూలిపోయింది, నేను ఆచోటు విడిచి వెళ్ళిపోయాను. నువ్వు వచ్చి నా శవాన్ని పూలతో కప్పు" అని చెప్పారు. దాసుగను వెంటనే తన శిష్యులతో కలసి షిరిడీకి వచ్చాడు. అదే రోజు తెల్లవారుతుండగా లక్ష్మణ్ మామజోషి అనే భక్తుడికి కనిపించారు.
బాబా "ఇన్నాళ్లూ నాకు హారతిస్తున్న జోగ్ నేను చనిపోయాననుకొని హారతివ్వటం లేదు. నువ్వు వచ్చి హారతివ్వు" అని చెప్పారు. అతదలాగే మసీదుకు వచ్చి ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా వినకుండా బాబాకు హారతిచ్చి వెళ్ళాడు. ఆ మధ్యాహ్నం మామూలుగా జోగ్ కూడా వచ్చాడు. అందరూ కలిసి హారతిచ్చారు. అప్పుడు జోగ్ బాబా చెయ్యి తెరచి దక్షిణ పెట్టాడు. మామూలుగా అయితే మనిషి చనిపొతే శరీరం బిగుసుకు పోతుంది. కాని పోయిన 24 గంటల తరువాత కూడా సాయి చెతివెళ్ళు చక్కగా తెరుచు కున్నాయి. మళ్లీ ముడుచు కున్నాయి కూడా.
శ్రీ సాయి బొంబాయిలో ఉన్నా 'ప్రధాన్' అనే భక్తుడి వదిన గారికి కలలో కనిపించారు. 'మీ సంచిలో వున్నా పట్టు బట్ట నా మీద కప్పడానికి పంపించండి' అని చెప్పారు. ఆ పట్టు బట్ట ఎన్నో సంవత్సరాల నుంచీ తమ దగ్గరున్నడనే సంగతి ఆమె మర్చేపాయింది. ఈ కల రావటం తో వెదికితే దొరికింది. దాన్ని షిరిడీకి పంపారు. (1923 వరకూ కూడా సాయి బాబా సమాధి మీద ఎక్కువగా దాన్నే కప్పుతూ ఉండేవారు.)
బుట్టీ మురళీధరుడి కోసం కట్టిస్తున్న మందిరంలో శ్రీ సాయి బాబా శరీరాన్ని సమాధి చేసారు. ఆ విధంగా సాయే
శ్రీ కృష్ణుడని లోకానికి స్పష్టమై పోయింది. షిరిడీ వెళ్ళే భక్తులందరూ దర్శించేది యీ సమాధి మందిరాన్నే. ఇక్కడ ప్రతిష్టించబడిన సాయి నాధుల పాలరాతి విగ్రహం ఎంతో కలలు చిందుతూ, జేవంతో ఉన్నా సిని చూస్తున్నంత అందంగా ఉంటుంది. ఆయన కళ్లు మనని చూస్తున్నట్ల్హూ, ఆ పెదవులు చిన్న నవ్వుతో "వచ్చావా" అని మనని పలకరిస్తూ విచ్చుకున్తున్నట్లూ అనిపిస్తాయి.
శ్రీ సాయి సమాధి మాములుగా చచ్చిపోయిన వాళ్ళను పాతిపెట్టి, పైన కట్టిన సమాధి కాదు. దానికి కూడా ప్రాణం ఉంది. మనం నిజమైన బాధతో, దుఃఖంతో వెళ్లి, ఆ సమాధి ఎదుట నిలబడి ప్రార్ధన చేస్తే, మన మనసులో ఉన్నవాణ్ణి విన్నవించు కొంటె ఆ సమాధే మనకు సమాధానం యిస్తుంది. ఆ మాట బాబాయే స్వయంగా చేప్పారు. తానూ సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు తనను చూడడానికి వచ్చిన భక్తులతో సాయి బాబా యిల చెప్పారు.
"నా సమాధినుంచే నేను సర్వకార్యాలు నిర్వహిస్తాను. నా శరీరం సమాధినుంచే మాట్లాడుతుంది. నా భక్తులకు రక్షణ నా సమాధినంచే వస్తుంది." దీనిని బట్టి మనకు తెలుస్తోంది కదా! - శ్రీ సాయి సమాధి కేవలం రాతి సమాధి మాత్రమే కాదనీ, దాని లోపలాల్ ఉన్నది సాయి శవం కాదనీ, స్వయంగా సాయి నాధుల శక్తేననీ.
సాయి సమాధి చేదింది 1918 వ సంవత్సరంలో. అంటే యిప్పటికి (2008) తొంభై ఏళైపొయింది. ఆయన శక్తి రోజు రోజుకీ ప్రప్రాంచమంతా వ్యాప్తి చెందుతున్నది. ఇతర దేశాలలో కూడా సాయి భక్తులు వేల మంది ఉన్నారు. సాయి దేవాలయాలు కూడా వెలుస్తున్నాయి. ఇక మన దేశం సంగతి చెప్పనే అక్కరలేదు. సమాధి అయ్యాక యిన్నేళ్లకు ఆ శక్తి ఎలా పాకిపోతోంది? ఆయనింకా ఉన్నారు గనుక! మరి ఉంటే కనపడరేం - అని అనుమానం రావచ్చు. ఆనాడు షిరిడీలో ఉన్నట్లుగా అదే ఆకారంలో లేకపోవచ్చుగానీ, ఈ ప్రపంచంలో ఉన్నా ప్రతీ జీవిలోనూ ఆయనున్నారు. ఆ విషయం ఆయన ద్వారకామాయి లో ఉన్నప్పుడే చెప్పారు. ఎలాగో యీ క్రింది కధలు వినండి.
ఒకసారి ఒక భక్తురాలు బాబాను తమ యింటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. ఆమె శ్రద్ధా, ప్రేమ ఉన్నా భక్తురాలు గనుక బాబా అలాగే వస్తానని చెప్పారు. ఆమె ఎంతో సంతోషంగా రకరకాల పదార్ధాలు తయారు చేసింది. పదకొండు గంటలయ్యేప్పటికి రొట్టెలు, అన్నం, కూరలు, మిఠాయిలు కూడా చేసేసింది. అన్నం వేడి ఆరకుండా పొయ్యి గట్టు మీద పెట్టి ఉంచి వీధి వాకిట్లో నిలబడి సాయి కోసం ఎదురు చూడ సాగింది. పన్నెండు - ఒంటిగంట - రెండు - మూడు గంటలు కూడా అయిపోయింది. సాయిబాబా రాలేదు. ఆమెకు దుఃఖం ముంచుకు వచ్చింది.
"వస్తానని చెప్పి ఆశపెట్టి, తీరా కష్టపడి వంట చేసుకుంటే యిల రాకుండా వుంటారా?" అని పోట్లాదదామనుకుంది. తలుపులు మూసి ద్వారకమయికి వెళ్ళాలని వెనక తలుపులు వేసి వచ్చేసరికి, ఒక నల్ల కుక్క ముందు మెట్లెక్కి లోపలికి వచ్చింది. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. ఛీ! ఫో! అవతలికి - కర్రేది! అంటూ దాన్ని భయపెట్టింది. అది జాలిగా వెనక్కి వెనక్కి చొస్తూ వెళ్లి పోయింది.
ఆ భక్తురాలు తలుపులు మూసేసి, ఒక్క విసురున బాబా దగ్గరకు వెళ్ళింది. అమేనంత దూరం నుంచీ చూస్తూనే బాబా చాలా జాలి ముఖంతో "ఏమ్మా! భోజనానికి రామన్నావు - తీరా వస్తే కర్రతో కొడతానని బెదిరిస్తావా? అన్నారు. ఆ భక్తురాలికి ఏమి అర్ధం కాలేదు. "మిరసలు రాకుండా నేను బెదిరించానంటారేమిటి బాబా?" అని అడిగింది. "నల్ల కుక్క రూపంలో వస్తే కొత్త బోయావుగా!" అన్నారు బాబా. ఆమె తెల్లబోయింది. భగవంతుడు కుక్క రూపంలో వస్తాడని తానెలా అనుకుంటుంది! "బాబా! నన్ను క్షమించండి. ఆ కుక్క మీరేనని నాకు తెలియలేదు. రేపు తప్పక రండి. ఈసారి పొరపాటు పడను" అన్నది. బాబా సరేనన్నారు. మరునాడు కూడా ఆ భక్తురాలు చక్కగా శుబ్రంగా వంట చేసింది. కొత్త మిఠాయిలు వండింది. కుక్క వచ్చినా కొత్తగూదదనుకుంది. సాయిబాబా వచ్చే వేలకు అన్నీ సిద్ధం చేసుకొని, మెట్లు గడప కడిగి ముగ్గులు వేసింది. అవి అందంగా వచ్చాయని మురిసిపోతూ చేతులు కడుక్కొని వచ్చే టప్పటికి ఒక గేదె బురద కాళ్ళతో ముగ్గులన్ని తోక్కేస్తూ మెట్లెక్కి వస్తోంది. ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. సాయి నాధుల పవిత్ర పాదాలు తొక్కాలని వేసిన ముగ్గులు పాడుసుస్తుండా యీ వెధవ గేదె! - అని మండిపడుతూ ఒక కట్టే తీసుకోని దాని వీపుమీద గట్టిగా ఒక్కటి వేసింది. గేదె గబగబ మెట్లు దిగింది. క్రింద నిలబడి ఆమె వైపోసారి జాలిగా చూస్తూ వెళ్లి పోయింది. ఆమె విసుక్కుంటూ మళ్లీ ముగ్గులు సరిగా వేసుకోవతంలో మునిగి పోయింది.
మధ్యాహ్నం పన్నెండు - ఒంటి గంట - రెండు - మూడు - నాలుగు గంటల వరకు చూచింది. ఇక మసీదుకు బయలుదేరింది. బాబా ఆమెను చోస్తూనే "అమ్మో ! మళ్లీ కొడుతుందేమో!" అని భయపడుతున్నట్లు అన్నారు. అలా అంటూనే కఫనీని పైకెత్తి తన వీపు మీద రక్తం చిందుతున్న పెద్ద కార్ర దెబ్బను చూపించారు.
"రమ్మంటావు - తీరా వస్తే యింత దెబ్బ కోడతావు - ఎందుకమ్మా అంట కోపం!" అన్నారు. ఆ భక్తురాలు గజగజ వణికిపోయింది. అయ్యో! తానెంత పాపం చేసింది! రోజూ చోచే గేదె రూపంలో ఆయనే వస్తారని ఎలా అనుకుంటుంది? అందుకే అంట దెబ్బ కొట్టింది. ఆమె బాబా పాదాల మిద పది భోరున ఏడ్చింది. "బాబా! నన్ను క్షమించండి - పాపిష్టిదాన్ని నా తండ్రిని కొట్టాను" అంటూ గిలగిలలాది పోయింది. బాబా ఆమెను ఓదార్చారు. కొంతసేపయ్యాక ఆమె తన యింటికి తిరిగి వెళ్ళబోతూ, బాబాను ఏదో అడగబోయి ముందువెనుక లాడుతోంది. బాబా అది చూచి "ఏమిటమ్మా - చెప్పు" అన్నారు. ఆమె తలవంచుకు నిలబడింది. బాబాకు విషయం అర్ధమై, "సరేనమ్మా రేపు వస్తానులే, కొట్టావు గదా మరి!" అన్నారు నవ్వుతూ. ఆమె పొంగిపోతూ బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయింది.
మరునాడు మధ్యాహ్నం కూడా వంట చేసి ఎదురు చూచిందా భక్తురాలు. కానీ, సాయి బాబా రాలేదు. ఆమె బాధపడింది. 'అవును - ఎలా వస్తారు! నేనొట్టి జ్ఞానం లేని మొద్దుని. గడపలోకి వచ్చిన నా తండ్రిని కొట్టిన పెద్ద పాపిని. అందుకే ఆయన రాలేదు. సరే నేనే వెళ్లి నా స్వామికివి తినిప్స్తాను' అంకున్నది. వంటగదిలోకి వెళ్లి చూచింది. మిఠాయిలకు చీమలు పట్టాయి. ఆమె వాటిని దులిపి, ఒక పళ్ళెంలో పెట్టుకొని ద్వారకామాయికి వెళ్ళింది.
శ్రీ సాయి బాబా ఆ భక్తురాలిని చూస్తూనే "రా తల్లీ, రా! నువ్వు చేసిన పేణీలు (అదొక మిఠాయి) యెంత బగున్నయమ్మా! కడుపు నిండా తిన్నాను" అన్నారు. ఆమె బాబా తనను వెక్కిరిస్తున్న రనుకున్నది. పళ్ళెం ఆయన ముందుంచి, మిరసలు రాకుండానే ఎలా తిన్నారు బాబా! నా మిద మీకు కోపంగా ఉంది.' అన్నది కన్నీళ్ళు పెట్టుకొని. బాబా "నేను నిజంగానే వచ్చాను తల్లీ! తిన్నాను కూడా - ఇదిగో చూడు" అంటూ తన కఫనీ పైకెత్తి పొట్ట చూపించారు. శ్రీ సాయి బాబా బొడ్డు చుట్టూ పేణీ ముక్కలు ముక్కున కరుచుకున్న చీమలు కొన్ని తిరుగుతున్నాయి. వెంటనే ఆమెకు మితాయికి చీమలు పట్టడం గుర్తు వచ్చింది. ఆనందంతో, ఆశ్చర్యంతో, భక్తీతో ఆమె సాయి పాదాల మీద వాలిపోయింది. "నా తండ్రి! చీమల రూపంలో వచ్చి నా వంట తిన్నావా!" అని పొంగి పోయింది. అప్పుడు సాయి ఇలా అన్నారు -
" అమ్మా! నేనెప్పుడూ అబద్దం చెప్పను. వస్తానంటే తప్పకుండా వస్తాను. ఏ రూపంలో వస్తానో నా భక్తులు గుర్తించాలి. ప్రపంచంలోని అన్ని జీవుల లోనూ నేనున్నాను. అది గుర్తుంచుకో" అందుచేత సాయి భక్తులైన వారు ఏ జేవినీ హింసించ కూడదు.
ఒకసారి ఆత్మారామ్ అనే ఆయన భార్య షిరిడీకి వచ్చింది. ఎవరింట్లోనూ ఉంటూ, వాళ్లకు డబ్బిచ్చి భోజనం చేస్తౌండేది. ఒకరోజు ఆమె మసీదుకు రాగానే బాబా "నువివ్వాళ పెట్టిన రొట్టెతో నా కడుపు నిండిపోయిందమ్మా! రోజూ యిలాగే పెడుతుండు" అన్నారు. "అదేమిటి బాబా! నేనిప్పుడే వస్తున్నాను నీ దగ్గరకి, పైగా నేనే యింకోకరింట్లో తింటున్నాను" అన్నది. దానికి రొట్టె పెట్టావా లేదా?" అన్నారు. ఆమె పెట్టనన్నది. "మరింకేం తల్లీ! అది నాకే వచ్చింది. ఆకలితో ఉన్నా ఏ ప్రాణికి నువ్వు కడుపు నింపినా నా కడుపే నిడుతుందని గుర్తుంచుకో" అన్నారు. అందుకేమన గడపలోకి వచ్చిన వారికి మనం తినే కారపు మేడుకులలోనైనా సరే - ఒక ముద్ద పెడితే బాబా ఎంతొ ఆనందిస్తారు.
మంచి ప్రాణులలోనే కాదు క్రూర జంతువులు, విషపు పురుగులలో కూడా తానే ఉన్నానన్నారు బాబా. ఒకసారి బాలాజీ నెవాస్కర్ అనే భక్తుడి పశువుల పాకలోకి ఒక పాము దూరింది. అది బుసగోడుతూ అటు యిటూ తిరుగుతుంటే పశువులన్నీ భయపడి కదులుతూ గోల చేస్తున్నాయి. నెవాస్కర్ అన్ని జీవులలోను బాబాయే ఉంటారని గొప్ప నమ్మకం. అందుచేత ఆయన ఏ మాత్రం భయపడకుండా ఒక గిన్నె నిండుగా పాలు తెచ్చి పాము ముందు పెట్టి, దాని ప్రక్కనే కూర్చున్నాడు. "బాబా! ఎందుకిలా గోల చేస్తున్నావు? మమ్మల్ని భయపెట్టాలనుకున్నావా? ఇదిగో ఈ పాలు మెల్లగా త్రాగు "అని ప్రార్ధించాడు. ఆ పాము కదలకుండా కాస్సేపుండి హఠాత్తుగా మాయమై పోయింది.
షిరిడీలో ఒకాయన కోడెదూడకు త్రిశూలం గుర్తు వేసి శివుడి పేరు మిద ఆంబోతుగా విడిచి పెట్టాడు. అది పెరిగి పెద్దదై అందరి చేలలోనూ పడి మేస్తుడేది. శివుడి ఆంబోతని యెవ్వరు ఏమీ అనేవారు కారు. మెల్ల మెల్లగా దాని అల్లరి హద్దు మీరి పోయింది. అందుచేత ఉళ్ళో వాళ్లందరూ కలిసి, దాన్ని బందేలదోడ్లో ఉంచి, దాని మేతకయ్యే ఖర్చు అందరూ కలసి భరించాలని అనుకున్నారు. సరే ముందు ఒక నేలకయ్యే ఖర్చు ఇచ్చి, ఆంబొతును ఒక మార్వాడీకి అప్పగించారు. దగ్గరలో ఉన్నా 'రహతా' అనే ఊళ్ళో బందేలదోడ్లో వదిలేసి రమ్మని చెప్పారు.
ఆ మార్వాడీ చాలా చెడ్డ వాడు. వాడు దానిని రహతా తోలుకువెళ్లి పద్నాలుగు రూపాయలకు ఒక కసాయివాడికి అమ్మేసి, షిరిడీ వచ్చాడు. బందేలదోడ్లో వదిలిపెట్టి వచ్చానని చెప్పాడు. అందరో నిజమే ననుకున్నారు. కానీ, ఆ రోజు తెల్లవారు జామున సాయి బాబా ఒక భక్తుడి కలలో కన్పించి "నన్ను రహతాలో కసాయి వాడి వాకిట్లో కట్టేసారు, వచ్చి విడిపించు" అని చెప్పారు. ఒక్కసారి కాకుండా వరుసగా మూడు సార్లు అలా కనిపించే సరికి ఆ భక్తుడికి అనుమానం వచ్చి, రహతా వెళ్లి వెదికితే కసి ముంగిట్లో కట్టేసి ఉన్నా ఆంబోతూ కనిపించింది. సాయి ఆ విధంగా పశువులలో కూడా తానే ఉన్నానని నిరూపించారు.
సాయి బాబాకు ఎంతో దగ్గరగా ఉండే మహాల్సాపతి ఒకరోజు గజ్జి కుక్క నొకదానిని కర్రతో కొట్టాడు. ఆ సాయంత్రం అతడు బాబా దగ్గరకు వెళ్ళగానే ఆయన "భక్తా, నాలాటిదే ఒక గజ్జికుక్క ఎలాగో తిరుగుతున్నది ఊళ్ళో, దాని నందరూ కొడుతున్నారు పాపం!" అన్నారు. మహాల్సాపతికి తన తప్పు గుర్తు చేసారన్నమాట.
ఇంత వరకూ మనం విన్న విషయాలన్నీ మనకేం చెప్తున్నాయి? శ్రీ సాయి నాధులు సమాధి చెడటం అంటే - ఆయన శరీరం మాత్రమె నశించి పోయింది. ఆయన శక్తి ప్రపంచమంతటా వ్యాపించే ఉంది. ప్రతి ప్రాణిలొనూ - చిన్న చీమ మొదలు పెద్ద ఏనుగు వరకూ, పాము మొదలు మనిషి వరకూ - ప్రతి ప్రాణిలోనూ ఆయన లేని చోటు లేదు. బాబా ముంచు రకరకాల నైవేద్యాలు పెట్టి పూజ చేసినంత మాత్రాన ఆయనకు తృప్తి కలగదు. ఆకలిగా ఉన్నవారి కడుపు నిమ్పినప్పుడే ఆయనకు సంతోషం కలుగుతుంది.
సాయి బాబా మన కల్లకిప్పుడు కనిపించరు. మరి, ఆయనకు సేవ చెయ్యటం ఎలాగ? ఆయన తానూ ప్రతి జీవిలోనూ ఉన్నానని చెప్పారు. అందుచేత కష్టంలో ఉన్నా ఏ జీవికి మనం సేవ చేసినా అది సాయి బాబాను సేవించినట్లే. అందుకని మాన్ చుట్టూ ప్రక్కల వారికి ఏ చిన్న కష్టం వచ్చినా పరుగున వెళ్లి సాయపడేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ ఒక్క గుణం నేర్చుకుంటే చాలు - ఆ స్వామి మన గుండెలోనే గుడి కట్టుకొని కూర్చున్నట్లే అవుతుంది.
ముగింపు ప్రార్ధన
ఏడు రోజులనుంచీ మనమంతా యిక్కడ కూర్చొని శ్రీ సాయి నాధుల జీవనలిలా విన్నాం. ఆ స్వామి దయగలిగితే ఎటువంటి మంచి చేస్తారో తెలుసుకున్నాం. అందుకు ఆయనకు ఎమివ్వలో అర్ధం చేసుకున్నాం. అన్ని ప్రాణులలోను సాయి బాబాయే ఉన్నారని గ్రహించాం. ఈ వారం రోజులలో మన కులం, మతం, డబ్బున్నవాడు, లేనివాడు - ఇలాంటి తేడాలన్నీ మర్చిపోయాం. అందరం కలిసి బాబా పూజ చేశాం. అందరం కలిసి ప్రసాదాలు పంచుకున్నాం. ప్రథిరోజూ సాయంత్రం పూట దేవుని పేరు తలుచ్కున్నాం. భజన చేశాం.
మనకున్న బాధలు, దిగుళ్లు, కష్టాలు, కన్నీళ్లు - అన్ని కాసేపు మర్చిపోయాం. అందరం కలిసి భగవంతుడి నామ సంకీర్తన చేస్తుంటే ఎంత బాగుందో చూడండి. మళ్లీ రేపటి నుండి ఎవరి గోల వారిదే. ఆయినా మనమంతా ఇప్పుడు చుట్టాలం, బంధువులం. సాయీ బంధువులం. సరిపదనివాడు, స్నేహితుడు అన్నా బేధం లేకుండా అందరిని ప్రేమించమని సాయీ చెప్పారు. అంచేత మనం యిలా ప్రమాణాలు చేసుకుందాం. ఈ మాటలు ఒకసారి విన్నా, మళ్లీ మనసులో చెప్పుకోండి.
"నేనింక మీదట ఎవ్వరికీ చెడు చెయ్యను - చెడు జరగాలని కోరుకోను."
నేనింక మీదట ఎవరి సొమ్మూ ఆశించాను. నా యింటికి ఆకలితో వచ్చిన ఏ ప్రాణిని ఊరికే పోమ్మనను. నేను తినే దానిలోనే ఒక్క ముద్దైనా పెట్టకుండా పంపాను.
ఎవరి గురించైనా చెడు ప్రచారాలు చేసేముందు గాని, నిందలు వేసేముందు గాని సాయీ బాబాను తలచుకొని, "బాబా యిందుకు నన్ను క్షమిస్తారా?" అని ప్రశ్న వేసుకొని అప్పుడు మాట్లాడతాను.
కోపం, విసుగు వంటివి తగ్గించ్కొనే ప్రయత్నం చేస్తాను. ఏది తాగుతున్న, తింటున్న, ఏ వస్తువును అనుభవిస్తున్న బాబాకు అర్పించ మరి తీసుకుంటాను.
స్వామీ, సాయీశ్వరా! మేము చ్సుకున్న పై ప్రమాణాలన్నీ సరిగా గుర్తుంచుకొని, ఆచరణలో పెట్ట గలిగేలా మమ్ము దీవించు. మా ఇరుగు పొరుగు, పిల్ల మేకా, గొడ్లూ గోడలు అన్నీ చల్లగా ఉండేలా చూడు బాబా! కష్టమైనా, సుకహ్మినా నివు ఇచ్చిన ప్రసాడంగానే తీసుకునే శక్తి మాకివ్వు తండ్రీ!
అన్ని వేళల మాకు తోడునీడవై ఉండు. మానవజన్మ ఎత్తినందుకు - నీ పాదాలు పట్టినందుకు - మా బ్రతుకులు సరైన దారిలో ఉండేలాగా నడిపించు తండ్రీ!
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
సాయీనాధ మహారాజ్ కీ జై!
సర్వే సన్తు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఖభాగ్ భవేత్!!
(ఈ ప్రార్ధన చదివిన తరువాత రెండు నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉంది, కళ్లు మూసుకొని, మన హృదయమ్లో సాయి బాబా ఉన్నట్లు ఊహించుకోవాలి. నమ్మకంతో, భక్తీతో, ప్రేమతో వారం రోజులూ కధలన్నీ విన్నవారికి బాబా ఆ క్షణంలో తప్పకుండా కన్పిస్తారు కూడా. ఆ తరువాత మెల్లగా కళ్లు విప్పి బాబా ఫోటో చూడండి. నమస్కారం చేసి ప్రసాదం తీసుకోవాలి).
(ఈ ముగింపు ప్రార్ధననే గురువారంనాడు కూడా చదివి కర్పూర హారతి యివ్వాలి.)
******************************************************************
ఆరవ అధ్యాయం - మంగళవారం పారాయణ
శ్రీ సాయినాధ చరితామృతం
ఆరవ అధ్యాయం - మంగళవారం పారాయణ
ప్రార్ధన
శ్రీ సాయినాధ దేవుల పాదపద్మాలకు నమస్సులు
ప్రభూ! ముల్లోకాలకూ సృష్టికర్తవైన తండ్రీ !
ఒక రోజు అతను భోజనం తయారుచేసుకొని బాబా దగ్గరకు వేల్లబూతుండగా ఒక నల్ల కుక్క అతని కెదురు వచ్చి ఆశగా వంటకాల కేసి చూస్తూ నిలబడింది. ఉపాసనీ శాస్త్రి దానిని కొట్టి, బాబా దగ్గరకు వెళ్లారు. ఆవేళ బాబా ఆయన నివేదనను తేసుకొలేదు. "నేను అక్కడిదాక వస్తే కొట్టావు - ఇక్కడికి తెచ్చావెందుకు? నీవు కొట్టిన నల్ల కుక్కలో నేనే ఉన్నానని మరచి పోయావా?" అన్నారు. ఉపాసనీ శాస్త్రి సిగ్గుపడి వెళ్ళిపోయాడు.
మరునాడు మళ్ళి శ్రద్ధగా వంటచేశాడు. నల్ల కుక్క వస్తుందేమోనని చూచాడు - రాలేదు. దూరంగా ఒక గొడకానుకొని నిలబడి ఈ వంటకాల వైపే ఆశగా చూస్తున్న చందాలుడైన భిక్షగాడొకడు కనిపించాడు. ఆచారవంతుడైన మన ఉపాసనీ శాస్త్రికి వాడిని చూస్తే చిరాకు కలిగింది. అతన్ని కసిరికొట్టి, ద్వారకామాయికి వచ్చాడు. బాబా ఆవేళ కూడా ఉపాశానీ నివేధన గ్రహించ లేదు. "ఆ భిక్షకుడి రూపంలో వచ్చిన నన్ను కసిరికొట్టావు - ఇక్కడికేమో పెడతానని వచ్చావు. అన్ని ప్రానులనోనూ నేను లేనా? అంతటా నన్ను చూడటం నేర్చుకో" అని మందలించారు. చిన్నదైనా, పెద్దదైనా, ప్రదిజీవిలోనూ పరమాత్ముడున్నదన్న సంగతి ఇలా బొధించారు సాయి బాబా.
కుల మాట బేధాలు పాటించటం అంటే సాయి బాబా కు నచ్చదు. హిందు మహమ్మదీయ మతాల వారిని కలిసి మెలసి ఉండమని ఆయన ఎప్పుడు బోధించేవారు. ఏ మతం వారైనా తమ మతంలోని గొప్పతనాన్ని తెలుసుకుంటే అది వాడాలి వేరే మతాల వైపు పరిగెత్తారు. అన్ని మతాలు బోదించేది మంచినే. అవన్నీ భగవంతుడిని చేరడానికి మనం తయారుచేసుకున్న వేరు వేరు దారులు - అంతే. కానీ కొన్ని మతాలవారు ఇతరులను తమ మతంలోని లగాతాన్ని గొప్పగా భావిస్తారు. అలాంటి పనులను బాబా అసహ్యించుకున్నారు. ఒకసారి బడేబాబా అన్నతాడు ఓకే యువకుడిని బాబాకు చూపిఇంచి ఇతన్ని మహమ్మదీయ మతం లోకి మార్చానని చెప్పాడు. బాబా ఆ యువకుడిని దగ్గరకు పిలిచి, చెంపమీద కొట్టి "నీ అబ్బను మార్చు కుంటావురా ?" అని కోప్పడ్డారు. హిందువైనా, మహామ్మదియుడైన, క్రైస్తవుడైనా, యికేవరైనా నీతి నియమాలతో బ్రతకటం ముఖ్యం. సరయిన ప్రవర్తన, మంచి మనసు, దైవ భక్తీ ఉండాలి - అనేవారు.
వెంటనే బాబా ఆ నోటిదురుసు వాడిని పిలిచి "అదిగో చూచావా! ఆ పంది అందరూ అసహ్యించుకునే అసుద్ధాన్ని ఎంత రుచిగా తింటున్నదో! నీవు కూడా నీ సాటి భక్తుడి గురించి అసష్యంగా మాట్లాడవు. అతడి పాపాల్ని నీ నాలుకాతో నాకివేశావు. ఎంతో పుణ్యం చేసుకుంటే నీకీ మానవ జన్మ దొరికింది. తిరిగి ఇలాంటి పనులు చేస్తే - ఇలా మాట్లాడితే ద్వారకామాయి నిఇంను క్షమించదు అన్నారు. ద్వారకామాయి అంటే బాబాయ్ క్షమించరన్న మాట.
ఎప్పుడయినా మనం ఎవరినైనా నిందించటం గాని, వాళ్లు చేసిన చెడ్డ పనులను గురించి అదీపనిగా మాట్లాడటం గాని చేస్తే - వాళ్ల పాపాలన్నీ పోయి, అవన్నీ మనకు వస్తాయని శాస్త్రాలు చెపుతాయి. అంటే మనం ఎదుటి వాళ్ల పాపాలన్నీ మన నాలుకాతో నాకినట్లవుతుంది కదా! అందుచేత అలాంటి మాటలు నాలుక మీదికి రాగానే, మనం "అమ్మబాబోయ్! వాళ్ల పాపాలన్నీ నాకెందుకు!" అని మాట్లాడటం మానెయ్యాలని శ్రీ సాయి బోధించారు.
బాబా చిరునవ్వుతో "అలాగే నాయనా! చాలా సంతోషం. నా దగ్గరకు పిల్లల్నిమ్మనీ చదువిమ్మనీ, ఉధ్యొగాలిమ్మనీ - ఇలాంటి కోరికల కోసం వస్తారు గానీ, నీలాగా బ్రహ్మజ్ఞానానిమ్మనివచ్చేవా ళ్ళే లేరు. తప్పకుండా యిస్తాను" అన్నారు. అతన్ని కూర్చోబెట్టి ఒక పిల్లవాడిని పిలిచి, "నందూ మార్వాడీ dagగరకు పో' అన్నారు బాబా. వాడు మళ్ళి వచ్చి అతనూ లేదన్నాడు. అల ఐదారు చోట్లకు తిరిగాడు పిల్లవాడు. ఇదంతా చూస్తూ కూర్చున్న ధనవంతుడు "బాబా! నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వు" అని తొందర పెట్టాడు.
అప్పుడు బాబా నవ్వి, "నాయనా! ఇదిగో నీకు బ్రహ్మాన్ని చూపడానికే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను. దైవాన్ని పొందాలనుకునీవాడికి మొదట మోక్షం పొందాలనే గట్టి కోరిక ఉండాలి. ఈ లోకంలో ఉన్నా సుఖాలంటే విరక్తి కలగాలి. నా డబ్బు, నా ఇల్లు, నా పిల్లలు అనే మమకారం, చెడ్డ మాటల చెడ్డ పనులు మానెయ్యాలి. ఎప్పుడూ నిజం చెప్తూ బ్రహ్మచర్యంతో వుండాలి. మామూలుగా మనుశ్యులన్దరికీ ఈ లోకంలో వస్తువుల మీద మొజుంటుంది. కాని అవన్నీ ఇవ్వాలుండి రేపు పోయేవే. నాశనం లేకుండా వుందేడల్లా ఒక్క భగవంతుడే. ఆ విషయం ఎప్పుడు గుర్తున్చుకొవాలి.
మన మనస్సు కోతిలాగా చపలమైంది. ఒకసారిటూ ఒకసారటూ గెంతుతుంటుంది. అందుచేత మనసును, శరీరాన్ని 'బుద్ధి' తో అదుపులో పెట్టుకోవాలి. యప్పటికప్పుడు - ఇది మచిదా కాదా? అని ఆలోచించు కుంటూ నడవాలి. తన పనులు తానూ జాగ్రత్తగా చేస్తూ భగవంతుని ధ్యానించే వాడికే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
మనిషి లోపల ఆరు శత్రువులుంటాయి. వాటిని కామం (కోరిక ), క్రోధం (కోపం), లోభం (పిసినారితనం), మొహం(మోజు), మదం (పొగరు), మాత్సర్యం (అసూయ) అంటారు. బయటి శత్రువులను కత్తితో పోదిచో, కర్రతో కోతతో చంపుతాం. ఈ లోపలి శత్రువులనేట్లా చంపగలం? వీటికి ఇద్దరు నాయకులుంటారు. వాళ్ల ప్రేలు మమకారం (నాది, నాది అనుకోవటం), అహంకారం (అన్ని నేనే చేస్తున్నాననుకోవటం). ఎంత గొప్పవాళ్ళను కూడా యీ శత్రువులు పడగోట్టేస్తూ వుంటాయి. మరెలా వీటిని జయించడం? ఒకే ఒక్క మార్గం. మంచి గురువు చెప్పే బోధలు ఆచరణలో పెట్టటం. గురువును సేవిస్తూ వుంటే ఆయన మన జీవితాన్ని సరైన మార్గంలో నడుపుతారు. ఈ శత్రువులంతా చచిపోతారు వరుసగా. ఆ పైన మెల్లమెల్లగా భగవంతుని దయ మన మీదకి వస్తుంది. అప్పుడు మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
నాయనా! నీ జేబులో బ్రహ్మం ఏభై యింతలుగా వుండి చూడు. ధనం మిద కోరిక, సంసారం మిద ఆస పోనివాడికి దేవుడెలా కన్పిస్తాడు? నీకున్న అర్హతను బట్టే నీకు మేలు కలుగుతుంది". బాబావారి యీ మాటలన్నీ అక్కడున్న వాల్లదరికీ కళ్లు తెరిపించాయి. బాబా వంటి మహానుబావుడికి ఇదు రూపాయలతో ఏంపని? ఒకవేళ ఆయనకు అవసరమైతే ప్రక్కనున్న ధనవంతుదివ్వవచ్చు గదా! వాడి జేబులో రూ. 250 వున్నాయి గదా. పిల్లవాడు ఇదారుచోట్లకు తిరుగుతుంటే చూస్తూ ఊరుకున్నదే తప్ప జేబులో చెయ్యి పెట్టలేదే! తన డబ్బు మిఇడ అంత లోభితనం వున్నవాడికి బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది?
అందుచేత మనం భగవంతుని చేరుకోవాలంటే - యీ లోకంలో మన చెయ్యవలల్సిన పనులన్నీ పద్దతి ప్రకారం చేస్తూనే
ఉండాలి. మనకివన్నీ నిలబడేవి కావనీ, ఎప్పటికైనా మనం వీటన్నిటిని విడిచి పొవలసిన్దెననీ గుర్తుంచుకొని వాటి మీద మమకారం తగ్గించుకొని ఎప్పుడు లోపల భగవన్నామం చెప్పుకుంటూ మంచిమార్గంలో నడవాలి.
"గురువు, దేవుడు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందు గురువుకే నమస్కరిస్తాను - ఎందుకంటే నాకు దేవుడిని చూపించింది గురువే" అన్నారు భక్త కబీరు.
శ్రీ సాయి బాబా తన గురువును పన్నెండేళ్ళ పాటు సేవించానని చెప్పారు. ఈ కధ వినండి. రాధాబాయ్ దేశ్ ముఖ్ అనే ఒక ముసలమ్మ బాబా దగ్గరకు వచ్చింది. బాబా దగ్గర ఏదైనా మంత్రోపదేశం పొందాలనీ, అలా బాబా తనకు మంత్రమివ్వకపొతే ఉపవాసాలుండి చచ్చిపొవాలనీ ఆమె నిర్ణయించుకుంది. ఈ సంగతి శ్యామా బాబాకు చెప్పాడు. "ముసలిది చచ్చిపోతుందో ఏమో, ఏదైనా చెప్ప" మన్నాడు. బాబా ఆమెను పిలిపించాడు.
"అమ్మా! నా గురువు నాకే మంత్రము ఉపదేసించలేదు. ఇక నేను నీకేం చెప్పగలను? నేను పన్నెండేళ్ళు నా గురువును సేవించాను. ఆయనను చూడకపోతే నాకు కళ్ళున్నా వ్యర్ధమనిపించేది. లోకం అంతా ఖాళిగా అన్పించేది. ఆ చూపుతోనే నాకెంతో శక్తి వచ్చినట్లుండేది. వారి సేవ తప్ప నాకింకొక పనే లేదు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలండేవి కావు. ఆయన నా తల గోరిగించారు. అంటే నాకున్న అహంకారాన్నీ, గర్వాన్నీ పోగొట్టారు. రెండు కాసుల దశిన అడిగారు. ఒకటి శ్రద్ధ, రెండవది ఓర్పు. నేను శ్రద్ధతో ఆయన్ను సేవించాను. నామీద ఆయనకు దయ కలిగేవరకూ ఓర్పుతో కాచుకొని వున్నాను. అలా పన్నిండెళ్లు గడిచాయి. ఏ మంత్రమూ లేకుండానే నేనింత వాడినయ్యను.
అమ్మ! తాబేలు నడికొక ఒడ్డున గ్రుడ్లు పెడుతుంది. తానూ రెండవ ఒడ్డుకు పోయి కూర్చుంటుంది. తల్లి పిల్లలకు పాలివ్వటం, లాలించటం, పెంచటం ఏమి చెయ్యదు. ఊరికే పిల్లలవైపు ప్రేమతో చూస్తుంటుంది. పిల్లలు కూడా తల్లివైపే చూస్తుంటాయి. తల్లి చూపులతో పంపే ప్రేమతోనే పిల్లలు ప్రేఇగి పెద్దవవుతాయి. అలాగే నా గురువు ప్రేమతోనే నేనింత వాడినయ్యను. నీవు కూడా ఏ ఉపదేశాలవైపు పరుగుతీయకు. శ్రద్ధతో, ఓర్పుతో గురువును సేవించు. అదే మోక్షానికి దారి తీస్తుంది" ఈ మాటలన్నీ విని తధబాయ్ దేశ్ ముఖ్ తృప్తి పది వెళ్ళిపోయింది.
ఇంకొక సారి సాయి బాబా "నా గురువు నన్ను పెద్ద బావిలో తలక్రిందులుగా వేలాడదీసారు. నీళ్ళు చేతులకు అన్దీ అంద కుండా వున్నాయి. ఆయినా నేను బాధపడలేదు. చాల సంతోషించాను" అన్నారు. గురువు శిష్యుడిని పరీక్షించడానికి ఎన్నోరకాల పరిక్షలు పెడుతుంటాడు. శ్రీ సాయి బాబా చెప్పినట్లు మనందరం తాబేటి పిల్లలం కావాలి. మనతల్లి తాబేలు బాబాయే. పైకి కళ్ళతో ఏం చేస్తున్నా, చేతులతో మన మాకూలు పనులౌ చేసుకుంటున్నా - మన మనసు మాత్రం ఎల్లప్పుడూ సాయి మీదనే వుండాలి. అప్పుడే ఆయన నుంచీ మనం శక్తి పొందగాలుగుతాం.
దాముఅన్నాకు జవాబు దొరికింది. ఏదో కొన్నిసార్లు గురుసేవ చేసి తప్పుకు పోయినవారికి ఫలితం దక్కదు. కష్టాలకో, ఇంట్లో వాళ్ల గోదావకో భయపడి గురుపాదాలు వదిలి పోయేవాళ్ళు పిందెల వంటి వాళ్లు. కొన్ని సంవత్సరాలు శ్రద్ధతో చేసి, ఓర్పు లేక యింకేన్నాళ్ళు చేస్తాం! అని వదిలిపెట్టి పోయేవాళ్ళు కాయలుగా రాలిపోయేవారు. మొదటినుంచీ ఫలితం వచ్చేవరకూ - నమ్మిన బాబా పాదాలు వదలకుండా సేవించేవాదికే పండయ్యే అదృష్టం పట్టేది.
కుశాభవు యింకా చాలా శక్తులు పొందాలన్న ఆశతో బాబా దగ్గరకు వచ్చాడు. కానీ, బాబా అతన్ని చూస్తూనే "ముందు ఆ చేతులకున్న కడియాలు తేసి, గోదావరిలో పారేసి, అప్పుడు నా దగ్గరకు రా" అన్నారు. కుశాభావు అలాగే చేశాడు. శక్తులు పోగొట్టుకొని దుఖించాడు. బాబా అతన్ని " గురు చరిత్ర" నూట ఎనిమిది సార్లు పారాయణ చెయ్యమన్నారు. ఆ పారాయణం తో కుశాభావులో కొంత మార్పు వచ్చింది. బాబా శక్తి మిద నమ్మకం ఏర్పడింది.
ఇలా ఉండగా ఏకాదశి వచ్చింది. కుశాభావు ద్వారకామాయి కి వచ్చాడు. అప్పుడు బాబా కుశాభావుని ఉల్లి గడ్డలు తినమన్నారు. "ఇవ్వాళ ఏకాదశి కదా! ఉల్లిగడ్డలు తినను నేను" అన్నాడు కుశాభావు. "తింటే ఏం?" అన్నారు బాబా. "మీరు తింటే నేను కూడా తింటాను" అన్నాడు కుశాభావు. బాబా ఉల్లిపాయలు తిన్నారు. కుశాభావు కూడా తిన్నాడు. బాబా నవ్వుతూ "ఇదిగో దద్ ఆచార వంతుడు ఇవ్వాళా ఎకాదసినాడు ఉల్లిగడ్డలు తిన్నాడు" అన్నారు. కుశాభావుకు కాస్త రోషం వచ్చింది. "బాబా తింటే నేను తిన్నాను." అన్నాడు.
బాబా కొంటెగా నవ్వి, "ఏం భావూ!! నేను ఉల్లిగడ్డలు తిన్నానంటున్నావా? ఏవి చూపించు? అంటూ తానూ తిన్నదంతా కక్కేశారు. ఆశ్చర్యంగా అందులో ఒక్క ఉల్లిముక్కినా లేదు. పైగా రకరకాల దుమ్పముక్కలు ఉన్నాయి. కుశాభావు కి హఠాత్తుగా అర్ధమైంది. బాబా తనకొక పరీక్షగానే ఈ లీల చూపిస్తున్నారని. వెంటనే అతడు బాబా కక్కినదానిలో పడిన దుమ్పలన్ని ఎరుక్కొని తినడా మొదలు పెట్టాడు. సాయి బాబా "ఛీ ఛీ అదేం పని" అంటూ అతన్ని పక్కకు లాగేశారు - తిట్టారు - కొట్టారు. ఏం చేసినా కుశాభావూ తానూ చేస్తున్న పని మాన లేదు. ఆ ముక్కలన్నీ తినేసాడు. బాబాకు కుశాభావూ మీద దయ కలిగింది. అతన్ని దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నారు. "భావూ ని భక్తి శ్రద్ధలు నాకు నచ్చాయి. ఇదిగో నీ చేయి చాపు" అన్నారు. వెంటనే భావూ చేతిలోకి వెచ్చని ఊది వచ్చింది. సాయి ప్రేమతో కుశాభావును ఇలా ఆశీర్వదించారు - నీవు కోరినప్పుడల్లా ఎక్కడ వున్నా సరే, ఇలాగే దునిలోని వెచ్చని ఊది నీ చేతిలోకి వస్తుది". ఆ పైన కుశాభావు జీవించి ఉన్నంత కాలం అలా ఊదీ తెప్పించి రోగాలతో ఉన్నవాళ్ళకు, కష్టాలలో ఉన్నవాళ్ళకు యిస్తూ ఉండేవాడు.
ఈ కధ ద్వారా మనకు ఒక గొప్ప విషయం తెలుస్తున్నది. సాయి బాబాకు ఎన్నో శక్తులు, మహిమలు వుండేవి. కానీ, ఆయన ఎంతో అవసరమైతే తప్ప ఉపయోగించేవారు కారు. ఎక్కడెక్కడి వస్తువులో చేతుల్లోకి తెచ్చి ప్రదర్శించటం, మామూలు మనుషుయ్లకు లేనిపోని మహిమలు చూపించి, తానేదో గొప్పవాడి ననిపించు కోవటం, వాళ్ళను భయపెట్టో, ఆస పెట్టో దగ్గరకు చేర్చుకోవటం - ఇలాంటివి చయ్యకూడని పనులని ఆయన బోధించారు. అందుచేత బాబా భక్తులైనవారు బాబా పేరు మీద అలాటి ఆడంబరాలు, మహిమల ప్రదర్సన, హడావుడీ చేసేవాళ్ళ గురించి చిన్నప్పుడు కుశాభావు కధ, అందులోని నీతి, గుర్తు చేసుకోవాలి.
మనం మన చిన్న పిల్లవాడికి ఒక మంచి విలువైన వస్తువేదైనా యిచ్చామను కోండి. వాడు దాన్ని చ్తక్కొట్టి, పాడుచేసి అవతల పాడేశాడు. మళ్లీ వెంటనే వాదికల్లాంటి వస్తువు కొనిస్తామా? "నికిచ్చినా లాభం లేదు" అని వాడిని మళ్లీ విలువ తెలుస్తుదన్న నమ్మకం ఏర్పడేవరకూ ఇవ్వము. భగవంతుడికి మనందరం పిల్లలమే. ఆయన ఇంత విలువైన గొప్ప మానవ జీవితాన్ని మనకిచ్చారు. మనం దాన్ని ఆటలతో, పాటలతో, విందు వినూదాలతో, కోపతాపాలతో, అహంకార మమకారాలతో ఈ లోకంలో ఉండే సుఖాల మెడ కోరికలతో వృధా చేసుకుంటే - ఆయన మళ్లీ అంత గొప్ప జన్మ మనకివ్వాడు. మళ్లీ ఎన్ని వేళ సంవత్సరాలో నీచ జన్మలు పొందుతూ ఉండవలసిందే. సాయి ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెబుతుండేవారు.
"ఏదో ఒక సాధన ద్వారా మోక్షం పొందే ప్రయత్నం చెయ్యండి. లేకపొతే మీ జన్మ వ్యర్ధం." అనేవారాయన. ఇదిగో ఈ కధ కూడా దానినే చెబుతుంది. ఒకసారి సాయి బాబా కొందరి భక్తులతో కలసి లేండీ తోట వైపు వెళుతుండగ మేకల మందను తొలుకొనీ పోతూ ఒకదేడురైనాడు. వాటిలో రెండు మేకల మిద బాబా చూపు పడింది. మేకలవాడికి ముప్పై రెండు రూపాయలిచ్చి ఆ రెండు మేకలను కొన్నారు. దగ్గరున్న వాళ్ళంతా ఆ మేకల ఖరీదు ఎంత ఎక్కువ పెట్టినా ఎనిమిది రూపాయలకు మించదనీ, బాబా అనవసరంగా అంత డబ్బు ఖర్చు చేసారని అన్నారు. బాబా నాలుగు శేర్ల సెనగపప్పు కొని మేకలకు పెట్టించారు. తరువాత వాటిని వాటి యజమానికి ఇచ్చేసారు. అప్పుడాయన యిలా చెప్పారు.
"నేను మేకల బేరంలో మోసపోయానని మీరు అనుకుంటున్నారు గదా! పూర్వ జన్మలో ఈ రెండు మేకలూ సొంత అన్నదమ్ములు. మొదట ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. చిన్నవాడు చురుకైనవాడు కనుక బాగా డబ్బు సంపాదించాడు. సోమరైన పెద్దవాదికిది అసూయ కలిగించింది. ఇద్దరి మధ్య కొట్లాటలు మొదలయ్యాయి. అన్నా తమ్ముడిని చంపి వాడి ఆస్తి కాజేయ్యలనుకున్నాడు. పెద్ద బడితెతో తమ్ముడిని చంపి వాడి ఆస్తి కాజేయ్యలనున్నాడు. పెద్ద బడితెతో తమ్ముడిని కొట్టాడు. తమ్ముడు గొడ్డలితో అన్నాను నరికాడు. ఇద్దరూ ఒకేసారి చచ్చిపోయారు. మనిషి జన్మ ఎట్టి కూడా ద్వేషంతో, పగతో జన్మ వృధా చేసుకొని ఇలా మేకలై పుట్టారు. అందుకని వాటి మీద జాలితో నా దగ్గరున్చ్కున్దామని కొన్నాను. మీరందరూ వద్దన్నారు గదా - వదిలేసాను". దీనిని బట్టి మనం జీవితాలను ఎలా జాగ్రత్తగా నడుపుకోవాలో గుర్తుంచుకోవాలి.
దాసుగణు ఈశావాశ్యోపనిశాత్తు అనే ఒక సంస్కృత గ్రంధాన్ని మరాఠీ భాషలోకి వ్రాయలనుకున్నాడు. ఆ గ్రంధం చాలా చిన్నది కాని చాలా గొప్పది. దానిలో మొట్టమొదటి మంత్రంలోనే "భగవంతుడు ఈ ప్రపంచమంతటా, ప్రతి వస్తువులోను వ్యాపించి ఉన్నాడు. అందుచేత దేన్నయినా ఆయన ప్రసాడంగానే అనుకోవాలి. ధనం ఎవ్వరి సొంతమూ కాదు, నలుగురికీ పెట్టి, తినాలి" అని ఉంది. ఆ ఉపనిషత్తులో ఉన్నా లోతైన అర్ధాలు దాసుగానుకు అంతుబట్టలేదు. ఎవరెవరో పండితులను అడిగి అడిగి చివరకు సాయి బాబాను అడిగాడు. బాబా - "నీవు దాన్ని గురించి ఏమి బాధపడకు. విల్లిపార్లే అనే ఊళ్లో కాకాసాహెబ్ ధిక్షిత్ పనిపిల్ల నీకన్నీ వివరంగా తెలియజేస్తుంది" అన్నారు. అక్కడున్న వారందరూ బాబా తమాషా చేస్తున్నాడు అనుకొన్నారు. కానీ దాసుగణు మాత్రం అలా అనుకోలేదు.
బాబా చెపారు గనుక నేను విల్లిపార్లే వెళ్లాలి అనుకొన్నాడు, వెళ్లాడు. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. ప్రొద్దున అతను నిద్ర లేచేటప్పటికి ఒక పాట వినిపించింది. ఎర్రంచు ఉన్న ఒక చీరను గురించిన పాట అది. దాని అంచు, కొంగు ఎంతో బాగున్నాయని పాడుతున్నది కాకాసహేబ్ పనిపిల్ల. దాసుగణుకు ఆ పిల్ల మీద జాలి వేసింది. తనకు ప్రధాన అనే ఆయన ధోవతులు పెడుతుండగా - ఆ పిల్లకు చిన్న చిర కొనిమ్మని చెప్పాడు. ఆ మరునాడు ఆ పనిపిల్ల ప్రధాన్ ఇచ్చిన కొత్తచిర కట్టుకుని సంతోషంగా ఆడుతూ, చక్కగా పాటలు పాడింది. మూడవరోజు కొత్త చిర దాచిపేట్టుకుని చినిగిన పాత చీర కట్టుకొని పనిలోకి వచ్చింది. అయితే ఆరోజు కూడా ఆ పిల్ల ఆనందంతో పాడుతూనే, ఆడుతూనే ఉంది. దాసుగణుకు బాబా తనను అక్కడికేందుకు పంపించారో అర్ధమైంది. ఆ పిల్ల కొత్త చీర లేనప్పుడూ సంతోషంగానే ఉంది. ఉంది దాచుకొని పాతచీర కట్టుకున్నప్పుడూ సంతోషంగానే ఉంది. దీనినుంచి దాసుగణుకు ఈసావస్యోపనిషత్తులోని సారాంశం అర్ధమైంది. మనిషి ఎప్పుడు తానూ చేయవలసిన కర్మ (పని) చేస్తూనే ఉండాలి. భగవంతుడు ఏ సమయానికి ఏమిస్తే అది మనకు ప్రాప్తం అనుకోవాలి. అదే మనకు అవసరమని తెలుసుకోవాలి. కష్టమైనా, సుఖమైనా దాన్ని సంతోషంతొ అనుభవించాలి. ఈ విషయం అర్ధం చేసుకొని దాసుగణు ఆనందంతో తిరిగి వెళ్లాడు.
పుండలీకరావు అనే ఒక ప్లీడరు వసుదేవానంద సరస్వతి అనే యోగిని చూడడానికి రాజమండ్రి వెళ్లాడు. ఆ యోగి దర్శనం అయిన తరువాత ఏదో మాటలలో షిరిడీ గురించీ, సాయిబాబా గురించీ వచ్చింది. ఆ యోగి బాబా పేరు వినగానే నమస్కారం చేసి ఒక కొబ్బరికాయ పుండలీకరావుకిచ్చి "ఇది నా సోదరుడు సాయిబాబా కివ్వు, నా మీద ప్రేమ ఉంచమను" అని చెప్పాడు. సామాన్యంగా యోగులు ఇతరులకు నమస్కారం చెయ్యరు గానీ సాయి యోగులందరికీ దేవుడే కదా!
సరే - మన పుండలీకరావు ఆ కొబ్బరికాయ తెసుకొని, కొండకాలం తరువాత స్నేహితులతో కలిసి షిరిడీ బయలుదేరాడు. మన్మాడ్ చేరేసరికి వారికి ఫలగారం వేళయింది. అందరూ కారపు అటుకులు తిన్నారు. అవి చాల కారంగా ఉండటంతో పొరపాటున బాబా కోసం యోగి యిచ్చిన కొబ్బరి కాయ కొట్టి ఆ ముక్కలు అందులో కలుపుకు తిన్నారు. ప్రయాణం సాగింది. షిరిడీ చేరుతుండగా హఠాత్తుగా పుండలీకరావుకు తామూ కొట్టింది బాబా కోసం యిచ్చిన కొబ్బరికాయ అని గ్రుతూ వచ్చింది. అతనికి దుఃఖం, భయం రెండూ కలిగాయి.
బాబా దర్శనానికి వెళ్ళాడు పుండలీకరావు. బాబా 'నా సోదరుదిచ్చిన టెంకాయ ఏది? ఇలా యివ్వు? " అని అడిగారు. జరిగినదంతా చెప్పి తన తప్పు క్షమించమనీ, దానికి బదులుగా చాలా టెంకాయలిస్తానని చెప్పాడు. బాబా "నీవు ఎన్ని కాయలిచ్చినా దానికి సమానం కావు. అయినా జరిగిన దానికి బాధపడకు. ఆ యోగి యివ్వటమూ, దారిలో నీవు పగలగోట్టటమూ అన్ని నా సంకల్పం ప్రకారంగానే జరిగాయి. మంచి గానీ, చెడు గానీ దేనికీ నివే కర్తవని (నివే చేస్తున్నావని) అనుకోవద్దు. అందుచేత మన వంతుకు వచ్చిన పని మనసు పెట్టి శ్రద్ధగా చేస్తూ పోవాలి. ఫలితం మంచైనా, చ్డైనా మన పట్టించుకోకూడదు. అదంతా భగవంతుడి సంకల్పమే అనుకోవాలి.
పుస్తకాలు చదివినంత మాత్రాన చాలదు - అందులోని విషయాలు ఆచరణలో పెట్టాలి.
సాయి బాబాకు ముఖ్య భక్తులైన కపర్దే, బట్టీ, నూల్కర్ అనేవారు ముగ్గురు బాబా ఎదుట ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడేవారు కారు. వాళ్ళంతా గొప్ప గొప్ప గ్రంధాలు, శాస్త్రాలు, పురాణాలు చదివినవారే. కానీ నిజమైన ఆత్మా జ్ఞానం ముందు యివన్నీ పనికిరానివే గదా! శ్రీ సాయి బాబా ఎప్పుడు ఆచరణ అవసరం అనేవారు.
ఒకసారి వి. హెచ్. ఠాకూర్ అనే ఒక ఉద్యోగి 'అప్పా' అనే కన్నడ యోగిని కలుసుకున్నాడు. ఆ యోగి 'విచారసాగరం' అనే పుస్తకం చదవమనీ, అది మేలు చేస్తుందనీ చెప్పాడు. ఉద్యోగపు పనిమీద ఉత్తరదిక్కుగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప యోగిని కలుసుకుంటావు. ఆయన నీకు శాంతినీ, మేలునూ కలిగిస్తారని చెప్పాడు. ఆ తరువాత కొంతకాలానికి ఠాకూర్ షిరిడీకి వెళ్లాడు. బాబా దర్శనం కాగానే అతనికి కన్నీళ్లు వచ్చాయి. ఏదో తెలియని సంతోషం కలిగింది. బాబా అతన్ని చూచి "ఇక్కడ మార్గం అప్పా నీతులంత తేలిక కాదు. ఈ ఆద్యాత్మిక మార్గంలో చాలా కష్టపడి ముందుకు పోవాలి" అన్నారు.
వెంటనే ఠాకూర్ బాబా పాదాలకు నమస్కారం చేశాడు. సాయి అతన్ని దీవించి "విచారసాగరంలో గొప్ప విషయాలున్నాయి. కానీ, ఊరికే చదివి లాభం లేదు. చదివినదంతా ఆలోచించి ఆచరణలో పెట్టాలి. గురువు ఆశీర్వాదం లేకపోతె ఆత్మజ్ఞానం కలగదు" అన్నారు. దిన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే - మనం ఊరికే విన్నా చదివినా లాభం ఉండదు. వాటిని బాగా మనసుకి పట్టించుకోని వాటిని బట్టి మన ప్రవర్తన దిద్దుకోవాలి. అప్పుడే బాబా దయ మన మీద ఉంటుందని గుర్తుంచుకోవాలి.
"చూడండి! ఒక గింజ మొలకెత్తి, పెరిగి, పెద్ద వృక్షం కావాలంటే ఎన్ని విధాల ఎన్ని శక్తులు సాయం చేస్తాయి? నేల, నీళ్లు, సూర్యుడు, గాలి - యిన్ని కలిస్తే గానీ గింజ ప్రాణం పోసుకోదు, పైకి పెరగదు. అయినా యివన్నీ ఆ మొక్కనుంచీ ఏమైనా ఆశిస్తున్నయా? మొక్కనుంచీ ఏమైనా లాభం పొందా లనుకుంటున్నాయా? ఫలితం ఆశించకుండా పని చేస్తేనే పరమాత్ముడికి సంతోషం కలుగుతుంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. ఎవరినుంచీ ఏమీ ఆశించకండి. ఎవరికి ఏమీ కీడు చెయ్యకండి - చేతనైతే మేలు మాత్రమె చెయ్యండి." అని చెప్పారు.
ఈ విధంగా శ్రీ సాయి బాబా తన దగ్గరకు చేరే భక్తులకు ఎన్నెన్నో రకాల బద్దలు చేసేవారు. మనం మంత్రజపం చేసినా, హొమాలు చేసినా, యజ్ఞాలూ చేసినా, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినా - మన బుద్ధి కుదురుగా లేకపొతే, మన ప్రవర్తన సరిగా లేకపొతే మనకు మోక్షం లేదు. అందుకే బాబా మంకివాన్ని భోధించారు.
శ్రీ సాయి నాద చరితామృతం
మొదటి అధ్యాయం - గురువారం పారాయణ
రెండవ అధ్యాయం - శుక్రవారం పారాయణ
మూడవ అధ్యాయం - శనివారం పారాయణ
నాల్గవ అధ్యాయం - ఆదివారం పారాయణ
ఐదవ అధ్యాయం - సోమవారం పారాయణ
ఆరవ అధ్యాయం - మంగళవారం పారాయణ
ఏడవ అధ్యాయం - బుధవారం పారాయణ
ముగింపు హారతి పాట
